భారత స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ట్విట్టర్‌లో ప్రకటించారు. భారత్ తరఫున 103 టెస్టులాడిన హర్భజన్ 417 వికెట్లు తీశాడు. 236 వన్డేల్లో 269 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 28 టీ20ల్లో 25 వికెట్లను దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడాడు. టెస్టుల్లో రెండు సెంచరీలు కూడా సాధించాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో 15 వికెట్లు తీసిన రికార్డు కూడా హర్భజన్‌కు సొంతం. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో రెండో అత్యుత్తమ స్ట్రైక్ రేట్(5.4) కూడా తనదే. టెస్టులు, వన్డేలు రెండు ఫార్మాట్లలోనూ 1000 పరుగులు, 100 వికెట్లు తీశాడు.