చిరంజీవి - బుల్లితెరపై ప్రసారమైన 'ఎవరు మీలో కోటీశ్వరుడు' షో కోసం చిరుకి రూ.9 కోట్లు రెమ్యునరేషన్ గా ఇచ్చారట. అక్కినేని నాగార్జున - 'బిగ్ బాస్' షో హోస్ట్ చేయడానికి రూ.5 నుంచి రూ.6 కోట్లు తీసుకుంటున్నారు నాగ్. సమంత - 'ఆహా'లో 'సామ్ జామ్' షోకి సమంత కోటి నుండి రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ గా తీసుకుందని సమాచారం. తమన్నా - 'మాస్టర్ చెఫ్' షోతో హోస్ట్ గా మారింది మిల్కీబ్యూటీ. దీనికోసం ఆమెకి రూ.3 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట. మంచు లక్ష్మీ - ఓటీటీలోనే కాకుండా బుల్లితెరపై కొన్ని షోలను హోస్ట్ చేస్తుంటుంది మంచువారమ్మాయి. ఎపిసోడ్ కి రూ.2 లక్షల చొప్పున ఆమెకి పే చేస్తారట. అలీ - 'అలీతో సరదాగా' షోని హోస్ట్ చేస్తోన్న అలీ.. ఎపిసోడ్ కి రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు. సాయికుమార్ - డైలాగ్ కింగ్ సాయికుమార్ 'వావ్' షోని హోస్ట్ చేస్తున్నారు. ఎపిసోడ్ కి లక్ష నుంచి రెండు లక్షల వరకు తీసుకుంటారట ఈ నటుడు. బాలకృష్ణ - 'ఆహా'లో 'అన్ స్టాపబుల్' షో హోస్ట్ చేయడానికి బాలయ్యకి రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రోజా - 'జబర్దస్త్'తో పాటు మరికొన్ని షోలను హోస్ట్ చేస్తుంటుంది రోజా. ఎపిసోడ్ కి రూ.2 లక్షల చొప్పున తీసుకుంటుందట రోజా.