2021లో బిర్యానీదే హవా... బిర్యానీ లవర్స్ రోజురోజుకీ పెరిగిపోతున్నారు. అందుకు స్విగ్గీ ఇచ్చిన నివేదికే సాక్ష్యం. స్విగ్గీ సంస్థ ప్రతి ఏడాది చివరలో తమకు అధికంగా వచ్చిన ఆర్డర్ల గురించి ఓ నివేదికను ప్రచురిస్తుంది. అందులో నిమిషానికి 115 బిర్యానీలు ఆర్డరిచ్చినట్టు తేలింది. ఇక స్నాక్స్‌లో అధికంగా అమ్ముడైంది సమోసా. ఈ ఏడాది మొత్తం దాదాపు 50 లక్షల సమోసా ఆర్డర్లు అందాయని పేర్కొంది స్విగ్గీ. సమోసా తరువాతి స్థానంలో దాదాపు 21లక్షల ఆర్డర్లతో పావ్ బాజీ నిలిచింది. స్వీట్ల విషయానికి వస్తే 21 లక్షల ఆర్డర్లతో గులాబ్ జామ్ మొదటి స్థానంలో ఉంది. 12.7 లక్షల ఆర్డర్లతో రసమలై రెండో స్థానంలో ఉంది.