కరోనా దెబ్బకు రెండేళ్లుగా గందరగోళంగా ఉన్న పరిస్థితి ఈ ఏడాది కాస్త సెట్టైనట్టే ఉంది. అందుకే అందర్లో పండుగ ఉత్సాహం కనిపిస్తోంది.
క్రిస్మస్ అంటేనే కానుకల పండుగ. శాంటాక్లాజ్ వచ్చి అందరికీ కానుకలు ఇస్తాడనే విశ్వాసంతో..తమకు ఎలాంటి బహుమతి లభిస్తుందో అనే ఆశగా ఎదురుచూస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ పండుగ అంటే భలే ఇష్టం.
కొందరు పెద్దలు తాము శాంటాక్లాజ్ గా మారి కుటుంబసభ్యులు, స్నేహితులకు సర్ ప్రైజ్ గిఫ్టులు ఇస్తుంటారు. కొందరైతే పేదలకు ఆహారం, బహుమతులు అందిస్తారు. మరికొందరు వారితోనే వేడుక జరుపుకుంటారు.
క్రిస్మస్ అంటేనే ట్రీ, శాంటా క్లాజ్ . అందుకే ఈ పండుగ వచ్చిందంటే వీటిపై చాలా దృష్టి పెడతారు. ఇంటిని అందంగా అలంకరించడం, ఆ చెట్టుకింద బహుమతులు పెట్టి ఇంట్లో వాళ్లని సర్ ప్రైజ్ చేయడం చేస్తుంటారు.
దాదాపు క్రిస్టియన్స్ అంతా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటారు. కొంచెం స్పెషల్ గా జరుపుకోవాలనుకునే వారు రమ్ కేక్, హాట్ చాక్లెట్ మేకింగ్ చేస్తుంటారు.
క్రిస్మస్ సందర్భంగా చాలా మంది ప్రత్యేక వంటకాలను తయారు చేసేందుకు సన్నద్ధమవుతుంటారు. తయారు చేసుకునే అవకాశం లేని వారు కొని తెచ్చుకుని అయినా కేక్ కట్ చేస్తారు.
క్రిస్మస్ సందర్భంగా స్నేహితులు, సన్నిహితులతో కలసి వేడుక జరుపుకుంటారు. ఇంట్లోనే డిస్కో లైట్లు పెట్టేసి పెద్ద పార్టీ అరెంజ్ చేసుకుంటున్నారు.
ఎక్కువ సమయం వెచ్చించేది ఇంటి అలంకరణకే అని చెప్పుకోవాలి. రోటీన్ కి భిన్నంగా, అత్యంత ఆకర్షణీయంగా ఇంటిని డెకరేట్ చేసుకుంటారు.