NAKSHATRA / STAR : ఈ నక్షత్రంలో పుడితే మామూలు శాంతి కాదు బాబోయ్...నక్షత్ర దోషాలు Part-3
పిల్లలు పుట్టినప్పుడు నక్షత్రం మంచిదేనా,శాంతి చేయించాలా అనే సందేహం కలుగుతుంది. కొన్ని నక్షత్రాల్లో జన్మిస్తే తల్లిదండ్రులకు, మేనమామకు, పుట్టిన పిల్లలకు దోషం ఉంటుందంటారు. ఆ నక్షత్రాలేంటో చూద్దాం
అప్పట్లో ఆపరేషన్ల హడావుడి పెద్దగా ఉండేది కాదు....నార్మల్ డెలివరీ కావడంతో పిల్లలు పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం, పాదం ఏంటో చూసి అవసరమైన శాంతి, పూజలు , జపాలు, హోమాలు చేయించేవారు. ఇప్పుడంతా ట్రెండ్ మారింది. శుభసమయం, శాంతి లేని నక్షత్రం చూసుకుని మరీ ఆపరేషన్లు చేయిస్తున్నారు. కొన్ని తప్పని పరిస్థితుల్లో మాత్రం శాంతి నక్షత్రాల్లో పుట్టిన పిల్లలు ఉన్నారు. మరి ఏ నక్షత్రం, ఏఏ పాదాల్లో పుడితే ఎలాంటి దోషమో తెలుసుకోండి...
Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1
అశ్విని నుంచి రేవతి వరకూ మొత్తం 27 నక్షత్రాలు, ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయి. కొన్ని నక్షత్రాల్లో నాలుగు పాదాలకి దోషం ఉంటే..మరికొన్ని నక్షత్రాల్లో ఒక్కో పాదానికి ఒక్కో ఫలితం ఉంటుంది.
16. విశాఖ నక్షత్రం 1 2 3 4 ఏ పాదములో పుట్టినా బంధువులకు గండం. విశేష శాంతి అవసరం.
17. అనూరాధ నక్షత్రం 1 2 3 4 పాదాల్లో జన్మించిన వారికి దోషం లేదు
18 . జ్యేష్ట ఈ నక్షత్రం చాలా పెద్ద శాంతి కలిగిన నక్షత్రం. దీనిలో 1 2 3 4 ఏ పాదాల్లో జన్మించినా దోషమే. జాతకుల పుట్టిన రోజున ఉన్న జ్యేష్ట నక్షత్రం మొత్తం సమయాన్ని 10 భాగములు చేయాలి. అందులో ఏ భాగంలో పుడితే ఆ భాగ సంబంధం కలవాలకి నష్టం జరుగుతుందంటారు. 1 వ భాగములో తాతయ్యకు, 2 అమ్మమ్మకు, 3 తల్లి తోడ బుట్టిన వారికి, మేనమామలకు 4 అన్నలకు, అక్కలకు 5 శిశువునకు, 6 ఎవ్వరికి దోషము ఉండదు, 7 వివాహ సమయములో అత్త వారి బంధు వర్గమునకు, 8 జాతకునకు, 9 తల్లికి, 10 తండ్రికి దోషము కలుగుతుందంటారు. అయితే శాంతి చేయిస్తే ఎలాంటి దోషం ఉండదు.
Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-2
19. మూల నక్షత్రం నాలుగో పాదం మినహా ఏ పాదంలో జన్మించినా దోషమే. 1 వ పాదం తల్లిదండ్రులకు, రెండో పాదం తండ్రికి నష్టం కలుగుతుంది. మూడో పాదంలో జన్మిస్తే ఆర్థికంగా నష్టాలుంటాయి. జ్యేష్ట ,మూలా నక్షత్రాల్లో జన్మించిన వారి దోషం వివాహ కాలం వరకు ఉంటుందని చెబుతారు. నవ గ్రహ శాంతి, జపాలు, దానాలు ఇవ్వడం వల్ల దోషం తొలగిపోతుందని చెబుతారు.
20. పూర్వాషాడ నక్షత్రం పగలు కొడుకు పుడితే తండ్రికి ఆపద, రెండు మూడు పాదాల్లో ఎవ్వరు పుట్టినా తల్లిదండ్రులకు గండం, నాలుగోపాదంలో జన్మిస్తే ఎలాంటి దోషం లేదు.
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
నక్షత్రంతో సంబంధం లేకుండా పేగులు మెడలో వేసుకుని పుట్టినా, కాళ్లు మొదట బయటకు వస్తూ పుట్టినా, గ్రహణ సమయంలో జన్మించినా, తండ్రిదండ్రులు, తోబుట్టువల జన్మ నక్షత్రంలో పుట్టినా తప్పక శాంతి చేయించాలి. శాంతిరోజు ఏం చేయాలనేది నక్షత్రం, పాద దోషంపై ఆధారపడి ఉంటుంది. మీరు విశ్వసించే పండితుల దగ్గరకు వెళ్లి పూర్తివివరాలు తెలుసుకుని శాంతి చేయించాలి...
శిశువు జన్మించిన తర్వాత పురిటి శుద్ధి అయ్యాక జన్మపత్రిక రాయించుకుని, దోషాలేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకోవాలి.శిశువు పుట్టిన 27 రోజుల లోపు శాంతి జరిపించుకోవాలి. ఎంత ఆలస్యం చేస్తే అన్ని సమస్యలు ఎదురవుతాయి అంటారు పెద్దలు. అందుకే సాధ్యమైనంత తొందరగా శాంతి జరిపించాలంటారు.
మిగిలిన నక్షత్రాలకు సంబంధించిన వివరాలు రేపటి కథనంలో చూడగలరు...
నోట్- దోషం ఉన్న నక్షత్రంలో జన్మించినంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే అపోహవద్దు. ఈ కథనం భయభ్రాంతులకు గురిచేయలనే ఉద్దేశం ఎంత మాత్రమూ కాదు. కేవలం కొన్ని శాంతులు, హోమాలు, జపాలు చేయడం ద్వారా చెడు ఫలితాలు పూర్తిగా తొలిగిపోతాయంటారు. అయితే ఏం చేసినా నమ్మకం ప్రధానం..అది లేనప్పుడు నక్షత్ర దోషాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
Also Read: తెలివైనవాడికి శత్రువులు ఎందుకుండరు?
Also Read: మీ నక్షత్రం...మీ రాశి....ఏ నక్షత్రానికి ఏ అక్షరాలో ఇలా తెలుసుకోండి...
Also Read: రుద్రాక్ష చెట్టు ఇంట్లోనే పెంచుకోవచ్చు…ఎలాగో తెలుసా?
Also Read: చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదు.. ఇదో చాదస్తమా..!
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..