Astrology: ఈ 5 రాశులవారికి పెళ్లి కన్నా డేటింగే ఇష్టం!
zodiac signs:డేటింగ్ అంటే అప్పట్లో అదో పెద్ద తప్పులా చూసేవారు కానీ మారుతున్న కల్చర్ బట్టి ఆలోచనా విధానం మారుతోంది. అయితే ఈ ఆలోచన కూడా మీ రాశిపైనే ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు
Dating and Zodiac Traits: దేనికైనా రాసిపెట్టి ఉండాలంటారు పెద్దలు. మరీ ముఖ్యంగా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించి ఉంటాయని...అక్కడ రాసిపెట్టి ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా జరిగిపోతుంది...అక్కడ రాసిపెట్టి లేకపోతే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా జరగదు అంతే . అయితే ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలు కూడా మీ రాశిపై ఆధారపడి ఉంటుందంటారు పండితులు. మీ గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు కొంత మారినా ఒకే రాశికి చెందిన వారిలో కామన్ గా కొన్ని లక్షణాలుంటాయని చెబుతారు. ఇక ప్రేమ, పెళ్లి విషయానికొస్తే కొన్ని రాశులవారు ప్రేమ వివాహాలను ఇష్టపడతారు, మరికొన్ని రాశులవారు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లకు ఓటేస్తారు. ఇంకొన్ని రాశులవారు మాత్రం పెళ్లికన్నా సహజీవనంపైనే ఇంట్రెస్ట్ చూపిస్తారట. అంటే వీళ్లు పెళ్లిచేసుకోరని కాదు కానీ ఆ బంధంలో ఇమడేందుకు చాలా కష్టపడతారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఈ ఐదు రాశులవారు ఈ కోవకు చెందుతారు
Also Read: ప్రేమను వ్యక్తం చేయడంలో మీ రాశి ర్యాంక్ ఎంతో తెలుసా!
మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
దీర్ఘకాలకి సంబంధాలంటే మేష రాశివారికి అస్సలు నచ్చదట. తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో సంసార జీవితాన్ని భారంగా భావిస్తారట. భావోద్వేగాలు, సంబంధాల కన్నా వీళ్లు ఏకాంతంగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అదే సమయంలో స్వల్పకాలిక సంబంధాలపై ఆసక్తి చూపించే వారిపై ప్రేమ పెంచుకుంటారు. అంటే ఒకరిపై ప్రేమ శాశ్వతం కాదన్నది వీరి అభిప్రాయం.
మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఈ రాశివారి వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఉంటుంది. వీరిపై ఎవ్వరి ప్రభావం ఉండదు..మనసు ఏం చెబితే అది చేసేందుకు వెనుకాడరు. ఎవ్వరి మాటా వినరు..చివరకు వారి మెదడు చెప్పిన మాటకూడా లెక్కచేయరు కేవలం మనసు చెప్పిందే ఫైనల్ అని భావిస్తారు. వీరి అభిరుచులు, అలవాట్లు మారుతుంటాయి. ఓ బంధంలో బంధీగా ఉండడం వీరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎలాంటి సంక్లిష్టతలు లేని రొమాన్స్ తో నిండిన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు.
సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
సింహ రాశివారు తమ జీవితానికి తామే రాజు తామే మంత్రి అవ్వాలనుకుంటారు. వీళ్లు ఆధిపత్యం చెలాయించే బ్యాచే కానీ ఆధిపత్యాన్ని సహించే బ్యాచ్ కాదు. తమ ప్రియమైన వారిపై అంతులేని ప్రేమ చూపిస్తారు.ఈ రాశివారికి స్వల్పకాలిక సంబంధాలపై ఆసక్తి ఎక్కువ ఉంటుందట. అందుకే పెళ్లికన్నా డేటింగ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు.
Also Read: మీ రాశి మీ బలహీనత ఏంటో చెప్పేస్తుంది.. మీ వీక్ నెస్ ఏంటో తెలుసుకోండి..
ధనుస్సు రాశి (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ధనస్సు రాశివారు బందం అంటే బంధిఖానాలా ఫీలవుతారు. అందుకే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడరు. ఒకరి చెప్పుచేతల్లో ఉండటం, వారికి నచ్చనట్టు నడుచుకోవాలనే ఫీలింగ్ వీరికి అస్సలు నచ్చదు. తప్పని సరి పరిస్థితుల్లో బంధానికి బంధీ అవుతారు కానీ వీరికి స్వేచ్ఛగా ఎగరాలన్న కోరిక చాలా ఎక్కువ.
కుంభ రాశి (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఈ రాశివారి వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఉంటుంది. వీరికి కూడా కుటుంబ బంధాల్లో చిక్కుకుపోవడం ఇష్టం ఉండదు కానీ బాధ్యతల నుంచి పారిపోరు. తమ బాధ్యతను నెరవేరుస్తూనే తమ ఇష్టాయిష్టాలకు కూడా ప్రాధాన్యతను ఇచ్చుకుంటారు. రొటీన్ రొమాన్స్ అంటే వీళ్లకి అస్సలు నచ్చదట. ప్రేమ, బంధం విషయాల్లో వీళ్ల అభిరుచులే వేరంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
Also Read: మీది ఏ రాశి, మీరు ఆఫీసులో సహోద్యోగులతో ఎలా ఉంటారో తెలుసా!
కొన్ని పుస్తకాలు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. మీ జన్మ నక్షత్రంలో గ్రహస్థితి ఆధారంగా కూడా మీ వ్యక్తిత్వంలో చాలా మార్పులుంటాయి.ఇవన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు..