వీధి పోటు ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదు

వీధి పోట్లలో చాలా రకాలు ఉన్నాయి. చాలా వరకు వీధిపోట్ల వల్ల ఇబ్బందులు తలెత్తితే, మరికొన్ని రకాల వీధి పోట్లు వల్ల శుభఫలితాలుంటాయి.

వీధి పోటు ఇలా ఉంటే మంచిది..
తూర్పు వైపు - తూర్పుఈశాన్యం
ఉత్తరం- ఉత్తర ఈశాన్యం
పడమర- పడమర వాయువ్యం
దక్షిణం- దక్షిణ ఆగ్నేయం
ఇవి కూడా బాల్కనీ, ఖాళీజాగాకి రావొచ్చు కానీ.. రాజద్వారానికి రాకూడదు.

తూర్పు వైపు రోడ్డు పోటు
తూర్పుకి ఉంటే - మనశ్సాంతి ఉండదు
తూర్పు ఆగ్నేయం- ఇల్లాలి ఆరోగ్యం చెడిపోతుంది, మనశ్సాంతి ఉండదు
తూర్పు ఈశాన్యం- మనశ్సాంతి, ఐశ్వర్యం

దక్షిణం
దక్షిణం- యజమానికి మరణం, ఇంట్లో ఉన్న మగపిల్లాడికి మరణం
దక్షిణ ఆగ్నేయం- ఇంట్లో అందరి ఆరోగ్యం బావుంటుంది
దక్షిణ నైరుతి- వారసులు బతికి ఉండరు

పడమర
పడమర- దంపతుల మధ్య కలహాలు, విడిపోతారు, అవివాహితులకు పెళ్లిళ్లు కావు
పడమర నైరుతి -అప్పుల పాలు
పడమర వాయువ్యం- రాజయోగం, రాజకీయ నాయకులకు మంచిది

ఉత్తరం
ఉత్తర వాయువ్యం- ఇంట్లో నిత్యం కలహాలు
ఉత్తరం- ఆస్తి నష్టం, కోర్టు కేసులు
ఉత్తర ఈశాన్యం- యజమానికి ఆయుష్షు పెరుగుతుంది, ఇంట్లో మనశ్సాంతి ఉంటుంది.

రోడ్డు ఇంటికి అభిముఖంగా వచ్చి తగలడాన్ని రోడ్డు పోటు అంటారు.

రోడ్డు పోటు వచ్చిన రహదారి వెడల్పు కన్నా మధ్యలో ఇంకో పెద్ద రోడ్డు ఉంటే ఆ రోడ్డు పోటు ప్రభావం ఉండదు.

ఆ రోడ్డు నుంచి చాలా ఎక్కువ మంది వెళ్లడం వల్ల వారి చూపు, ఆ ఇంటిపై పడి ఆ ఇంటి లక్ష్మీస్థానానికి యజమాని దూరమవుతాడు. అందుకే రోడ్డు పోటు ఉండకూడదు అంటారు.

రోడ్డు పోటు వల్ల ఇబ్బందులు తొలగాలంటే..
రోడ్డు పోటుకి అభిముఖంగా వినాయక విగ్రహం పెట్టాలి. వాస్తు పూజలు చేయించాలి.

Thanks for Reading. UP NEXT

ఓవర్సీస్ ప్రీమియర్స్.. సత్తా చాటిన బన్నీ సినిమాలు..

View next story