అన్వేషించండి
Advertisement
Name Astrology: మీ పేరు M,T అక్షరాలతో మొదలైందా.. వామ్మో మీరు మామూలోళ్లు కాదు...
పుట్టిన నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకునే వారు చాలామంది ఉంటారు. అయితే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకునే వారి మొదటి అక్షరాల ఆధారంగా వారి వ్యక్తిత్వం, ఆలోచనా విధానం చెప్పొచ్చు అంటారు జ్యోతిష్యులు.
ఒక్కొక్కరిది ఒక్కోతీరు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని ప్రత్యేకతలుంటాయి, మరికొన్ని మార్చుకోవాల్సిన లక్షణాలుంటాయి. ఏ ఇద్దరి మనస్తత్వం, ప్రవర్తన, తీరు పూర్తిగా ఒకేలా ఉండదు. అయితే అదంతా మీ పేరులో మొదటి అక్షరంపై కూడా ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్యులు.
M, T అక్షరాలతో పేరున్న వారెలా ఉంటారంటే..
- M, T అక్షరాలతో పేరు మొదలయ్యే వారి ఆలోచనలు చాలా ధృడంగా ఉంటాయి.
- ఏదైనా పని తలపెడితే ఆ పని పూర్తయ్యేవరకూ ఎంత కష్టాన్నైనా ఎదుర్కొంటారు, ఎంత దూరమైనా వెళతారు.
- వీళ్లు రాజులా జీవించేందుకు ఇష్టపడతారు.
- వీరు అంతర్ముఖులు..వీరి ఆలోచనలు, నిర్ణయాలు ఎవరికీ తెలియనీయరు. అంతమాత్రాన మోసం చేస్తారని కాదు వీరు అత్యంత నిజాయితీపరులు, నమ్మదగిన వారు
- మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు
- వీరిలో ఉండే లోపం ఏంటంటే అధిక కోపం.. కోపం కారణంగా చాలాసార్లు తమని తాము కంట్రోల్ చేసుకునే స్టేజ్ దాటిపోతారు. ఫలితంగా తప్పులు చేస్తారు, వారి కోపం వల్ల వారికే నష్టం జరుగుతుంది
- వీరికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ, ఎవరైనా వీరి గౌరవాన్ని కించపరిస్తే అస్సలు సహించలేరు. గౌరవాన్ని పోగొట్టుకునేందుకు అస్సలు తగ్గరు
- వీరు అందరితో తొందరగా కలసిపోతారు, ఎవ్వరైనా తొందరగా స్నేహం చేసేస్తారు
- కెరీర్ ని గట్టిగా ప్లాన్ చేసుకుంటే ఎంత కష్టపడి అయినా తాము అనుకున్న స్థానానికి చేరుకోగలరు
- వందల మందిలో ఉన్నా తమకంటూ గుర్తింపు తెచ్చుకోవడంలో వీరు సక్సెస్ అవుతారు
- ఎవ్వరికిందా ఉండి పనిచేయడానికి అస్సలు ఇష్టపడరు...కేవలం తమ మనసుకి నచ్చినదే చేస్తారు.
- నా జీవితం నా ఇష్టం అన్నట్టుంటారు.. తమ వ్యక్తిగత జీవితంలో ఎవరి జోక్యాన్ని ఇష్టపడరు.
- వీళ్లు చాలా క్రమశిక్షణతో ఉంటారు, ఏదైనా పనిని సమయానికి ముందే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.
- వీరి వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టుకుంటుంది. అందుకే అందర్నీ తొందరగా ఆకర్షిస్తారు
- వీరి ఆలోచనలు, అభిప్రాయాలు, సూచనలను చాలామంది ఇష్టపడతారు..
- సమాజంలో వీరికంటూ ఓ ఇమేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది...
ఇవి కామన్ గా ఉండొచ్చని చెప్పే లక్షణాలు మాత్రమే..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా ఫలితాల్లో మార్పులుంటాయి..గమనించగలరు
Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1
Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-2
Also Read: ఈ నక్షత్రంలో పుడితే మామూలు శాంతి కాదు బాబోయ్...నక్షత్ర దోషాలు Part-3
Also Read: రేవతి మినహా చివరి ఏడు నక్షత్రాల్లో జన్మిస్తే మీరు సూపర్..నక్షత్ర దోషాలు Part-4
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
గాడ్జెట్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion