అన్వేషించండి

OYO Unmarried Couples: ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ

OYO Hotels Hyderabad | పెళ్లి కాని జంటలకు ఓయో రూమ్స్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై వారికి ఓయో రూమ్స్ లో గదులు ఇచ్చేది లేదని కంపెనీ చెబుతోంది. త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ తీసుకొస్తామని తెలిపింది.

OYO Rooms in India | న్యూఢిల్లీ: ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మీకు OYO హోటల్ కనిపిస్తే వ్యాలిడ్ ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేసి ఈజీగా రూమ్ తీసుకునేవారు. కానీ ఇకనుంచి అందరికీ ఆ సర్వీస్ అందుబాటులో ఉండదు. పెళ్లికాని జంటలు ఇకపై చెక్ ఇన్ చేయడానికి అనుమతించకూడదని OYO నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మీరట్‌లో ఓయో కొత్త చెక్-ఇన్ పాలసీని తీసుకొచ్చింది. నూతన సంవత్సరం నుంచి ఓయో హోటల్స్ చెకిన్ విషయంలో కొత్త నిబంధనలు అమలు చేస్తోంది.

చెక్ ఇన్ సమయంలో కఠిన నిబంధనలు

OYO తాజా చెక్ ఇన్ రూల్స్ ప్రకారం.. ఇక నుంచి పెళ్లికాని జంటలకు రూమ్ ఇవ్వడాన్ని నిలిపివేశారు. సవరించిన నిబంధనల ప్రకారం చెక్ ఇన్ సమయంలో అన్ని జంటలు వ్యాలిడ్ ఐడీ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. వారి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో కచ్చితంగా తెలిసేలా ఐడీలో వివరాలు కనిపించాలి. ఓయో హోటల్స్ పరిసరాలలో ఉండేవారు చేసే ఆరోపణలు, సామాజిక ధృక్పథానికి అనుగుణంగా పెళ్లి కాని జంటలకు గదులు నిరాకరించే విచక్షణాధికారాన్ని ఓయో హోటల్స్‌కు కంపెనీ కల్పించింది. 

త్వరలోనే దేశ వ్యాప్తంగా కొత్త చెకిన్ పాలసీ

ప్రస్తుతానికి మీరట్‌లో సవరించిన చెక్ ఇన్ రూల్స్ అమలు చేస్తున్నారు. ఫీడ్ బ్యాక్ ఆధారంగా త్వరలోనే దేశ వ్యాప్తంగా ఓయో హాటల్స్ ఈ రూల్స్ అమలు చేస్తామని పేర్కొంది. ఓయో హోటల్స్ పై స్థానికుల నుంచి అభిప్రాయాలు సేకరించిన తరువాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని కోర్టుల్లో సైతం దీనిపై పిటిషన్లు వేయగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పెళ్లికాని ఓ మహిళ, పురుషుడికి ఎలా ఒకే గదిలో ఉండటానికి అనుమతి ఇస్తున్నారు, ఓయో ప్లాన్ ఏంటి అని పలు నగరాల్లో ఫిర్యాదులు రావడం తెలిసిందే. 

న్యూ ఇయర్ సందర్భంగా భారీగా బుకింగ్స్

ఇటీవల నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఒక్కరోజే మిలియన్ పైగా ఓయో రూమ్స్ బుకింగ్స్ జరిగాయి. అంటే వీటిని ఎలా వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారో ఓయో కంపెనీ అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ పీటీఐతో మాట్లాడుతూ.. ‘చెప్పాలంటే OYO సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఆతిథ్యం ఇస్తుంది. ఇప్పటివరకూ వ్యక్తిగత స్వేచ్ఛను  గౌరవించాం. కానీ పౌరులతో కలిసి మెరుగైన సేవలు ఇవ్వాలని భావించాం. ప్రజల నుంచి సలహాలు సేకరించి ఈ నూతన చెకిన్ విధానాన్ని తీసుకొచ్చాం. దీనిపై త్వరలోనే సమీక్షించి దేశ వ్యాప్తంగా అన్ని నగరాలలో అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నామని’ వెల్లడించారు. 

విద్యార్థులు, వ్యాపార నిమిత్తం వచ్చేవారు, కుటుంబాల వెకేషన్, మతపరమైన కార్యక్రమాలు,  ఒంటరి ప్రయాణీకులకు సురక్షితమైన గమ్యస్థానంగా ఓయోని నిలిపాం. మరింత మెరుగైన, సురక్షితమైన, ప్రజామోదయోగ్యమైన సేవల్ని అందించడానికి OYO గదులను కేటాయించే సమయంలో జంటలకు సంబంధించి పెళ్లి జరిగిందా, లేదా అని ఆరాతీసేలా చెక్ ఇన్ పాలసీ తీసుకొచ్చామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. అనైతిక కార్యకలాపాలు జరగకూడదని, అలాంటి వాటిలో తాము భాగస్వాములుగా మారొద్దని భావించి ఓయో మేనేజ్‌మెంట్ పోలీసుల సలహాలు కోరింది. తప్పుడు మార్గాల్లో నడిచేవారికి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఓయో రూమ్స్ మారకూడదని కొత్త చెకిన్ పాలసీని ప్రారంభించింది.

Also Read: EPFO ​​ATM Card: ఇక నుంచి ఎక్కడి నుంచైనా ఏటీఎం సాయంతో పీఎఫ్ విత్ డ్రా చేస్కోవచ్చు - ఈ కార్డ్ ఎలా పని చేస్తుందంటే..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
YSRCP MLAs:  అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
AP MLAs Cultural programs: ఏపీ ప్రజాప్రతినిధుల కళాపోషణ అదుర్స్ - సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన ఎమ్మెల్యేలు - వీడియోలు
ఏపీ ప్రజాప్రతినిధుల కళాపోషణ అదుర్స్ - సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన ఎమ్మెల్యేలు - వీడియోలు
KTR Padayatra: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
YSRCP MLAs:  అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
AP MLAs Cultural programs: ఏపీ ప్రజాప్రతినిధుల కళాపోషణ అదుర్స్ - సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన ఎమ్మెల్యేలు - వీడియోలు
ఏపీ ప్రజాప్రతినిధుల కళాపోషణ అదుర్స్ - సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన ఎమ్మెల్యేలు - వీడియోలు
KTR Padayatra: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం - మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు భావోద్వేగం
ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం - మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు భావోద్వేగం
Prakash Raj: బెట్టింగ్ యాప్స్ కేసుపై ప్రకాష్ రాజ్ వినూత్న స్పందన - పోలీసులకే కాదు ప్రజలకూ చెప్పాలంటూ ...
బెట్టింగ్ యాప్స్ కేసుపై ప్రకాష్ రాజ్ వినూత్న స్పందన - పోలీసులకే కాదు ప్రజలకూ చెప్పాలంటూ ...
BRS Latest News:కేటీఆర్ రాష్ట్రవ్యాప్త టూర్ ప్రారంభం-మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?
కేటీఆర్ రాష్ట్రవ్యాప్త టూర్ ప్రారంభం-మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?
Dil Raju: 'మార్కో' దర్శకుడితో దిల్ రాజు మైండ్ బ్లోయింగ్ ప్లాన్... పాన్ ఇండియా మల్టీస్టారర్‌కు సన్నాహాలు
'మార్కో' దర్శకుడితో దిల్ రాజు మైండ్ బ్లోయింగ్ ప్లాన్... పాన్ ఇండియా మల్టీస్టారర్‌కు సన్నాహాలు
Embed widget