గుడిలో తీర్థం తీసుకున్నాక ఇలా చేయకండి

దేవాల‌యాల‌కు వెళ్లే వారంతా అక్కడ పూజ, దర్శనం అనంతరం తీర్థ, ప్రసాదాలు తీసుకుంటారు.

గుడిలోకి వెళ్లగానే అసంకల్పిత ప్రతీకార చర్యలా చేతులు రెండూ జోడించి కళ్లు మూసుకుని నమస్కారం చేస్తారు, తీర్థం తీసుకున్నాక ఆ చేయిని తలపై రాసుకుంటారు.

నమస్కారం సరే కానీ తీర్థం తీసుకున్నాక చేయి తలకు రాసుకోవడమే సరికాదంటున్నాయి శాస్త్రాలు.

తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అంటే అందులో పంచదార, తేనె వేస్తారు కాబట్టి అవన్నీ తలకు రాసుకోవడం మంచిదికాదు.

తీర్థం తీసుకున్నప్పుడు చేయి ఎంగిలి అవుతుంది. ఆ ఎంగిలి చేతిని కడుక్కోవాలి కానీ తలకు రాసుకోరాదు.

తీర్థం తీసుకున్నాక స్వామి వారి శఠకోపం తలపై పెడతారు. ఎంగిలి చేయి తలపై రాసుకుంటే స్వామివారి పాదాలుగా భావించే శఠకోపం అపవిత్రం అవుతుందని చెబుతారు.

తీర్ధం తీసుకున్న తర్వాత ఆ చేతిని కళ్ళకు అడ్డుకోవడం ఎంతో మంచిదంటారు

మొదటి సారి తీర్థం తీసుకోవడం వల్ల మానసిక, శారీరక శుద్ధి జరుగుతుంది.

రెండోసారి తీర్థం తీసుకోవడం వల్లన్యాయ, ధర్మప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి

మూడోసారి దేవదేవుడుకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ తీర్థం తీసుకోవాలి

ఇలామాత్రమే చేయాలని కాదు..ఇలా చేస్తే మంచిదని చెబుతారంతే. పాటించడం-లేకపోవడం అన్నది ఎవరి విశ్వాసాలు వారివి.