Most Loving Zodiac signs: ప్రేమను వ్యక్తం చేయడంలో మీ రాశి ర్యాంక్ ఎంతో తెలుసా!
Astrology :ప్రేమను వ్యక్తం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు మాటల్లో ముంచెత్తుతారు, మరికొందరు ప్రవర్తన ద్వారా వ్యక్తం చేస్తారు. ఇంకొందరు మనసులో దాచేసుకుంటారు. ఇందులో మీరు ఏ టైప్!
Most Loving and Romantic Zodiac signs : అందరి ఆలోచనలూ, అందరి ప్రవర్తనా ఒకేలా ఉండదు. పెరిగిన వాతావరణం, పరిస్థితుల ప్రభావంతో రియాక్షన్స్ మారుతాయి. అయితే కొన్ని లక్షణాలు మాత్రం మీ రాశి ఆధారంగా కామన్ గా ఉంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ముఖ్యంగా మీ మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయడంలో ఒక్కొక్కరిదీ ఓక్కో పద్ధతి..ఇందులో ఏ రాశివారు ఏ స్థానంలో ఉన్నారంటే..
12. మకర రాశి
ప్రేమను వ్యక్తం చేయడంలో 12 స్థానాల్లో మకర రాశివారిదే ఆఖరి స్థానం. ఈ రాశివారు భావోద్వోగాలను ప్రదర్శించేందుకు చాలా కష్టపడతారు. వ్యక్తిగత సంబంధాలపై కూడా అంతగా ఆశక్తి చూపించరు. కానీ తమ ప్రియమైనవారి పట్ల విధేయత కలిగి ఉంటారు. మాటలు కన్నా చేతల్లో ప్రేమను వ్యక్తం చేయాలి అనుకుంటారు.
11. కుంభ రాశి
ప్రేమను వ్యక్తం చేయడంలో పదకొండో రాశి అయిన కుంభంది పదకొండో స్థానమే. వీరు కూడా అంత త్వరగా బయటపడరు. మనసులో ప్రేమ ఉన్నప్పటికీ ఏదో తెలియని దూరం మెంటైన్ చేస్తారు. స్వతంత్ర్యంగా వ్యవహరిస్తారు. తమ చర్యల ద్వారా అర్థం కావాలి కానీ మాటలతో వ్యక్తం చేయడం వీరికి పెద్దగా ఇష్టం ఉండదు.
10. వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారిది ప్రేమను వ్యక్తం చేయడంలో పదో స్థానం. వీరు తమ ప్రియమైన వారిపట్ల విధేయులుగా ఉంటారు, రక్షణగా వ్యవహరిస్తారు కానీ ప్రేమను ప్రేమను చూపించే విషయంలో మాత్రం కాస్త రిజర్వ్‌డ్‌గా ఉంటారు. వృశ్చికరాశి మనసులో మాట బయటపడాలంటే...ఎందుటి వారితో లోతైన బంధాన్ని ఫీలవాలి. ఈ రాశివారు స్పర్శ ద్వారా తమ ప్రేమను వ్యక్తపరచడంలో ఆనందిస్తారు.
Also Read: మీ రాశి మీ బలహీనత ఏంటో చెప్పేస్తుంది.. మీ వీక్ నెస్ ఏంటో తెలుసుకోండి..
9. కన్యా రాశి
మోస్ట్ లవింగ్ రాశులలో కన్యారాశి ర్యాంక్ తొమ్మిది. ఈ రాశివారు విశ్లేషణాత్మకంగా , ఆచరణాత్మకంగా ఉంటారు. తరచుగా తమ భావోద్వేగాలను వ్యక్తీకరించాలి అనుకుంటారు కానీ ఆ దిశగా ప్రయత్నం చేయడంలో ఫెయిల్ అవుతారు. కానీ తమ భాగస్వామికి చాలా విశ్వాసపాత్రులుగా అంకితభావంతో ఉంటారు.
8. మేష రాశి
మేష రాశివారు గొప్ప భాగస్వాములు. బంధాలకు నమ్మకంగా కట్టుబడి ఉంటారు. అయితే ఎదుటివారి నియంత్రించాలి అనుకుంటే మాత్రం వీరి ఆలోచనల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. వీరికి స్వేచ్ఛ ఇచ్చినంతవరకే బంధం బావుంటుంది..లేదంటే తెలియని దూరం క్రియేట్ అవుతుంది.
