Hinduja Scandal: పనివాళ్లకు పెంపుడు కుక్క ఖర్చు కంటే తక్కువ జీతం.. కోర్టుకెక్కిన వివాదం
హిందూజా కుటుంబం తమ ఇంట్లో పనిచేసే ఉద్యోగులకు తమ పెంపుడు కుక్కల కోసం ఖర్చు చేస్తున్నదాని కంటే తక్కువ వేతనాలు చెల్లిస్తుందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది.
Hinduja Family: హిందూజా కుటుంబం బ్రిటన్‌లో అత్యంత ధనిక కుటుంబంగా గుర్తింపు పొందింది. వీరికి ఇండియాలో బ్యాంకింగ్ నుంచి ఇతర అనేక వ్యాపారాలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం హిందూజా ఫ్యామిలీ భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబాల్లో 7వ స్థానంలో కొనసాగుతుండగా.. ఆసియాలో వీరు 12వ స్థానంలో కొనసాగుతున్నారు.
అయితే హిందూజా కుటుంబం బ్రిటన్‌లో తమ ఇంటిలో పనిచేసే పనివారి పట్ల అనుచితంగా వ్యవహరించటంతో పాటు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు అక్కడ పనిచేస్తున్న వారికి తక్కువ వేతనాలు అందిస్తున్నట్లు సైతం పలు ఫిర్యాదులు పెరిగాయి. వాస్తవానికి అక్కడ పనిచేసేవారికి రోజుకు 7 ఫ్రాంక్స్ అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.660 చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. అయితే ఇదే క్రమంలో వారు తమ పెంపుడు కుక్కలకు రోజుకు రూ.2000 ఖర్చు చేస్తున్నట్లు వస్తున్న వార్తలు పెద్ద చర్చకు దారితీశాయి. స్విట్జర్లాండ్‌లోని హిందూజా హౌస్‌లో పనిచేస్తున్న పనివారు రోజుకు ఇంత తక్కువ వేతనాలకు రోజూ 15-18 గంటలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
పరమానంద్ దీప్‌చంద్ హిందూజా బ్రిటీష్ ఇండియాలోని సింధ్ ప్రావిన్స్‌లోని సికరపూర్ ప్రాంతానికి చెందిన వారు. అయితే ఈ ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్ దేశంలో భాగంగా ఉంది. వీరి కుటుంబం 1914లో ఇండియాలోని ముంబైకి మారి ఆ తర్వాతి కాలంలో బ్యాంకింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అయితే తర్వాత 1979లో హిందూజా కుటుంబం లండన్ కు తరలిపోయింది. దీంతో పరమానంద్ దీప్‌చంద్ నలుగురు కుమారుకు బ్రిటిష్ పౌరులుగా ఉన్నారు. ప్రస్తుతం హిందూజా కుటుంబం ఆటోమొబైల్ రంగంలో అశోక్ లేలాండ్, బ్యాంకింగ్ రంగంలో ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీలను కలిగి ఉంది. దీనికి తోడు వీరి కుటుంబం ఇండియాలో ఐటీ సేవలు, హెల్త్‌కేర్, ఎంటర్‌టైన్మెంట్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలకు సైతం తన వ్యాపారాలను విస్తరించింది.
2023లో పెద్ద కుమారుడు శ్రీచంద్ హిందూజా మరణం తర్వాత అతని సోదరుడు గోపీచంద్ హిందూజా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. గోపీచంద్ లండన్‌లో, ప్రకాష్ మొనాకోలో, అశోక్ ముంబైలో నివసిస్తున్నారు. మే 2023లో బాధ్యతలు చేపట్టిన ఛైర్మన్ గోపీచంద్ తన ఫోకస్ విద్యుత్, మౌలిక సదుపాయాలు రంగాలపై పెట్టారు.
హిందూజా గ్రూప్ కంపెనీలు:
- హిందూజా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్
- అశోక్ లేలాండ్
- స్విచ్ మొబిలిటీ
- అశోక్ లేలాండ్ ఫౌండ్రీస్
- P D హిందూజా నేషనల్ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్
- హిందూజా హెల్త్‌కేర్ లిమిటెడ్
- హిందూజా బ్యాంక్ (స్విట్జర్లాండ్) లిమిటెడ్ (గతంలో అమాస్ బ్యాంక్)
- ఇండస్ఇండ్ బ్యాంక్
- హిందూజా లేలాండ్ ఫైనాన్స్ లిమిటెడ్
- హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ లిమిటెడ్
- హిందూజా టెక్ లిమిటెడ్
- GOCL కార్పొరేషన్ లిమిటెడ్
- గల్ఫ్ ఆయిల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్
- గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఇండియా లిమిటెడ్
- క్వేకర్-హౌటన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్
- గల్ఫ్ ఆయిల్ మిడిల్ ఈస్ట్ లిమిటెడ్
- హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
- హిందూజా రెన్యూవబుల్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్
- హిందూజా రియల్టీ వెంచర్స్ లిమిటెడ్
- హిందూజా గ్రూప్ ఇండియా లిమిటెడ్
- KPB హిందూజా కాలేజ్ ఆఫ్ కామర్స్
- NXTDIGITAL Ltd
- Cyqurex సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్
- బ్రిటిష్ మెటల్ కార్పొరేషన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్
- హిందూజా ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ప్రాజెక్ట్ సర్వీసెస్ లిమిటెడ్
హిందూజా కుటుంబం తరపు న్యాయవాదులు.. బెర్టోస్సా వాదనలను ప్రతిఘటించారు. పారితోషికంలో బోర్డింగ్, లాడ్జింగ్‌లు ఉంటాయని, కేవలం నగదు మాత్రమే కాదని తెలిపారు. ఈ క్రమంలో ప్రకాష్, కమల్‌లకు ఐదున్నరేళ్లు, అజయ్, అతని భార్య నమ్రతకు నాలుగున్నరేళ్లు జైలు శిక్ష విధించాలని బెర్టోస్సా కోర్టును కోరారు. కోర్టు ఖర్చుల కింద కుటుంబానికి 1 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.9.43 కోట్లతో పాటు సిబ్బందికి నష్టపరిహారం కింద రూ.33.02 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై క్రిమినల్ విచారణ కొనసాగుతోంది.
భారతదేశంలోని హిందూజా గ్రూప్ రిక్రూట్‌మెంట్‌ను నిర్వహిస్తున్నందున వివరణాత్మక పని పరిస్థితుల గురించి తనకు తెలియదని అజయ్ వాంగ్మూలం ఇచ్చారు. అనధికారికంగా కాకుండా థర్డ్ పార్టీ ద్వారా స్థానికంగానే సిబ్బందిని నియమించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.