ఈ రాశుల వారిని ప్రేమించారా.. అయితే మిమ్మల్ని చూసి జాలిపడాల్సిందే..
ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుందంటారు. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ప్రేమించిన ప్రేమను ప్రేమించినా తమ ప్రేమ సంగతి మాత్రం బయట పెట్టరట .
మిథునం మిథున రాశివారు అంత తేలిగ్గా ప్రేమను అంగీకరించరు, అంత త్వరగా బయటపడరట. ప్రేమ విషయంలోనే కాదు పెళ్లికి సంబంధించిన విషయాల్లోనూ కొన్ని ప్రయోగాలు చేశాకే భాగస్వామని ఎంపిక చేసుకుంటారు. వీరితో పరిచయం కావాలని అనుకున్నా కానీ కొన్ని షరతులు పెడతారట.
కన్య ఈ రాశుల వారికి అన్నీ పరిపూర్ణంగా ఉండాలి. చివరకు ప్రేమ కూడా పరిపూర్ణత వచ్చే వరకూ ఏమీ బయటకు చెప్పరట. ఒకవేళ ఈ రాశివారు ప్రేమలో పడినా వీళ్లతో ఐ లవ్ యూ చెప్పించుకోవడం చాలాకష్టమట.
వృశ్చికం ఈ రాశుల వారు సీతయ్య టైప్. ఎవ్వరి మాటా వినరు వాళ్ల సొంత ధోరణి వారిదే. మార్పును అంత తొందరగా అంగీకరించరు. ప్రేమ విషయాల్లో అయితే అస్సలు సహకరించరట. పొరపాటున వృశ్చిక రాశివారితో ప్రేమలో పడితే నెత్తిన గుడ్డేసుకుని కూర్చోవడమేనంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
మకరం ఈ వ్యక్తులు ఆచరణాత్మక వ్యక్తులు. వీరు చేసే వ్యాపారం అయినా వ్యవహారం అయినా తలపెట్టన ఏ పనైనా ఇతరులను సులభంగా ఆకర్షిస్తుంది. చేసే ప్రతి పనీ మనస్ఫూర్తిగా చేస్తారు.
కుంభం కుంభ రాశివారు ఫ్రీ బర్డ్ లా ఉండాలని కోరుకుంటారు. అందుకే వీళ్లు ఎవరినైనా ప్రేమిస్తారు కానీ పొరపాటున కూడా మాట బయటకు చెప్పరట. ఎందుకంటే ప్రేమ సంబంధాల్లో పడితే స్వేచ్ఛని కోల్పోతామనే భయంలో ఉంటారట.
వీళ్ల మనసులో ప్రేమ లేదని కాదు.. కానీ వీళ్లు చెప్పరంతే..
ఇది ఓ వ్యక్తికి మాత్రమే సంబంధించినది కాదు రాశికి సంబంధించిన ఫలితం. అంటే మీ గ్రహస్థితిని బట్టి కొన్ని మార్పులు ఉండొచ్చు.