7. ధనుస్సు రాశి
ప్రేమను తక్కువగా వ్యక్తం చేసే రాశుల్లో ధనస్సుది ఏడో స్థానం. ఈ రాశివారు తమకు సౌకర్యంగా ఉన్న వారితో మాత్రమే ప్రేమగా ఉంటారు. వీరి మానసిక స్థితిని బట్టి ప్రవర్తిస్తారు కానీ ఎదుటివారి ఆలోచనలతో వీరికి పెద్దగా సంబంధం ఉండవు. ఈ రాశులకు చెందిన చాలామంది అప్పటి వరకూ ప్రేమగా ఉండి..ఉన్నట్టుండి అస్సలు పట్టించుకోనంతలా మారిపోతారు. బాగా ఒత్తిడికి గురైనప్పుడు ఇలా ప్రవర్తిస్తుంటారట.
Also Read: మీది ఏ రాశి, మీరు ఆఫీసులో సహోద్యోగులతో ఎలా ఉంటారో తెలుసా!
6.మిథున రాశి
ప్రేమను వ్యక్తం చేయడంలో మిథున రాశివారు సరిగ్గా మధ్యలో ఉన్నారు..ఆరో స్థానంలో ఉన్నారు. ఈ రాశివారు చాలా నమ్మకమైన వారు, సంబంధాలకు కట్టుబడి ఉండటం వలన గొప్ప జీవిత భాగస్వాములు అవుతారు. అయినప్పటికీ ప్రేమను వ్యక్తం చేసే సందర్భాలను అడ్డుకునే పరిస్థితులెన్నో ఎదురవుతాయి. ఈ రాశివారితో రిలేషన్ షిప్ లో సంతోషంగా ఉండాలంటే మానసికంగా సంతోషంగా ఉంచాలి..అప్పుడే వీరినుంచి అంతులేని ప్రేమను పొందగలరు.
5. సింహ రాశి
సింహరాశివారి ర్యాంక్ 5. ఈ రాశివారు ఎంత స్ట్రాంగ్ గా, ధైర్యంగా ఉంటారో తమ ప్రియమైనవారిపట్ల అంతే విశ్వాసంగా, శ్రద్ధగా ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడూ తమ భాగస్వామిని సంతోషంగా మరియు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి అనుకుంటారు. బహుమతులు, ప్రేమతో కూడిన కబుర్లు చెప్పి కట్టిపడేస్తారు
4. వృషభ రాశి
అత్యంత ప్రేమను ప్రదర్శించే రాశులలో వృషభ రాశివారిది నాలుగో స్థానం. వీరు తమ ప్రియమైనవారి పట్ల చాలా విధేయులుగా అంకితభావంతో ఉంటారు. వీరికి ఉండే సహనం గొప్ప భాగస్వామిగా తీర్చిదిద్దుతుంది. ఎలాంటి దాపరికాలు లేని ప్రేమను కోరుకుంటారు.
Also Read: మీ పేరు 'N'తో మొదలైందా... మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం...
3. మీన రాశి
ప్రేమను వ్యక్తం చేయడంలో మీన రాశివారు టాప్ 3 లో ఉన్నారు. బంధాల విషయంలో సున్నితంగా, శ్రద్ధగా వ్యవహరిస్తారు. ఈ రాశివారు తమ జీవిత, ప్రేమ భాగస్వాముల భావాలను, అవసరాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమ, ఆప్యాయత చూపించేందుకు సమయం వెచ్చిస్తారు. మీన రాశివారు తమ ప్రేమలో నిస్వార్థంగా ఉంటారు.
2. కర్కాటక రాశి
కర్కాటక రాశివారు ప్రేమకు కట్టుబడి ఉంటారు. వీళ్లు చాలా రొమాంటి కూడా. భాగస్వామి భావోద్వేగాలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వారిపై ఎంత ప్రేమ ఉందో చూపించేందుకు తాపత్రయపడతారు. నమ్మశక్యం కాని ప్రేమను అందిస్తారు. అయితే ఆ ప్రేమను అర్థం చేసుకుంటే జీవితం అత్యంత సంతోషంగా ఉంటుంది.
Also Read: మీ పేరు M,T అక్షరాలతో మొదలైందా.. వామ్మో మీరు మామూలోళ్లు కాదు...
1. తులా రాశి
12 రాశులలో అత్యంత ప్రేమగల రాశి తులా రాశి. వీరెప్పుడూ తమకన్నా భాగస్వామి అవసరాలకే తొలి ప్రాధాన్యతనిస్తారు. ప్రేమ బంధాలకు అత్యంత ప్రయార్టీ ఇస్తారు. రొమాంటిగా ఉంటారు. తమ ప్రియమైనవారు సంతోషంగా ఉండేందుకు చేయగలిగినదంతా చేస్తారు. అందుకే ప్రేమను వ్యక్తం చేయడంలో ఈ రాశివారిదే టాప్ ప్లేస్..