బాలీవుడ్ ముద్దుగుమ్మ తమన్నా.. తెలుగు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకుంది. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది.



2005లో బాలీవుడ్ చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో తన కెరీర్ ను మొదలుపెట్టింది తమన్నా. 



కానీ బాలీవుడ్ సినిమా దెబ్బ కొట్టడంతో 'శ్రీ' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అప్పటికి ఆమె టీనేజర్. 



'హ్యాపీడేస్' సినిమా తమన్నాకు వరుస ఆఫర్లను తీసుకొచ్చింది. నటిగా చాలా బిజీ అయిపోయింది. 



టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది ఈ బ్యూటీ.



తమన్నా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేళ్లు దాటినప్పటికీ.. ఇప్పటికి నటిగా అవకాశాలు దక్కించుకుంటూ నేటితరం హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. 



ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాల్లో నటిస్తోంది.



ఈ ఏడాది 'సీటీమార్', 'మ్యాస్ట్రో' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.



అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న 'ఎఫ్ 3' సినిమాలో నటిస్తుంది తమన్నా. 



తన అందం, అభినయంతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెకి స్పెషల్ బర్త్ డే విషెస్.