Sabarimala Vanayatra: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..

'ఆద్యంత రహితమౌ నీ విశ్వరూపం- అజ్ఞాన తిమిరమ్మునణుచు శుభదీపం..ఈ 4దిక్కులు 14భువనాలు పడిమెట్లుగా మారె ఇదో అపురూపం' అంటూ స్వామిని దర్శించుకుంటారు.మరి అయ్యప్ప సన్నిధి చేరేందుకు చేసే వనయాత్ర గురించి తెలుసా

FOLLOW US: 

మండల కాలంపాటు‘స్వామియే శరణమయ్యప్ప’అనే శరణు ఘోషతో సాగే  అయ్యప్ప దీక్ష మానవ జీవన సన్మార్గానికి బాటలు వేస్తుంది. కఠోర దీక్ష చేసి, ఇరుమడిని తలపై పెట్టుకుని పదునెట్టాంబడి మీదుగా అయ్యప్పను దర్శించుకోగానే తన్మయత్వం చెందుతారు. అయ్యప్ప దీక్షలో అతి ముఖ్య ఘట్టం వనయాత్ర. స్వామి సన్నిధానానికి చేరుకోగలిగే మార్గాల్లో ఇదొకటి. ఇరుముడిని తలపై ధరించి ‘కల్లుం ముల్లుం కాలికి మెత్తై .. స్వామికే’ అంటూ సాగే వనయాత్రతో కలిగే దివ్యానుభూతి వర్ణించలేం.  పుణ్య నదుల్లో స్నానం, కొండలు, అడవుల్లో ఉండే ఔషధ వృక్షాల నుంచి వీచే స్వచ్ఛమైన గాలివల్ల మనకు తెలియకుండానే శక్తివచ్చేస్తుందట. అయ్యప్ప దర్శనానికి వెళ్లేందుకు ఎన్నో మార్గాలున్నా..అత్యంత ముఖ్యమైనది, అతి ప్రాచీనమైన మార్గం ఎరుమేలి నుంచి ప్రారంభమవుతుంది.  ఇది సాక్షాత్తూ అయ్యప్ప స్వామి నడిచి వెళ్లిన వనం అంటారు. 

ఎరుమేలి నుంచి అయ్యప్ప సన్నిధికి మార్గం ఇదే
ఎరుమేలి: ఎరుమేలి నుంచి వనయాత్ర మొదలవుతుంది. భక్తులు తమ శరీరానికి రంగులు పులుముకుని, పేటైకళంలో నృత్యం చేసి, పేటయిల్‌ శాస్తాను, వావరు స్వామిని, దర్శించుకుంటారు. వనంలో ప్రవేశించే తమకు తోడుగా రమ్మని ప్రార్థించి యాత్రను ప్రారంభిస్తారు. 

కోట్టైప్పడి: అయ్యప్ప స్వామికి ప్రథమ సేవకుడు, స్నేహితుడు వావరు స్వామి కొలువుదీరిన పుణ్యస్థలి కోట్టైపడి. ‘పేరూర్‌తోడు’అని పిలిచే ఈ ప్రదేశంలో కాలువల్లో చేపల ఆహారం కోసం మరమరాలు వేస్తుంటారు. 

Also Read: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. పెద్ద పాదం నడకకు రూట్ క్లియర్..
కాళైకట్టి: అయ్యప్ప స్వామి మహిషితో యుద్ధం చేస్తుండంగా సాక్షాత్తూ పరమశివుడు భువికి దిగొచ్చి తన వాహనం నందిని కట్టిన ఉంచి స్థలాన్ని మలయాళంలో కాళై అంటారు. ఇక్కడ అతి పురాతనమైన శివాలంయ ఉంది.  పృథ్వీకి దిగివచ్చి తన వాహనం నందిని కట్టి ఉంచిన స్థలం. మలయాళంలో నందిని ‘కాళై’ అంటారు. ఇక్కడ అతి పురాతన శివాలయం కూడా ఉంది.

అళుదా నది: అయ్యప్పతో యుద్ధం చేసిన మహిషి స్వామి బాణాలకు తాళలేక రోదిస్తూ కన్నీరు కార్చింది. ఆ కన్నీరు అక్కడ ప్రవహిస్తోన్న అలసా నదీలో కలవడం వల్ల దానికి అళుదానది పేరు వచ్చిందంటారు. ఈ నదిలో స్నానం చేసిన భక్తులు రెండు రాళ్లు తీసుకుని యాత్రామార్గంలో ఉన్న కళిడంకుండ్రులో విసురుతారు.

అళుదా మేడు: అళుదా నదిలో స్నానం తర్వాత భక్తులు ఎక్కే నిటారైన కొండే అళుదామేడు. సుమారు 5 కిలోమీటర్ల మేర ఉండే ఈ కొండ ఎత్తైన గుండ్రని రాళ్లతో ఉంటుంది. ఇక్కడ కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఉండదు. 

Also Read: మధుబన్ లో ఏం జరిగింది, సన్నీ లియోన్ సాంగ్ పై ఎందుకీ వివాదం..
కళిడంకుండ్రు
మహిషిని వధించిన స్వామి ఆమె కళేబరాన్ని ఆకాశంపైకి విసరగా అది నేలపై పడిన స్థలమే కళిడంకుండ్రు. బ్రహ్మహత్యా దోషం నుంచి బయటపడటానికి అళుదానదిలో స్నానమాచరిస్తున్న దేవతలు... మహిళి కళేబరం రోజురోజుకీ పెరగడం గమనించి ఆ నదిలోంచి తమ చేతికి దొరికిన రాళ్లను దానిపై వేసి సమాధి చేశారట. అందుకే ఆ నదిలో స్నానం చేసిన తర్వాత రెండు రాళ్లు తీసుకెళ్లి కిల్లుడుకుండ్రుంలో విసిరి మహిషి కళేబరానికి నమస్కరించి, హారతిచ్చి మళ్లీ యాత్ర సాగిస్తారు. 

ఇంజిప్పారకోట
కలిడుంకుండ్రు తర్వాత వనయాత్రలో చేరే ప్రాంతం ఇంజిప్పారకోట. ఇక్కడే అయ్యప్ప స్వామి ఉదయనుడు అనే బందిపోటు దొంగను హతమార్చారట. ఇక్కడ శిథిలమైన కోట అవశేషాలు కూడా ఉన్నాయి. ఇది భక్తులు విశ్రాంతి తీసుకునే ప్రదేశం. 

కరిమల: ఎత్తైన ఈ కొండ నిట్టనిలువుగా ఉంటుంది. దాదాపు 10కిలోమీటర్లు ఎత్తుకు వెళ్లాక కరిమల శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి, జలపాతం ఉన్నాయి. కరిమల ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టమయినా కానీ.. శరణుఘోష ముందు ఈ కష్టం దూది పింజలా తేలిపోతుందని చెబుతారు అయ్యప్ప భక్తులు. 

Also Read: అసలు గుడికి ఎందుకు వెళ్లాలి, ఇంత పరమార్థం ఉందా..!
పెరియాన వట్టం
కరిమల దిగిన తర్వాత చిన్న కాలువలా నీరు ప్రవహించే ప్రదేశం పెరియాన వట్టం. ఇక్కడ ఏనుగుల సంచారం ఎక్కువ. వన్యమృగాలూ సంచరిస్తుంటాయి. చీకటి పడే సమయానికి ఈ ప్రాంతంలో ఉండకుండా ప్లాన్ చేసుకుంటారు స్వాములు. 

చెరియాన వట్టం
ఇక్కడి నుంచి భక్తులు పంబ వరకు విడిది ఏర్పాటు చేసుకుని వంటలు చేసుకుని, తిని విశ్రాంతి తీసుకుంటారు. 

