అన్వేషించండి

EPFO ​​ATM Card: ఇక నుంచి ఎక్కడి నుంచైనా ఏటీఎం సాయంతో పీఎఫ్ విత్ డ్రా చేస్కోవచ్చు - ఈ కార్డ్ ఎలా పని చేస్తుందంటే..

EPFO ​​ATM Card : ప్రస్తుతం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులు తమ ఆన్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం 7 నుండి 10 రోజుల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.

EPFO ​​ATM Card : ఈపీఎఫ్ఓ చందాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మే-జూన్ నాటికి కొత్త ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) మొబైల్ అప్లికేషన్, డెబిట్ కార్డ్ సౌకర్యాన్ని అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఈ నిర్ణయంతో దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా.. ఏ బ్యాంక్ నుంచి అయినా పింఛన్ తీసుకునేందుకు వీలు ఉంటుంది. దీనిపై ఈపీఎస్ పెన్షన్‌దారులు, పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలనుకునే వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఈపీఎఫ్ఓ 3.0

కేంద్రీకృత పింఛన్ చెల్లింపుల వ్యవస్థ (CPPS) విస్తరణను కేంద్రం ఎట్టకేలకు ప్రకటించింది. ఇప్పటికే ఉన్న ఈపీఎఫ్ఓ 2.0 ఐటీ వ్యవస్థను ఈపీఎఫ్ఓ 3.0కి అప్ గ్రేడ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారులకు ఈపీఎఫ్ఓ 3.0 అనే వ్యవస్థ కింద ఏటీఎం కార్డులు అందిస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ ఏడాది జూన్‌లోగా ఈపీఎఫ్ఓ కటింగ్ ఎడ్జ్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థను తీసుకురానుందన్నారు. ఈ యాప్ ద్వారా చందాదారులు బ్యాంకింగ్ సౌకర్యాలను పొందవచ్చని, ముఖ్యంగా విత్‌డ్రా చేసుకోవడం మరింత సులువు అవుతుందని చెప్పారు. ఈ విషయంపై ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు సాగుతున్నాయని.. ఇవి సఫలమైతే చందాదారులు ఇక డెబిట్ కార్డుల ద్వారానే ఏటీఎం నుంచి ఈపీఎఫ్ఓ నిధులను విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుంది. 

అయితే ఈ ఏటీఎం కార్డు కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, అసలు దరఖాస్తు చేసుకోవాలా లేదంటే ప్రభుత్వమే స్వయంగా పీఎఫ్ ఖాతా ఉన్నవారి చిరునామాకు ఏటీఎం కార్డును పంపుతుందా అనేది ఇంకా చెప్పలేదు. కానీ, 2025 సంవత్సరంలో మాత్రమే ఇది అందుబాటులోకి రానుంది. దీని ద్వారా మీరు మీ నిర్దిష్ట పీఎఫ్ అమౌంట్ ను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేయొచ్చు.

ఎంత డబ్బు విత్ డ్రా చేసుకోవాలి.. కార్డు ఎలా పనిచేస్తుందంటే..

2025లో ఈపీఎఫ్‌వో కస్టమర్లు తమ పీఎఫ్ డబ్బును ఏటీఎం కార్డు ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చని ఇటీవలే లేబర్ సెక్రటరీ సుమిత్ దావ్రా చెప్పారు. ఇది కాకుండా, ఖాతాదారులు తమ ఖాతా నుండి 50 శాతం వరకు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చని కూడా దావ్రా తెలిపారు. అయితే ఇప్పుడు పీఎఫ్ ఖాతాకు వచ్చే ఏటీఎం కార్డు ఎలా పనిచేస్తుందనే ప్రశ్న అందరిలోనూ కలుగుతోంది. ఈ కార్డ్ కూడా సాధారణ ఏటీఎం కార్డ్ లాగానే ఉంటుంది. అదే విధంగా పని చేస్తుంది. బ్యాంకులు ఇచ్చే ఏటీఎం కార్డు నుండి ఎలా అయితే డబ్బును విత్‌డ్రా చేస్తామా.. అదే తరహాలో డబ్బును తీసుకోవచ్చు.

ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్

ప్రస్తుతం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులు తమ ఆన్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం 7 నుండి 10 రోజుల వరకు వేచి ఉండాల్సి  వస్తోంది. ఈ క్లెయిమ్‌ను పరిష్కరించిన తర్వాత, డబ్బు నేరుగా ఖాతాదారుల బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతుంది. అయితే, ఒకవేళ ఏటీఎం సదుపాయాన్ని ప్రవేశపెడితే మాత్రం మీరు మీ పీఎఫ్ ఖాతా నుండి వెంటనే డబ్బును సులభంగా తీసుకోవచ్చు.

Also Read : Swiggy Instamart : దుమారం రేపుతున్న స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ యాడ్ - కేంద్రం జోక్యం చేసుకోవాలని పెరుగుతున్న డిమాండ్

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gorantla Madhav arrest:  పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
Mega Star Chiranjeevi On Mark Shankar:
"మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు" హ్యాపీ న్యూస్ షేర్ చేసిన చిరంజీవి 
CSK Captain MS Dhoni: చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైన రుతురాజ్‌
చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైన రుతురాజ్‌
Revanth Reddy:  యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni to Lead CSK IPL 2025 | సీఎస్కే ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్..ఓ బ్యాడ్ న్యూస్ | ABP DesamRCB vs DC Match Preview IPL 2025 | పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొదమ సింహాల ఢీSai Sudharsan Batting IPL 2025 | 30 మ్యాచులుగా వీడిని డకౌట్ చేసిన మగాడే లేడుShubman Gill vs Jofra Archer  | జోఫ్రా ఆర్చర్ ను ఆడలేకపోతున్న శుభ్ మన్ గిల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gorantla Madhav arrest:  పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
Mega Star Chiranjeevi On Mark Shankar:
"మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు" హ్యాపీ న్యూస్ షేర్ చేసిన చిరంజీవి 
CSK Captain MS Dhoni: చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైన రుతురాజ్‌
చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైన రుతురాజ్‌
Revanth Reddy:  యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
NIA First Statement: ముంబై ఉగ్రదాడుల బాధితులకు న్యాయం అందించే దిశగా ముందడుగు - తహవూర్ రాణాపై ఎన్‌ఐఏ ఫస్ట్ స్టేట్‌మెంట్
ముంబై ఉగ్రదాడుల బాధితులకు న్యాయం అందించే దిశగా ముందడుగు - తహవూర్ రాణాపై ఎన్‌ఐఏ ఫస్ట్ స్టేట్‌మెంట్
Itdp Arrest: గీత దాటితే ఏ పార్టీ అయినా ఒకటే - వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త అరెస్టు
గీత దాటితే ఏ పార్టీ అయినా ఒకటే - వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త అరెస్టు
Chhaava OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తోన్న వీరుడి కథ - 'ఛావా' స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో తెలుసా?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న వీరుడి కథ - 'ఛావా' స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో తెలుసా?
Manchu Manoj: 'మాది ఆస్తి తగాదా కాదు' - అలా జరగకపోయి ఉంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదన్న మంచు మనోజ్
'మాది ఆస్తి తగాదా కాదు' - అలా జరగకపోయి ఉంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదన్న మంచు మనోజ్
Embed widget