Police Notice To Allu Arjun: అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు, ఏదైనా జరిగితే బాధ్యత ఆయనదేనన్న పోలీసులు
Allu Arjun News | పుష్ప 2 హీరో అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్ హాస్పిటల్ కు పరామర్శకు వెళ్తే ఏమైనా జరిగే బాధ్యత వహించాలన్నారు.
Rapgopalpet Police issues notice to allu arjun | హైదరాబాద్: ఐకాన్ స్టార్, టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు పోలీసులు షాకిచ్చారు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి రాం గోపాల్ పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శిస్తారని ప్రచారం జరిగింది. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌కు రావొద్దని సూచిస్తూ పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు.
కిమ్స్‌కు వెళ్లి బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించకూడదని పోలీసులు అల్లు అర్జున్‌కు సూచించారు. ఒకవేళ ఆయన హాస్పిటల్‌కు వెళ్లాలని భావిస్తే మాత్రం తమ సూచనలు తప్పక పాటించాలన్నారు. లేనిపక్షంలో పరామర్శకు వెళ్లిన సమయంలో ఏమైనా జరిగితే అల్లు అర్జున్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులలో పేర్కొన్నారు.
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లు అర్జున్
#WATCH | Telangana: Actor Allu Arjun leaves from Chikkadpally police station in Hyderabad.
— ANI (@ANI) January 5, 2025
Allu Arjun submitted the sureties at Metropolitan Criminal Court at Nampally yesterday after he was granted regular bail by the Court in the Sandhya Theatre incident case pic.twitter.com/7zuV5nhgOI