Spirituality: చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదు.. ఇదో చాదస్తమా..!
సూర్యాస్తమయం అయిన తర్వాత పూలు కోయకూడదని చెబుతారు కదా..ఎందుకో ఏంటో మీకు తెలుసా..
పెద్దోళ్లు చెప్పారు అని ఫాలో అయిపోతారు కానీ వాటి వెనుక కారణం ఏంటి, ఎందుకు అనే ఆలోచించరు. అందుకే చాలా విషయాలు మూఢనమ్మకాల జాబితాలో చేరిపోయాయి. చీకటి పడ్డాక పూలు కోయకూడదు అన్న మాట కూడా ఈ కోవకే చెందుతుంది. ఇంతకీ చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదని ఆలోచిస్తే వాటివెనుక ఆధ్యాత్మిక కారణాలు మాత్రమే కాదు ప్రకృతి పరమైన, శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయని తెలుసా..
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
హిందూ సంప్రదాయంలో పూలకి ప్రత్యేక స్థానం ఉంది. శుభం-అశుభం- పండుగ- ఫంక్షన్ సందర్భం ఏదైనా పూల ఘుమఘుమ ఉండాల్సిందే. అయితే సందర్భాల మాట పక్కనపెడితే సూర్యాస్తమానం అయిన తర్వాత పూలు కోయకూడదని పెద్దలు చెబుతుంటారు. పాటిస్తే పోలా అనుకుని పాటించేస్తున్నారు. కానీ చీకటి పడ్డాక పూలు ఎందుకు కోయకూడదన్నది మూఢ నమ్మకమో, చాదస్తమో కాదు దీనికి ప్రకృతిపరమైన కారణాలున్నాయి.
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
సాయంత్రం చీకటి పడే సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఆ సమయంలో పురుగులు, పాములు చెట్లపై చేరే అవకాశం ఉంది వెలుగు ఉండదు కాబట్టి చెట్టుపై ఉండే పురుగులు కనిపించే అవకాశం ఉండదు. ఆసమయంలో పూలు కోస్తే విషపురుగుల బారిన పడతామని ఉద్దేశం. మరోకారణం ఏంటంటే.. చీకటి పడగానే మొక్కలు, చెట్లు కిరణజన్య సంయోగ క్రియను ఆపేస్తాయి. అలాంటప్పుడు వాటి నుంచి ఆక్సిజన్ కాకుండా కార్బన్ డై ఆక్సైజ్ విడుదలవుతుంది. ఆ గాలి పీల్చడం ఆరోగ్యానికి హానికరమని కూడా చీకటిపడ్డాక పూలు కోయద్దని చెబుతారు. ఓవరాల్ గా చూస్తే పెద్దలు పాటించమని చెప్పే ప్రతి విషయం వెనుకా ఓ శాస్త్రీయ కారణం ఉంటుంది...అది తెలియక అంతా చాదస్తం, మూఢనమ్మకం అనుకోవడం సరికాదంటారు పండితులు.
Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read: సంక్రాంతి ఒక్కటే కాదు జనవరి నెలంతా పండుగలే...
Also Read: భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఈ పనులు చేయకూడదంటారు …ఎందుకో తెలుసా..
Also Read: వారంలో ఈ రోజు తలస్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు, ఆపదలు తప్పవట…
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
Also Read: తీర్థం తీసుకుని చేయి తలకు రాసుకుంటున్నారా…
Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి