ఆఫీస్ టేబుల్‌పై ఈ వస్తువులుంటే అదృష్టమే... వాస్తు శాస్త్రం ప్రకారం, వాస్తు దోషం మీ ఇంట్లో మాత్రమే కాదు, మీ పనిప్రదేశాలలో కూడా ఉండొచ్చు. ఆఫీసులో మీరు కూర్చున్న ప్రదేశంలో ఉన్న వాస్తు దోషాలను పరిష్కరించుకుంటే సమస్యలు తగ్గి, ఉద్యోగంలో పురోగతిని సాధించవచ్చని చెబుతోంది వాస్తు శాస్త్రం. మీ డెస్క్ ప్లేస్‌లో చిన్న మొక్క పెట్టుకోండి. తూర్పు లేదా ఉత్తర దిశలో మనీ ప్లాంట్ లేదా వెదురు మొక్కలు పెట్టుకుంటే మంచివి. మీరు కూర్చున్న స్థానానికి ఉత్తర దిశలో పచ్చని అడవి లేదా పంటలు వంటి వాల్ పేపర్స్, ఫోటోలను పెట్టుకుంటే చాలా మంచిది. మీరు కూర్చున్న స్థానానికి దక్షిణ, పడమర వైపు పర్వతాలు, రాళ్లు వంటి ప్రకృతి దృశ్యాన్ని కనిపించేట్టు పెట్టుకుంటే మానసిక స్థితి మెరుగవుతుంది. ఉత్తర, పశ్చిమ దిశల వైపు గోడలకు సముద్రం, నదులు, సరస్సులు వంటి ప్రకృతి దృశ్యాలు కనిపించేట్టు ఫోటోలు పెట్టుకుంటే మంచిది. మీకు ఆఫీసులో మానసిక ప్రశాంతత కరువైతే బుద్ధుడు లేదా మహావీర్ స్వామి చిత్రపటాలు, చిన్న విగ్రహాలను మీకు ఎదురుగా పెట్టుకోండి. తాజా పూల గుత్తిని రోజూ మీ డెస్క్ పై ఉంచండి. అనుకూల శక్తి ప్రవహిస్తుంది. ముళ్లు మొక్కలు, బోన్సాయ్, సకులెంట్స్ వంటి మొక్కలు పెట్టుకోకూడదు. ఇవి నిరాశను సూచిస్తాయి.