2021 మిగిల్చిన ఆర్ధిక కష్టాల నుంచి బయటపడాలి అనుకుంటున్నారా? అయితే లక్ష్మీ దేవతకు స్వాగతం పలకాల్సిందే.
డబ్బును ఆకర్షించే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఇంట్లో ఉండేలా చూసుకోండి.
శుక్రవారం నాడు పసుపు వస్త్రంలో అయిదు కోడిగుడ్లు, వెండి నాణాలు, కొద్దిగా కుంకుమ పువ్వులు వేసి మూటలా కట్టాలి. ఆ మూటను ఇంట్లో డబ్బు దాచే ప్రదేశంలో పెట్టాలి. అలాగే కొన్ని పసుపు కొమ్ములు కూడా ఉంచాలి.
ఎర్రచందనం పొడిలో కాస్త నీరు కలిపి పేస్టులా చేయాలి. దాంతో భోజపాత్ర లేదా ఏదైనా ప్లేటుపై ‘శ్రీ’ అని రాయాలి. ఆ భోజపాత్రను డబ్బులు దాచే ప్రదేశంలో ఉంచాలి.
ఐశ్వర్య వృద్ధి యంత్రాన్ని మీ ఇష్టదైవం ముందు ఉంచి పూజించాలి. ఆ తరువాత దాన్ని డబ్బు దాచే ప్రదేశంలో భద్రంగా ఉంచాలి.
దక్షిణవర్తి శంఖాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఈ శంఖాన్ని మీ డబ్బు ఖజానాలో ఉంచినప్పుడు లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తుందని పెద్దలు చెబుతుంటారు.
పూజలో ఉపయోగించిన వక్కలను డబ్బు దాచే ప్రదేశంలో ఉంచితే చాలా మంచిది. లక్ష్మిదేవి కూడా ఆ వక్కలతో పాటూ అక్కడే ఉంటుందని మీకు ఐశ్వర్య వృద్ధి జరిగేలా చేస్తుందని నమ్మకం.