News
News
X

Zodiac Signs: ఈ 5 రాశుల అబ్బాయిలను పెళ్లిచేసుకున్న అమ్మాయిలు అదృష్టవంతులు

ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...

FOLLOW US: 

Zodiac Signs: పెళ్లికి ముందు ఎవరెలా ఉన్నా..పెళ్లైన తర్వాత మాత్రం ఒకరికొకరు అనుకూలంగా ఉండాలని, చెప్పిన మాట వినాలని భావిస్తారు. కొందరి విషయంలో మాత్రం పెళ్లైనా కానీ పెద్దగా మార్పులేమీ ఉండవు కానీ మరికొందరు మాత్రం ఊహించనంతగా మారిపోతారు. మొన్నటి వరకూ మనం చూసిన వాళ్లేనా ఇప్పుడిలా ఉన్నారు అనిపిస్తుంది. భార్య గీసిన గీత దాటని భర్తగా ఫుల్ మార్క్స్ కొట్టేస్తారు. ఏంట్రాభార్య కొంగుపట్టుకుని తిరిగుతున్నావ్ అని అందరూ కామెంట్ చేసినా కానీ...సంసార జీవితం బావుండాలనే ఎవరో ఒకరు తగ్గాల్సిందే అని సూటిగా సుత్తి లేకుండా చెబుతారు. ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటూ చిన్న అనుమానానికి కూడా తావివ్వకుండా జాగ్రత్తపడతారు. అందుకే వీరు ఉత్తమ భర్తలుగా క్రెడిట్ అందుకుంటారు. అయితే ఇది కూడా వారి రాశిని బట్టి ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు. ఏ రాశులవారు ఉత్తమ భర్తలుగా నిలుస్తారో చూద్దాం...

మేషం
మేష రాశి వారు మంచి భర్తలు. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. జీవిత భాగస్వామి మనోగతాన్ని తెలుసుకుని మసలుకుంటారు. కొన్ని సందర్భాల్లో దూకుడుగా వ్యవహరించినా ఆ తర్వాత రియలైజ్ అవుతారు. ఎప్పుడూ భార్యకు అండగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. నొప్పింపక తానొవ్వక అన్నట్టు వీరి వ్యవహారం ఉంటుంది. 

సింహం
సింహ రాశి అగ్నికి చిహ్నం. అడవికి రాజు సింహంలా వీరి లైఫ్ కి వీరే రాజు వీరే మంత్రి అన్నట్టుండాలి అనుకుంటారు. ఎవ్వరి అభిప్రాయాలను అంత తేలిగ్గా అంగీకరించరు కానీ...పెళ్లయ్యాక మాత్రం తమ జీవితాన్ని తీసుకెళ్లి భాగస్వామి చేతిలో పెట్టేస్తారు. అప్పటి నుంచి ఆమె చెప్పుచేతల్లోనే ఉంటారు. తన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. కొన్ని సందర్భాల్లో భార్యకు నచ్చని విషయాలేమైనా ఉన్నాయని తెలిస్తే వాటిని మార్చుకునేందుకు, మార్చేందుకు ప్రయత్నిస్తారు. అందుకే సింహరాశి భర్తలు లభించిన భార్యలు అదృష్టవంతులు. 

Also Read: చేతిలో డబ్బు నిలవాలంటే ఏ రాశివారు ఏ మంత్రం పఠించాలో ఇక్కడ తెలుసుకోండి!

మకరం
మకర రాశివారు మొండితనానికి కేరాఫ్ అడ్రస్. వీరికి పట్టుదల ఎక్కువ. తాము అనుకున్న పనులు తమకు నచ్చినట్టు చేయాలనే ఆలోచనలో ఉంటారు. ఎవ్వరి మాట వినరు సీతయ్యలా ప్రవర్తిస్తారు. కానీ ఇదంతా పెళ్లయ్యే వరకూ మాత్రమే. పెళ్లైన తర్వాత మాత్రం వీరు ఎవ్వరూ ఊహించనంతగా మారిపోతారు. తమ జీవిత భాగస్వామితో మంచి చెడులను పంచుకుంటారు. అందుకే వీరి దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండవు. 

కుంభం
కుంభరాశి వారు పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. పెళ్లైన తర్వాత తమ జీవితభాగస్వామితో సంతోషంగా ఉండాలనుకుంటారు. వారికోసం సమయాన్ని వెచ్చిస్తారు. చిన్నచిన్న సమస్యలున్నా పరిష్కరించుకోవాలి అనుకుంటారు. బంధాన్నిమరింత బలోపేతంచేసేందుకు తమవంతు ప్రయత్నాలన్నీ చేస్తారు. అందుకే ఈరాశివారిని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు... మొదట్లో అర్థం చేసుకోలేకపోయినా రానురాను వీరి ప్రేమకు బానిసగా మారుతారు. ఉత్తమ భర్త అనే అవార్డిచ్చేస్తారు. 

Also Read: దిష్టి తీసి పడేసినవి తొక్కుతున్నారా, ఏమవుతుందో తెలుసా!

మీనం
మీన రాశివారికి సహనం చాలా ఎక్కువట. అనవసరంగా మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ పెళ్లయ్యాక మాత్రం తమ మనసులో మాటలన్నీ భార్యకు చెప్పుకోవడంలో వీరే నంబర్ వన్. ఇది చెప్పొచ్చు ఇది చెప్పకూడదు అని ఏముండదు.. మొత్తం అన్నీ చెప్పేసుకుంటారు. తద్వారా తమను తమ జీవిత భాగస్వామి పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలని భావిస్తారు. అందుకే వీరు కూడా ఉత్తమ భర్తల జాబితాలోకే వస్తారు...

Published at : 12 Aug 2022 12:49 PM (IST) Tags: astrology in telugu horoscope Zodiac Signs

సంబంధిత కథనాలు

Horoscope Today 3rd October 2022: ఈ రాశులవారికి దుర్గాష్టమి రోజు కష్టాలు తీరిపోతాయి, అక్టోబరు 3 రాశిఫలాలు

Horoscope Today 3rd October 2022: ఈ రాశులవారికి దుర్గాష్టమి రోజు కష్టాలు తీరిపోతాయి, అక్టోబరు 3 రాశిఫలాలు

Dussehra 2022: అష్టదరిద్రాల తీర్చే మహాగౌరి, దుర్గాష్టమి రోజు నవదుర్గల్లో ఎనిమిదవది మహాగౌరి

Dussehra 2022: అష్టదరిద్రాల తీర్చే మహాగౌరి,  దుర్గాష్టమి రోజు నవదుర్గల్లో ఎనిమిదవది మహాగౌరి

Bathukamma Wishes 2022: మీ బంధుమిత్రులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Bathukamma Wishes 2022: మీ బంధుమిత్రులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Dussehra Wishes 2022: మీ బంధుమిత్రులకు దసరా శుభాకాంక్షలు చెప్పేయండిలా!

Dussehra Wishes 2022: మీ బంధుమిత్రులకు దసరా శుభాకాంక్షలు చెప్పేయండిలా!

Duragashatami 2022: ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి పర్వదినం

Duragashatami 2022: ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి పర్వదినం

టాప్ స్టోరీస్

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

CM Jagan : సీఎం జగన్ ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

CM Jagan : సీఎం జగన్  ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Weather Updates: ఏపీలో 2 రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా

Weather Updates: ఏపీలో 2 రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా