News
News
X

Spirituality:పెళ్లిలో అరుంధతీ నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు, ఇంత అర్థం ఉందా!

హిందూసంప్రదాయం ప్రకారం పెళ్లిలో తాళికట్టిన అనంతరం వధూవరులకు అరుంధతి నక్షత్రం చూపిస్తారు. వరుడు వధువుకి ఆ నక్షత్రాన్ని చూపించాక ఇద్దకూ కలసి నమస్కారం చేస్తారు.పెళ్లికి, అరుంధతి నక్షత్రానికి ఏంటి సంబంధం

FOLLOW US: 

మహా పతివ్రతల్లో ఒకరు అరుంధతి. వశిష్టమహర్షి భార్య. పెళ్లిసమయంలో పెళ్లికుమారుడు, పెళ్లి కుమార్తెకు ఆకాశంలో నక్షత్ర రూపంలో ఉన్న అరుంధతిని చూపిస్తారు. ఎందో మహా పతివ్రతలుండగా అరుంధతినే ఎందుకు చూపిస్తారు. నూతన దంపతలకు అరంధతిని చూపించడం వెనుకున్న ఆంతర్యం ఏంటి...

బ్రహ్మచారికోసం వెతికిన బ్రహ్మదేవుడి కుమార్తె
బ్రహ్మ కుమార్తె పేరు సంధ్యాదేవి. తనకు ఉపదేశము చేయగల బ్రహ్మచారి కోసం ముల్లోకాలు వెదకడం ప్రారంభించింది సంధ్యాదేవి.  వశిష్ఠుడే తనకు ఉపదేశం చేసేందుకు తగినవాడని భావించి విని..ఆయన్న ఆశ్రయించింది. బ్రహ్మచారి అయిన వశిష్ఠుడు ఆమెకు ఉపదేశం చేయడానికి అంగీకరించాడు. ఉపదేశ అనంతరం సంధ్యాదేవి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంది. ఆ అగ్ని నుంచి ప్రాతః సంధ్య, సాయం సంధ్య లతో పాటు ఒక స్త్రీ రూపం వెలువడ్డాయి. అందమైన ఆ స్త్రీ రూపమే  మహా పతివ్రత అరుంధతి.

Also Read: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!

ఇసుకతో అన్నం వండిన అరుంధతి
వశిష్ఠుడు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని తగిన వధువు కొరకు అన్వేషణ ప్రారంభించాడు. తనను పెళ్లిచేసుకునే స్త్రీకి ఓ పరీక్ష పెట్టాడు వశిష్టుడు. అదేంటంటే...ఇసుకతో అన్నం వండటం. అందుకే ఓ  ఇసుక మూటను పట్టుకుని దాన్ని అన్నంగా వండగలిగినవారు ఎవరంటూ సంచారం చేశారు. ఆ సందర్భంలో అరుంధతి..వశిష్టుడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నించింది. తనకున్న దైవబలంతో ఇసుకను బియ్యంగా మార్చి వండి వడ్డించింది అరుంధతి. సంతోషించిన వశిష్ఠుడు ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అయితే తన చేతి కమండలం అరంధతికిచ్చి తాను తిరిగివచ్చేవరకూ దాన్ని చూస్తూ ఉండమని చెప్పి వెళ్లాడు. 

Also Read: ఆగస్టు 18 or 19 శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి

ఏళ్ల తరబడి చూపు మరల్చని అరుంధతి
ఏళ్ల తరబడి అరుంధతి ఆ కమండలాన్నే చూస్తూ ఉండిపోయింది. అయినా వశిష్ఠుడు తిరిగి రాలేదు. ఎందరో పండితులు,రుషులు ఆమెను చూపు మరల్చమని చెప్పినా చూపు తిప్పలేదామె. చివరకు బ్రహ్మాదిదేవతలు దిగివచ్చి ఆమెను కమండలము నుంచి చూపు మరల్చాలని చెప్పినా వినలేదు. ఇక చేసేది లేక విశిష్టుడిని వెతికితీసుకొచ్చి ఆమెముందు నిలిపారు. ఆయన రాకతో తన చూపును కమండలం నుంచి విశిష్టుడి వైపు మరల్చింది. అప్పుడు బ్రహ్మాదిదేవతల సమక్షంలో అరుంధతిని పెళ్లిచేసుకున్నాడు విశిష్టుడు. అప్పటి నుంచి మనసా, వాచా, కర్మణా వశిష్టుడిని అనుసరించి మహాపతివ్రతగా నిలిచిపోయింది అరుంధతి. 

Also Read:  రాశిమారిన అంగారకుడు, ఈ రాశులవారికి ఆరోగ్యం, ఆదాయం, ఆనందం

నవవధువు కూడా అరుంధతిలా ఉండాలని
అరుంధతి తన సౌభాగ్య, పాతివ్రత్య దీక్షతో నక్షత్ర రూపంలో వెలుగుతూ ఆకాశంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే  మూడుముళ్లు వేసిన తర్వాత వరుడు..వధువుకి అరుంధతి నక్షత్రం చూపిస్తాడుయ. అరుంధతిలా సహనం, శాంతం, ఓర్పు, పాతివ్రత్య లక్షణాలు కలగి ఉండాలని..ఆ బంధం అరంధతి, వశిష్టులులా చిరస్థాయిగా వెలగాలని, నిలవాలని దాని అర్థం.  అరుంధతి వశిష్టుల కుమారుడు శక్తి. శక్తి కుమారుడు పరాశరుడు. ఈ పరాశరుడు మత్సకన్యను కోరుకుంటాడు. వీరికి పుట్టిన కుమరుడే వ్యాసమహర్షి...అలా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం.

Published at : 16 Aug 2022 11:14 AM (IST) Tags: arundhati star in marriage time arundhati nakshatram importance of arundati nakshatram in weddings story behind arundhati nakshatram significance of arundhati nakshatram arundhati nakshatram story in telugu arundhati and vashistha

సంబంధిత కథనాలు

Horoscope Today 25th September 2022:  ఈ రాశివారికి గుడ్ డే అయినప్పటికీ ఏదో నిరాశతో ఉంటారు,సెప్టెంబరు 25 రాశిఫలాలు

Horoscope Today 25th September 2022: ఈ రాశివారికి గుడ్ డే అయినప్పటికీ ఏదో నిరాశతో ఉంటారు,సెప్టెంబరు 25 రాశిఫలాలు

Zodiac Signs: జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి

Zodiac Signs:  జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి

TTD Board Meeting : టిక్కెట్లు లేకపోయినా సర్వదర్శనం, వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు-టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలివే!

TTD Board Meeting :  టిక్కెట్లు లేకపోయినా సర్వదర్శనం, వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో  మార్పు-టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలివే!

Dussehra 2022: దసరాల్లో పిల్లలకు పూజ చేస్తుంటారు కదా - ఏ వయసు పిల్లల్ని పూజిస్తే ఎలాంటి ఫలితం!

Dussehra 2022: దసరాల్లో పిల్లలకు పూజ చేస్తుంటారు కదా - ఏ వయసు పిల్లల్ని పూజిస్తే ఎలాంటి ఫలితం!

Dussehra 2022: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారం రోజు ఏ నైవేద్యం సమర్పించాలి!

Dussehra 2022: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారం రోజు ఏ నైవేద్యం సమర్పించాలి!

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు