అల్లుడు అదుర్స్ - బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. రిలీజ్ కి ముందు మాత్రం ఓ రేంజ్ లో హైప్ ఇచ్చారు. తీరా సినిమా చూస్తే సరైన కంటెంటే లేదు.



చెక్ - నితిన్, చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ లో సినిమా అంటే కచ్చితంగా సినిమా హిట్ అవుతుందనే అనుకున్నారు కానీ బాగా నిరాశ పరిచింది. 



గాలి సంపత్ - రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు కలిసి నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండేవి కానీ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. 



మోసగాళ్లు - ఈ ఏడాదిలో విడుదలైన డిజాస్టర్ సినిమాల్లో ఇదొకటి. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.



చావు కబురు చల్లగా - రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ తో ఊదరగొట్టారు. తీరా సినిమా చూస్తే ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది.



వైల్డ్ డాగ్ - నాగార్జున నటించిన ఈ సినిమా ఓటీటీలో విడుదల కావాల్సింది కానీ పట్టుబట్టి థియేటర్లో వదిలారు. ఈ సినిమా ఓటీటీ కంటెంట్ కి కూడా సరిపోదు. 



పాగల్ - ఈ సినిమా చూసిన ప్రేక్షకులంతా.. విశ్వక్ సేన్ ని బాగా ట్రోల్ చేశారు. అంతలా ప్రేక్షకులను సహనానికి పరీక్ష పెట్టింది. 



టక్ జగదీష్ - నాని సినిమా అంటే మినిమమ్ కంటెంట్ ఉంటుందని భావిస్తారు ప్రేక్షకులు. కానీ ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.



మహాసముద్రం - భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. 



లక్ష్య - నాగశౌర్య ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డాడు కానీ సినిమా మాత్రం ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది.