Income Tax: బడ్జెట్ ప్రకటనతో బ్యాంకుల్లోకి డబ్బుల వరద - అదనంగా రూ.45,000 కోట్లు!
Budget 2025: బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్ను శ్లాబుల్లో నూతన మార్పులు సహా అనేక అంశాలపై ఆర్థిక సేవల కార్యదర్శి మీడియాతో మాట్లాడారు. బ్యాంకులకు అదనంగా 45,000 కోట్లు సమకూరుతాయని అన్నారు.

Additional Rs 45,000 Crore Bank Deposits: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), 01 ఫిబ్రవరి 2025న దేశ సాధారణ బడ్జెట్ (Union Budget FY 2025-26) ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రకటనల్లో భాగంగా, కొత్త పన్ను విధానం (New Tax Regime) కింద పన్ను స్లాబ్‌ను మార్చారు. రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపును ప్రకటించారు. ఫలితంగా, బ్యాంక్ డిపాజిట్లు రూ. 40,000-45,000 కోట్ల మేర పెరుగుతాయని అంచనా వేశారు.
సీనియర్ సిటిజన్లకు బిగ్ రిలీఫ్
బడ్జెట్ 2025లో సీనియర్ సిటిజన్లకు కూడా బహుమతి ఆర్థిక మంత్రి బహుమతి ప్రకటించారు. దేశంలోని సీనియర్ సిటిజన్లను దృష్టిలో ఉంచుకుని, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటుపై టీడీఎస్ పరిమితి (TDS limit on bank fixed deposit interest rate)ని రూ. 40,000 నుంచి రూ. 1 లక్షకు పెంచుతూ ప్రతిపాదించారు. అదే సమయంలో, 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి వడ్డీపై TDS పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 40,000 నుంచి రూ. 50,000 కు పెంచారు.
పన్ను శ్లాబ్‌ల్లో మార్పుల వల్ల బ్యాంకులకు ప్రయోజనం
పన్ను భారంలో ఉపశమనం వల్ల ప్రజల చేతుల్లో మరింత డబ్బు మిగులుతుంది, బ్యాంకుల్లోకి అదనంగా దాదాపు రూ. 40,000-45,000 కోట్ల డిపాజిట్లు వస్తాయని అంచనా వేస్తున్నట్లు ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు తెలిపారు. డిపాజిట్లు పెరిగితే బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు ప్రవాహం కూడా పెరుగుతుంది. ఇది, అధిక వడ్డీ రేట్ల రుణాలపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది. బ్యాంకుల 'కరెంట్ అకౌంట్స్ సేవింగ్స్ అకౌంట్స్' (CASA) నిష్పత్తి ఇప్పటికే ఏటా 40 శాతం స్థాయిలో ఉందని, బడ్జెట్‌లో చేసిన ఈ ప్రకటనలు దీనికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని నాగరాజు వెల్లడించారు. CASA నిష్పత్తి అంటే, ఒక బ్యాంక్ మొత్తం డిపాజిట్లకు - కరెంట్ & సేవింగ్స్ ఖాతాలలోని డిపాజిట్లకు ఉంటే నిష్పత్తి.
బీమా చట్టాల (సవరణ) బిల్లు ప్రక్రియ వేగవంతం
బీమా చట్టాల (సవరణ) బిల్లు (Insurance Laws (Amendment) Bill)ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఆమోదించిందని, ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) పరిమితిని 100%కి పెంచడం సహా ఆ రంగంలో భారీ మొత్తంలో పెట్టుబడులకు వీలు కల్పిస్తుందని ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు తెలిపారు. అంతేకాదు, బీమా రంగంలో పెద్ద ఎత్తున సంస్కరణ ప్రతిపాదనలు ఉన్నాయి, వాటిలో కాంపోజిట్ లైసెన్సింగ్ కూడా ఒకటి. ఆ ప్రతిపాదనలను ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో (Parliament Budget Sessions) ప్రవేశపెట్టనున్నట్లు నాగరాజు చెప్పారు. బీమా చట్టాల (సవరణ) బిల్లు తుది ముసాయిదాను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని, దీనిని త్వరలో కేబినెట్ ఆమోదం కోసం పంపుతామని నాగరాజు తెలిపారు.
మరో ఆసక్తికర కథనం: రూ.10, రూ.20 నాణేలపై బిగ్ న్యూస్ - లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

