ఆదిత్య 369 - బాలకృష్ణ హీరో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ఈ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ సినిమా. టాలీవుడ్ లో ఈ సినిమా ఒక క్లాసిక్ గా నిలిచిపోతుంది.



రోబో - రజినీకాంత్ కెరీర్ లో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా ఆడియన్స్ ను ఎంతగానో అలరించింది.



నాని - మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.



2.ఓ - 'రోబో'కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాను కూడా సైన్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కించారు.



24 - టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా అటు తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజయింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.



ప్లే బ్యాక్ - దినేష్ తేజ్, అనన్య నాగళ్ల జంటగా నటించిన ఈ సినిమా కూడా సైన్స్ ఫిక్షన్ కథాంశంతోనే రూపొందింది.



టాక్సీవాలా - విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ చాలానే ఉంటాయి.



అద్భుతం - డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలోనే సాగుతుంది.



ప్రాజెక్ట్ K - టాలీవుడ్ లో రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని సమాచారం.