బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. ఆమె ఎవరంటే.. మేఘన గోయల్. 



మేఘనకి పెళ్లి ఫిక్స్ అవ్వడంతో అలియాభట్ హడావిడి కూడా ఎక్కువైంది. 



ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అలియా సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 



నిన్ననే మేఘన పెళ్లి జరిగింది. దీనికి అలియా ఎంతో అందంగా రెడీ అయి వెళ్లింది.



తన కాస్ట్యూమ్ తోనే అందరినీ ఫిదా చేసేసింది. సిల్వరీ షిమ్మర్ పెర్సొనా డ్రెస్ ని ధరించింది అలియా. 



సింపుల్ మేకప్, మ్యాచింగ్ యాక్సెసరీస్ తో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది అలియా. 



ప్రస్తుతం అలియా ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఆమెని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 



ఇక సినిమాల విషయానికొస్తే.. అలియా నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 



ఇందులో అలియా.. సీత అనే పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.