(Source: ECI/ABP News/ABP Majha)
Spirituality: అసలు గుడికి ఎందుకు వెళ్లాలి, ఇంత పరమార్థం ఉందా..!
దేవుడిని విశ్వసించే వారంతా ఆలయాలకు వెళ్లొస్తుంటారు. కొందరు అప్పుడప్పుడు వెళితే..ఇంకొందరు మాత్రం నిత్యం ఏదో ఒక గుడికి వెళ్లి ప్రదక్షిణం చేసి, దర్శించుకుని వస్తుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్లాలి..
చుట్టూ వీధులు, రోడ్లు, ట్రాఫిక్ ఎంత గందరగోళంగా ఉన్నప్పటికీ గుడి ఆవరణలో అడుగుపెట్టగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏదో భారం దిగిపోయినట్టు, తెలియని శక్తి ఆవహించినట్టు భావించేవారెందరో ఉన్నారు. అదంతా ఆ దేవుడి మహిమే అంటారు. అయితే ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటేంటే దేవుడి మహిమతో పాటూ ఆలయాన్ని నిర్మించిన విధానం, అక్కడ జరుగుతున్న పూజలే పాజిటివ్ వైబ్రేషన్స్ కి కారణం అంటారు పండితులు, సాంకేతిక నిపుణులు.
Also Read: ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తున్నారు.. ఏ దేవుడికి ఎన్ని చేయాలో తెలుసా..
- భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్, విద్యుత్ అయస్కాంత తరంగాలు కలుస్తాయో అక్కడే మూల విరాట్ ఉంటుంది. వాటిని ఆలయాల్లో ప్రతిష్టించే ముందు రాగి రేకులను ఉంచుతారు. అవి ఈ తరంగాలకు క్యాటలిస్టుగా పని చేస్తాయి.
- చాలా మంది దేవాలయాలకు వెళ్లినప్పుడు ప్రదక్షిణలు చేస్తుంటారు. అలా తిరిగినప్పుడు అక్కడే ఉండే తరంగాల శక్తి మన దేహానికి వస్తుందని చాలా మంది నమ్మకం. ఇవి శరీరంలో షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.
- ప్రతి దేవాలయంలోనూ పూజారులు మంత్రాలను చదువుతూ ఉంటారు. ఇవెందుకంటే అక్షర నియమంతో ఉండే మంత్రాలు ఒక లయగా ఉండి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి.
- సాధారణంగా ఆలయాలకు వెళ్లేటప్పుడు పెద్దలు ఆభరణాలు వేసుకుని వెళ్లండని చెబుతారు. ఇది ఆడంబరం చూపించేందుకు అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే ఈ బంగారు ఆభరణాలు తరంగాలను బాగా గ్రహిస్తాయి. తద్వారా శరీరంలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయని చెబుతారు.
- దేవాలయాలకు తడి బట్టలతో వెళ్లేవారిని చూసి మడి, ఆచారం అంటుంటాం. కానీ తడి బట్టలకు ఆక్సిజన్ పీల్చే శక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతమైన ఆలయ వాతావరణంలో తడిబట్టలతో వెళితే పుణ్యం కన్నా ఆరోగ్యాన్ని మూటగట్టుకోవచ్చంటారు.
- ఔషధగుణాలున్న హారతిని కళ్లకు అద్దుకునేటప్పుడు ఆ వెచ్చదనం కంటికి తగిలితే మంచిదంటారు. అలాకాకుండా ఏ మూలో ఉండి హారతి కళ్లకు అద్దుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదంటారు.
- దేవుళ్లకు అభిషేకరం చేసిన తర్వాత ఇచ్చే తీర్థంలో పచ్చకర్పూరం, తులసి, లవంగాలు, పంచామృతాలు మిక్స్ చేస్తారు. ఆ తీర్థం తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
Also Read: బొట్టు పెట్టుకునే అలవాటుందా .. అయితే ఈ వేలితో పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందట…
అందుకే భక్తితో మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా అప్పుడప్పుడు ఆలయాలకు వెళ్లిరండి అంటారు పెద్దలు, పండితులు. దేవుడిపై నమ్మకం ఉండేవారికి ప్రతి చిన్న విషయం అద్భుతమే... దేవుడిపై విశ్వాసం లేని వారికి ఎంత పెద్ద విషయమైనా పూచికపుల్లతో సమానమే. ఫైనల్ గా ఎవరి విశ్వాసాలు వారివి.
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
Also Read: తిరుప్పావై అంటే ఏంటి, ఆండాళ్ ఎవరు.. గోదాదేవి రాసిన 30 పాశురాల ప్రత్యేకత ఏంటి…
Also Read: మంచి భర్త లభించాలన్నా.. సంసార జీవితం సంతోషంగా సాగాలన్నా ఈ నెలరోజులు చాలా ముఖ్యమట...
Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి