ఈ రాశిలో పుట్టిన పిల్లలకు క్రియేటివిటీ చాలా ఎక్కువ..
మేషం ఈ రాశిలో పుట్టిన పిల్లల్లో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఎంత విపత్కర పరిస్థితుల్లో అయినా అలవోకగా నిర్ణయం తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. ఎదుటివారెవరైనా సమస్యల్లో ఉంటే వెంటనే స్పందించడంలోనూ మేషరాశి పిల్లలు ముందుంటారు.
వృషభం ఈ రాశిలో పుట్టిన పిల్లలకు పట్టుదల ఎక్కువ. అందరికీ సాధారణంగా కనిపిస్తారు కానీ ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఎదుగుతారు. పైగా ఓ టార్గెట్ పెట్టుకుంటే కచ్చితంగా రీచ్ అవుతారు.వీరిలో సంకల్ప బలం చాలా ధృడంగా ఉంటుంది. అందుకే అనుకున్న పనిని కచ్చితంగా సాధిస్తారు.
మిథునం ఈ రాశిలో జన్మించిన పిల్లల్లో క్రియేటివిటీ ఎక్కువ. మంచి మాటకారులు. సృజనాత్మక ఆలోచనలు కలిగిఉంటారు. ఏ పని చేయడంలో అయినా వీరి రూటే సెపరేటు. వయసు చిన్నదే అయినా ఆలోచనలు మాత్రం చాలా పెద్దవి.
కర్కాటకం ఈ రాశి పిల్లలు ఎదుటి వారి భావాలకు ఎక్కువ విలువనిస్తారు. తమకో ఆలోచన ఉన్నప్పటికీ ఎదుటివారి కంఫర్ట్ ని ఆలోచించి నడుచుకుంటారు. ఎంత కఠినమైన వ్యక్తిని అయినా అర్థం చేసుకునే నైపుణ్యం వీరిసొంతం.
సింహం సింహ రాశిలో పుట్టిన పిల్లల్లో నాయకత్వ లక్షణాలకు కొదవే ఉండదు. సింహరాశిలో పుట్టిన పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. వీరి ప్రవర్తన కూడా వంద మందిలో ప్రత్యేకంగా ఉంటుంది.
కన్య ఈ రాశిలో జన్మించిన పిల్లల్లో కచ్చితత్వం ఎక్కువ. ప్రతి విషయం చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు. చిన్నప్పటి నుంచీ అన్ని పనుల్లోనూ చాలా నియమబద్దంగా వ్యవహరిస్తారు. ఆటల్లో, చదువులో అన్నింటిలోనూ వీరిదే ప్రధమ స్థానం.
తుల ఈ రాశి పిల్లలు.. త్రాసులు సమానంగా తూగుతాయన్నట్టు సహనం, ఓర్పు అన్నీ సమానంగా ఉంటాయ్. ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవర్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఎవరి వల్ల తమపని పూర్తవుతుందనే విషయాలపై వీరికి చాలా క్లారిటీ ఉంటుంది.
వృశ్చికం ఈ రాశిలో పుట్టిన పిల్లలు ఏదైనా అనుకుంటే చాలు గోల్ రీచ్ అయ్యేవరకూ కష్టపడతారు. ఏపని చేసినా మొక్కుబడి అనే మాటే ఉండదు. ఫుల్ ఫోకస్ పెడతారు. అన్ని రంగాల్లో రాణించగల నైపుణ్యం వీరి సొంతం.
ధనుస్సు ఈ రాశిలో పుట్టిన పిల్లలు ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉంటారు. ఎంత కష్టాన్ని అయినా ఇష్టంగా మార్చుకోవడంలో వీళ్లకి వీళ్లే సాటి. ముఖ్యంగా సమస్య పెద్దది అయినా..చిన్నది అయినా …చివరికి అసాధ్యమైనది అయినా..గట్టి సంకల్పంతో పూర్తి చేస్తారు.
మకరం ఈ రాశిలో జన్మించిన పిల్లల్లో మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ. చిన్నప్పుడే ఎక్కువ తెలుసుకుంటారు. ఏ పని చేయాలి…ఆ పని వల్ల వచ్చే లాభం ఏంటి..నష్టం ఏంటి బేరీజు వేసుకుంటారు. లాభం అయితే ముందడుగు వేస్తారు.
కుంభం ఈ రాశిలో పుట్టిన పిల్లలకు క్రియేటివిటీ ఎక్కువ. సమస్యలను నుంచి ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు. కొత్త కొత్త అంశాలను వెలుగులోకి తేవడానికి ప్రయత్నిస్తారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు.
మీనం ఈ రాశిలో జన్మించిన పిల్లలు వండర్ ఫుల్ కిడ్స్ అనే చెప్పాలి. ఇతరుల సమస్యలను వారి బాగోగులను చూసుకుంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా…ఎవ్వరు ఏం చెప్పినా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.