పంబా నది
ఔషధ మూలికల సారంతో ప్రవహించే ఈ నదిలో స్నానం చేస్తే వనయాత్ర అలసట ఒక్కసారి మటుమాయమవుతుందంటారు. దీనినే దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. ఇక్కడ పితృకర్మలు నిర్వహిస్తే ఏడు తరాల వారు మోక్షం పొందుతారని నమ్మకం. సాక్షాత్తూ శ్రీరామచంద్రుడే ఈ నదిలో స్నానమాచరించినట్టు పేర్కొంటారు. అందుకే పంబా తీరంలో రామ పాదాలు దర్శనమిస్తాయి. ఎరుమేలి నుంచి కాలినడకన వచ్చే వారూ, చాలక్కాయం మీదుగా వాహనాల్లో వచ్చేవారంతా ఇక్కడ కలుస్తారు.

Also Read: మంచి భర్త లభించాలన్నా.. సంసార జీవితం సంతోషంగా సాగాలన్నా ఈ నెలరోజులు చాలా ముఖ్యమట...
నీలిమల
సన్నిధానానికి త్వరగా చేరుకోవాలనే ఉత్సాహం, స్వామివారిని ఎంత త్వరగా దర్శించుకుంటామో అనే ఆతృత ఇక్కడి నుంచే మొదలవుతుంది.  రామాయణ కాలంలో దీనిని మాతంగవనం అని పిలిచేవారు. కరిమల కంటే నీలిమల ఎక్కడం ఎంతో కష్టం అంటారు కొందరు భక్తులు.

అపొచ్చిమేడు
దుర్దేవతల ప్రీతికోసం నీలిమల శిఖరం రెండు వైపులా ఉన్న లోయలో భక్తులు బియ్యపు ఉండలు విసురుతారు.  కపట భక్తులకు ఆత్మ ప్రభోద కల్పించేందుకు దేవతలు ఇక్కడ వేచి ఉంటారని భక్తుల విశ్వాసం. 

శబరిపీఠం
శబరిమాత నిర్గుణోపాసనతో అయ్యప్పస్వామి దర్శనం పొందిన ప్రదేశం. శబరిమాత పేరుతో ఇక్కడ విద్యాపీఠం ఏర్పాటు చేసి, పందళ రాజవంశీయులు విద్యాభ్యాసం చేశారని, ఈ ప్రదేశానికి 5వేల సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు.

Also Read:కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
శరంగుత్తి
తొలిసారి అయ్యప్పస్వామి మాల ధరించిన భక్తులను కన్నెస్వాములు అంటారు. కన్నెస్వాములు వనంలోని రక్షాదండంగా ఎరుమేలి నుంచి తెచ్చిన శరాలను ఇక్కడ రావి వృక్షంలో గుచ్చుతారు. అప్పటి వరకూ మనకు మార్గం చూపి, వెన్నంట నడిచిన కరుప్పస్వామి అక్కడే ఆగిపోతారని ప్రతీతి.

పదినెట్టాంబడి
వనయాత్రలో అత్యంత ముఖ్యమైనది పదినెట్టాంపడి ఘట్టం. పవిత్రత నిండిన దైవాంశమైన మూడార్ల సోపానాలనీ, ముక్తికి మెట్లనీ వీటిని అంటారు. మండల కాల దీక్షా వ్రతం లేని వారు ఈ మెట్లను ఎక్కడానికి అర్హులు కారు. మెట్లు ఎక్కేముందు కొబ్బరికాయ కొట్టి, కరుప్పస్వామి, కరుప్పాయమ్మలకు నమస్కరించి..ఇరుముడి తలపై ధరించి శరణుఘోషతో మెట్లెక్కాలి.  యాత్రలో ఎక్కేటప్పుడు ఒకసారి, దిగే సమయంలో మరోసారి మాత్రమే ఈ మెట్లను ఉపయోగించాలి.

సన్నిధానం
ఇరుముడితో పదినెట్టాంబడి దాటి సన్నిధానంలోనికి ప్రవేశించిన భక్తులకు మొదట ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఆ తర్వాత మణి మండపం, కన్నిమూల గణపతి, సర్పరాజును దర్శిస్తూ ప్రదక్షిణగా వచ్చి చిన్ముద్ర ధారియై ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకుని తరిస్తారు. దర్శనానంతరం ఇరుముడి విప్పి అందులో ఉన్నవన్నీ స్వామివారికి అర్పించి.. టెంకాయ కొట్టి అందులో నేతిని స్వామి అభిషేకానికి సమర్పించి.. ఆ కొబ్బరికాయను పదునెట్టాంబడి సమీపంలో  ఉన్న భస్మకుళంలో వేస్తారు. 

ఎరుమేలి నుంచి స్వామి సన్నిధికి చేరడానికి ఇన్ని దాటుకుని రావాలా అని అనుకున్నా.. ఒక్కసారి స్వామివారి దర్శనం జరిగిన తర్వాత ఆ కష్టం ఒక్క క్షణం కూడా గుర్తుకురాకపోగా.. ఈ జీవితానికి ఇంకేం కావాలి అనిపిస్తుందంటారు అయ్యప్ప భక్తులు. అందుకే జీవిత కాలంలో ఒక్కసారైనా వనయాత్ర చేయాలని చెబుతారు. 

Also Read: చెడు మాట్లాడకు.. తథాస్తు దేవతలున్నారు అంటారు కదా.. నిజంగా ఉన్నారా, దీని వెనుక అసలు విషయం ఏంటి..
Also Read: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం, ఆ దిక్కున తలపెడితే అకాల మృత్యువు- వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Sabarimala Sabarimala Temple sabarimalai sabarimala ayyappa swamy sabarimala ayyappa sabarimala news pamba to sabarimala sabarimala yatra sabarimala vanayatra sabarimala vanayathra sabarimala ayyappa vanayatra sabarimalai padayatra sabarimala trek sabarimala vanayatra - pedda padam ayyappa vanayatra sabarimala traditional route sabarimala ayyappa temple

సంబంధిత కథనాలు

Astrology:  మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా

Astrology: మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా

Weekly Horoscope May 16 to 22: ఈ వారం మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Weekly Horoscope May 16 to 22: ఈ వారం మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Kurma Jayanti 2022: ఈ క్షేత్రంలో స్నానమాచరిస్తే కలిదోషాలు తొలగిపోతాయి

Kurma Jayanti 2022: ఈ క్షేత్రంలో స్నానమాచరిస్తే కలిదోషాలు తొలగిపోతాయి

Vaishakh Purnima 2022: వైశాఖపూర్ణిమ, బుద్ధ పూర్ణిమ-ఇలా చేస్తే పితృదోషం, శనిదోషం తొలగిపోతుంది

Vaishakh Purnima 2022: వైశాఖపూర్ణిమ, బుద్ధ పూర్ణిమ-ఇలా చేస్తే పితృదోషం, శనిదోషం తొలగిపోతుంది

Today Panchang 16th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఉమామహేశ్వర స్తోత్రం 

Today Panchang 16th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఉమామహేశ్వర స్తోత్రం 
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

PBKS Vs DC: ఆఖర్లో తడబడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ - పంజాబ్ ముందు సులువైన లక్ష్యం!

PBKS Vs DC: ఆఖర్లో తడబడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ - పంజాబ్ ముందు సులువైన లక్ష్యం!

Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్‌కు మహిళల సూటిప్రశ్న

Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్‌కు మహిళల సూటిప్రశ్న

Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్

Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్

Batsmen Out At 199: 199 మీద అవుటైన ఏంజెలో మాథ్యూస్ - ఆ 12 మంది సరసన - ఇద్దరు భారతీయలు కూడా!

Batsmen Out At 199: 199 మీద అవుటైన ఏంజెలో మాథ్యూస్ - ఆ 12 మంది సరసన - ఇద్దరు భారతీయలు కూడా!