కాఫీతో ఇలా బరువు తగ్గొచ్చు చల్లని శీతాకాలపు ఉదయం ఓ వెచ్చని కాఫీ తాగితే... ఆ కిక్కే వేరు. బరువు తగ్గాలనుకునేవారు కాఫీ తయారుచేసే విధానాన్ని మార్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కాఫీలో చక్కెర వేసుకోవడం పూర్తిగా మానేయండి. కాఫీ ఆరోగ్యకరంగా ఉండాలంటే దానికి క్రీమ్ చేర్చడం మానుకోండి. కాఫీని అధికంగా తాగడం వల్ల చెడు ప్రభావం పడుతుంది. ఒక వ్యక్తి రోజులో రెండు కప్పుల కాఫీని మాత్రమే తాగాలి. బరువు తగ్గాలనుకునే వారు పాలు అతిగా తాగకూడదు. కాఫీలో ఎక్కువ మోతాదులో పాలు కలుపుకోవద్దు. కాఫీని మధ్యాహ్నం రెండు గంటల తరువాత తాగకపోవడమే మంచిది.