Zodiac Signs: మీది ఏ రాశి, మీరు ఆఫీసులో సహోద్యోగులతో ఎలా ఉంటారో తెలుసా!
ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
మేషం
ఈ రాశివారు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. కార్యాలయంలో తమ సహోద్యోగులకు సహాయకారిగా ఉంటారు.ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా తామున్నామంటూ అభయహస్తం ఇస్తారట..
వృషభం
వృషభ రాశివారు క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్. పని రాక్షసులు అనిపించుకునేలా పనిచేస్తారు. అసరమైన దానికన్నా ఎక్కువ కష్టపడతారు కానీ పని ఎగ్గొట్టే ప్రయత్నం అస్సలు చేయరట. వీళ్లుపనిచేయడంతో వీరితో పాటూ ఉన్న సహోద్యోగులు కూడా ఎంచక్కా పనిపై దృష్టిసారిస్తారు.
మిథునం
మల్టిపుల్ టాస్కులను ఒకేసారి చేయగల సమర్థులు మిథున రాశివారు. కానీ వీళ్లకి వెంటవెంటనే ఆపని బోర్ కొట్టేస్తుంది. ఆ కబుర్లు, ఈ కబర్లు చెప్పుకోవడం అంటే భలే ఇష్టం. ఎవ్వరికీ హానిచేయరు కానీ పని వాతావరణం డల్ గా ఉంటే అస్సలు సహించలేరు. అందుకే ఈ రాశివారితో కలసి పనిచేసేవారికి అలసట తెలియదు
Also Read: పెళ్లిలో అరుంధతీ నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు, ఇంత అర్థం ఉందా!
కర్కాటకం
కర్కాటక రాశివారు పనిని పట్టుకుంటే వదలరు. వీళ్లు గొప్ప టీమ్ ప్లేయర్స్. తాము ఎక్కువ అనే ఫీలింగ్ కిందవారికి కలగనీయకుండా కలసి పనిచేయడంలో ముందుంటారు. ఎలాంటి మొండివారితోఅయినా పనిచేయించగల సామర్థ్యం కర్కాటక రాశివారి సొంతం.
సింహం
అడవికి రాజు సింహం అంటారుగా..ఈ రాశివారు ఆఫీసుకి బాస్ కాకపోయినా ఉద్యోగుల్లో టాప్ గా ఉండాలనుకుంటారు. తమ పనిని బాస్ గుర్తించాలని తెగ ఆరాటపడుతుంటారు. టైమ్ దొరికితే చాలు బాస్ ని ఇంప్రెస్ చేసే పనిలో పడతారు.
కన్యా
ఈ రాశివారు పని రాక్షసులు. వీళ్లకి పనిచేయడానికి 24 గంటలు సరిపోవేమో... అలాగని అధిక ఒత్తిడికి లోనవుతారా అంటే అంతసీన్ లేదు. ఆడుతూ పాడుతూ శ్రద్ధగా పనిచేసుకుని వెళ్లిపోతారు. సహోద్యోగుల్లోనూ ఈ రేంజ్ ఉత్సాహం నింపడంలో సక్సెస్ అవుతారు కన్యారాశివారు.
Also Read: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!
తులా
ఈ రాశివారు కూడా పనంటే ముందుంటారు. టీమ్ వర్క్ చేయడం, చేయించడం వీళ్లకి మహా సరదా. టీమ్ లో ఒక్కరు తగ్గినా ఆ ప్రభావం పనిపై పడకుండా చూసుకుంటారు. అందుకే పనికి లోటు జరగకుండా అన్ని పనుల్లోనూ తామున్నామంటారు.
వృశ్చికం
ఈ రాశివారికి పనిపట్ల ఏకాగ్రత చాలా ఎక్కువ. ఏ పని చేయాలి, ఎంతవరకూ చేయాలనేది ఫుల్ క్లారిటీ మెంటైన్ చేస్తారు. వీరికి పుట్టిందే బుద్ధి.వీళ్లకు కలిగిన ఆలోచనను ఎవ్వరూ మార్చలేరు. అనుకున్నది అనుకున్నట్టు చేయడంలో సిద్ధహస్తులు. మహా మొండి ఘటం.
ధనస్సు
సరదాకి కేరాఫ్ అడ్రస్ ధనస్సు రాశివారు. వీళ్ల ఆలోచనలు చాలా పాజిటివ్ గా ఉంటాయి. అందరితో సరదాగా ఉంటూ.. అందర్నీ కలుపుకుని పోయేందుకు ప్రయత్నిస్తారు..సక్సెస్ అవుతారు కూడా. ఈ రాశి ఉద్యోగులు ఎక్కడున్నా, ఏ విభాగంలో పనిచేసినా వీళ్లకో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వీళ్లతో కలసి పనిచేసేందుకు సహోద్యోగులు ఇంట్రెస్ట్ చూపిస్తారు.
Also Read: ఆగస్టు 18 or 19 శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి
మకరం
ఈ రాశివారు గురిపెట్టారంటే దాన్నుంచి దృష్టి మార్చుకోరు...తమ సహోద్యోగులను కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తారు. పని గురించి బాగా ఆలోచిస్తారు..పని చేయిస్తారు. కొన్నిసార్లు సెల్ఫిష్ గా ఉంటారు. అందుకే ఈ రాశి వారితో సహోద్యోగులు ఎంతవరకూ ఉండాలో అంతవరకూ ఉంటే మంచిది.
కుంభం
చిన్న సమస్యను కూడా పెద్దగా చేయడంలో కుంభ రాశివారు సిద్ధహస్తులు. ఇంటిపైకి రాయి విసిరి వీపు పట్టినట్టు.. వివాదాలు కొనితెచ్చుకుంటారు. ఫలితంగా వీరితో పాటూ ఉన్న సహోద్యోగులు కూడా ఇరుక్కుపోయే సందర్భాలు ఎదురవుతాయి.
మీనం
పని రాక్షసుల్లో మీనరాశివారికి కూడా చోటుంటుంది. ఆఫీసులో పని విషయంలో ఈ రాశివారు సరిగానే ఆలోచిస్తారు కానీ.. ఒక్కోసారి అతిగా ఆలోచించి చిక్కుల్లో చిక్కుకుంటారు. వీరి కారణంగా పక్కనున్నవాళ్లు కూడా బుక్కైపోతారు.