నటి సమంత తరహాలోనే.. తమన్నా కూడా తీర్థయాత్రల్లో బిజీగా గడిపేస్తోంది. ఇటీవల సమంత ఉత్తరాఖండ్‌లో చార్‌దామ్ యాత్రకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తమన్నా మాతా వైష్ణోదేవి యాత్రకు వెళ్లింది.



భారత దేశంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో శ్రీ వైష్ణో దేవి ఆలయం ఒకటి. 5200 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది.



తమన్నా తన స్కూల్‌లో హిందీ టీచర్‌ వినయ్‌తో కలిసి ఈ ట్రిప్‌కు వెళ్లడం గమనార్హం.



‘‘ఏడాదంతా షూటింగ్‌లో బిజీగా ఉన్న నేను ఇలా వైష్ణోదేవి ఆలయానికి రావడం చాలా గొప్పగా ఉంది. కౌల్ కందోలి నుంచి ప్రయాణం మొదలుపెట్టి.. భైరో బాబా దేవాలయం వరకు యాత్ర సాగింది’’ అని తమన్నా తెలిపింది.



‘సీటీమార్’, ‘మాస్ట్రో’ సినిమాలతో హిట్ అందుకున్న తమన్నా.. త్వరలో ‘F3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.



షూటింగ్స్‌కు బ్రేక్ రావడంతో తమన్నా.. ఇలా తీర్థయాత్రలకు ప్రయాణమైంది. ఆ తర్వాత మళ్లీ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌ల్లో పాల్గోనుంది.



ఇటీవల తమన్నా అమ్మవారి వేషంలో ఆకట్టుకుంది.



అమ్మవారి రూపంలో అల్పాహారం తింటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.



వైష్ణోదేవి ఆలయంలో ఊయల ఊగుతున్న తమన్నా