వేసవికాలం, వర్షాకాలం , చలికాలం ఒక్కొక్కరికి ఒక్కో కాలం ఇష్టం. అయితే ఈ ఇష్టాయిష్టాలు కూడా మీ రాశులపై ఆధారపడి ఉంటాయట.
చలికాలం అంటే వామ్మో అనేవారు కొందరైతే చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది అనుకునే వారు ఇంకొందరు. మరి ఇందులో మీరున్నారా ..
వృషభం వృషభరాశివారు ఎప్పుడూ చల్లటి వాతావరణాన్ని కోరుకుంటారట. అన్ని సీజన్స్ కన్నా కూల్ వెదర్ సౌకర్యంగా ఉంటుందని భావిస్తారట. చల్లటి గాలులు వీస్తుంటే వెచ్చగా ముసుగేసుకుని కునుకేయడం భలే ఇష్టమట వీరికి.
కర్కాటకం ఈ రాశి వారు శీతాకాలాన్ని బాగా ఆస్వాదిస్తారు. ఈ సీజన్లో ఇంట్లో ఉండి వేడివేడి వంటకాలు ఆస్వాదిస్తూ, హాట్ సూప్, టీ, కాఫీ తాగితే ఏముంటుందబ్బా అనుకుంటారట. చలికాలంలో బయటకు వెళ్లడం కన్నా ప్రియమైన వారితో ఏకాంతంగా గడిపేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతారట.
కన్య శీతాకాలాన్ని ఆస్వాదించే రాశుల్లో కన్య కూడా ఉంది. అయితే రొటీన్ కి భిన్నంగా చల్ల చల్లని గాలుల్లో భాగస్వామితో ఉండాలని కోరుకుంటే వీరు మాత్రం స్నేహితులతో ఎంజాయ్ చేయాలనుకుంటారట.
వృశ్చికం ఈ రాశి వారు చలికాలంలో తమ పార్టనర్ తో కలసి పడకగదిలో ఎంజాయ్ చేయడాన్ని ఇష్టపడతారట. ఈ సీజన్లో ఎక్కువ మెమొరీస్ కూడబెట్టుకునే పనిలో ఉంటారట. కేవలం చలికాలంలోనే వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉంటుందని భావిస్తారట.
మకరం ఈ రాశి వారికి కూడా శీతాకాలం అంటే చాలా ఇష్టం. వీరు అందరిలా కాకుండా లైఫ్ లో మరో అడుగు ముందుకేసే ఆలోచనలు ఎక్కువగా ఈ సీజన్లోనే చేస్తారట. భవిష్యత్ లో ఏం చేయాలనే ఆలోచనల్లో మునిగితేలుతారట.