'స్క్విడ్ గేమ్' వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. కొన్నిరోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ కొరియన్ వెబ్‌సిరీస్ కి విపరీతమైన ప్రేక్షకాదరణ లభించింది. ఈ సిరీస్ ను ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ, మలయాళ వంటి ప్రాంతీయ భాషల్లోకి కూడా డబ్బింగ్ చేశారు. ఈ సిరీస్ లో కీలకపాత్రలో నటించిన ప్రముఖ మోడల్ హోయెన్ జంగ్ తన క్యూట్ లుక్స్ తో, పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఈ సిరీస్ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది. ఈ క్రమంలో తను పది రోజుల్లో సుమారు నాలుగు కేజీల బరువు తగ్గినట్లు వెల్లడించింది. ప్రమోషన్స్ కోసం అమెరికాలో పలు ప్రాంతాలకు బాగా తిరిగామని చెప్పింది హోయెన్ జంగ్. ఆ సమయంలో తినడానికి టైం కూడా దొరికేది కాదని.. దీంతో బాగా బరువు తగ్గిపోయానని చెప్పుకొచ్చింది. బక్కచిక్కిపోయిన ఆమె చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బాగా తిని.. ఆరోగ్యంగా ఉండమంటూ సలహాలు ఇస్తున్నారు.