'కృష్ణగాడి వీరప్రేమ గాథ' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్



మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకోవడంతో ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది.



'ఎఫ్2', 'మహానుభావుడు' వంటి సినిమాలతో సూపర్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.



ఈ మధ్యకాలంలో ఎంగేజ్మెంట్ బ్రేకప్ తో వార్తల్లో నిలిచింది మెహ్రీన్.



త్వరలోనే పెళ్లి చేసుకుంటుందనుకుంటే పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు చెప్పి షాకిచ్చింది.



ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా మారింది.



రీసెంట్ గా ఈ బ్యూటీని వెతుక్కుంటూ ఓ సినిమా ఆఫర్ వచ్చిందట. 



కథ ప్రకారం.. సినిమాలో కిస్ సీన్స్, బెడ్ రూమ్ సీన్స్ లో నటించాల్సి ఉంటుందట. ఇది విన్న వెంటనే మెహ్రీన్ ఆఫర్ రిజెక్ట్ చేసిందట. 



తనకు బోల్డ్ యాక్ట్రెస్ గుర్తింపు వద్దనుకుంటుంది మెహ్రీన్. ఇంటిమేట్ సీన్స్ చేయడంలో కొన్ని లిమిట్స్ పెట్టుకుంది ఈ బ్యూటీ.



అందుకే తన దగ్గరకు వచ్చిన ఆఫర్ ని కాదనుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'ఎఫ్3' సినిమాలో నటిస్తోంది.