By: RAMA | Updated at : 13 Aug 2022 05:17 AM (IST)
Edited By: RamaLakshmibai
Krishna Janmashtami 2022 (Image Credit: Pinterest)
శ్రీకృష్ణ జన్మాష్టమి 2022
తిథులు ముందురోజు, తర్వాతి రోజు వచ్చినప్పుడు పండుగ ఏ రోజు జరుపుకోవాలనే డైలమా ఉంటుంది. నిన్నటి వరకూ రాఖీ పౌర్ణమి విషయంలో ఇదే జరిగింది...ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి అదే సందిగ్ధం నెలకొంది. అయితే శ్రీ కృష్ణ జన్మాష్టమి ఏరోజు జరుపుకోవాలని చర్చించుకునే ముందు అష్టమి తిథి ఉన్న సమయాన్ని చూద్దాం..
Also Read: నిద్రలేవగానే చాలామంది అరచేతులు చూసుకుని లేస్తారు, ఇది మంచిదా కాదా!
కృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని కృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకుంటారు. కన్నయ్య చిన్నప్పుడు గోకులంలో పెరగడం వల్ల గోకులాష్టమి అని కూడా అంటారు. కృష్ణాష్టమి రోజున ఒకపూట భోజనం చేసి శ్రీకృష్ణునికి పూజ చేసి శ్రీకృష్ణని దేవాలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది. సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది.
Also Read: ఈ 5 రాశుల అబ్బాయిలను పెళ్లిచేసుకున్న అమ్మాయిలు అదృష్టవంతులు
ఓం నమో నారాయణాయ, నమోభగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు!
ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ రుక్మిణీ శాయ నమః!
ఓం అచ్యుతా అచ్యుతాహరే పరమాన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవభగవాన్ అనిరుధ్య శ్రీపతే శమయ దుఃఖమశేషం నమః!
ఈ మంత్రాన్ని 108 సార్లు ధ్యానం చేసేవారిని దుఃఖం దరిచేరదంటారు
కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా భగవానుడి స్మరణ కూడా ముఖ్యమే. ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ కొలుస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి, కొందరు రాత్రివేళ కృష్ణుడిని పూజించి మర్నాడు ఉదయం దగ్గర్లో ఉన్న వైష్ణవ ఆలయాలకు వెళ్లి ఉపవాసం విరమిస్తారు.
Karthika Masam Ending Poli Swargam 2023 Date: కార్తీకమాసం ఎప్పటితో పూర్తవుతుంది - ఆఖరి రోజు చదువుకోవాల్సిన కథ ఇదే!
Karthika Masam 2023:ఈ పత్రాలు త్రిశూలానికి సంకేతం - అందుకే శివపూజలో ప్రత్యేకం!
Ashtadasa Maha Puranas: అష్టాదశ పురాణాలు ఏవి - ఏ పురాణంలో ఏముంది!
Horoscope Today November 28, 2023: ఈ రాశివారికి ఆదాయం, పనిభారం రెండూ పెరుగుతాయి - నవంబరు 28 రాశిఫలాలు
Lakshmi Puja : దరిద్రుడిని కూడా ధనవంతుడిని చేసే పూజ ఇది - ఇలా చేస్తే కాసుల వర్షం కురుస్తుంది
Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల
Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి
Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !
Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు
/body>