టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క లేడీ ఓరియెంటెడ్ కథలకు ఓకే చెబుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మహేష్ బాబుతో కలిసి 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. ఈరోజు క్రిస్మస్ కావడంతో కీర్తి తన స్నేహితులతో, పెట్ తో కలిసి వేడుకలు జరుపుకుంది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో కీర్తి సురేష్ స్మైల్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. తన పెట్ తో కలిసి కీర్తి ఇచ్చిన క్యూట్ ఫోజులు ఆకట్టుకుంటున్నాయి. కీర్తి సురేష్ క్రిస్మస్ సెలబ్రేషన్స్..