By: ABP Desam | Published : 27 Dec 2021 11:31 AM (IST)|Updated : 27 Dec 2021 11:32 AM (IST)
Edited By: RamaLakshmibai
Madhuban mein Radhika Song
సన్నీలియోన్ ‘మధుబన్ మే రాధిక నాచే’ వీడియో ఆల్బమ్ విడుదలైంది. డిసెంబర్ 22న విడుదల చేసిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. అయితే ఉత్తర ప్రదేశ్‌లోని ప్రవిత్ర స్థలాల్లో ఒకటైన ‘మధుర’కు చెందిన పూజారులు ఆ పాటపై అభ్యంతరం వ‍్యక్తం చేశారు. పలు రాష్ట్రాల మంత్రులు కూడా దీనిపై స్పందించి.. ఆ సాంగ్ తొలగించాలన్నారు. ఈ పాటలో సన్నీ లియోన్ చేసిన అశ్లీల నృత్యం మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉందన్నారు. ఇంతకీ మధుబన్ లో ఏం జరిగింది... సన్నీ లియోన్ సాంగ్ లో ఏముంది...
నాస్తికులకు, హేతువాదులకు కూడా ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం ఆ ఆలయం. అక్కడ దేవుడు లేడని నిరూపించేందుకు అర్థరాత్రి కాపుకాసినా, కెమెరాలు పెట్టినా , ఎంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. అలాంటి ప్రదేశాల్లో ఒకటి మధురలో నిధివన్. ఇక్కడ అర్థరాత్రి ఏం జరుగుతుందో తెలుసుకుందామనుకున్నప్పటీ ద్వాపరయుగం నుంచి కలియుగం వరకూ అది రహస్యంగానే మిగిలిపోయింది.
Also Read: బొట్టు పెట్టుకునే అలవాటుందా .. అయితే ఈ వేలితో పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందట…
ఉత్తర ప్రదేశ్ రాష్ర్టంలోని మధుర జిల్లా బృందావనలోని ఉంది మధుబన్. ఈ స్థలం ప్రత్యేకత ఏంటంటే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు నిత్యం రాధను కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చేవాడని చెబుతారు. అది ఇప్పటికీ కొనసాగుతుందంటారు. అదృశ్య రూపంలో రాధాకృష్ణులు గోపికలతో కలసి ఇక్కడ రాత్రిపూట నాట్యం చేస్తుంటారని చెబుతారు. అందుకే మధుబన్ ప్రధాన ఆలయం ద్వారాలను సూర్యాస్తమయం అయిన వెంటనే మూసివేస్తారు. ప్రవేశ ద్వారానికి ఏకంగా తాళం పెట్టేస్తారు. చీకటి పడిన తర్వాత మనుషులు మాత్రమే కాదు పక్షులు కూడా ఇక్కడకు వెళ్లవంటారు. ఇందుకు నిదర్శనం ఏంటంటే పగలంతా ఆ వనంలో ఉండే వందల సంఖ్యలో కోతులు, పక్షులు కూడా చీకటిపడగానే ఏమైపోతాయో తెలియదట.
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృతతో ఎవరైనా సహాసం చేసినా చనిపోవడమో, మతిస్థిమితం కోల్పోవడమో జరుగుతుందని స్థానికుల విశ్వాసం. గతంలో అలా జరిగిందని కూడా కథలు కథలుగా చెబుతారు. పైగా ఆ వనానికి చుట్టూ ఉన్న ఏ ఇంటికీ ఎంట్రన్స్ అటువైపు ఉండదు. చీకటి పడగానే అటువైపు ఉన్న కిటికీలు కూడా మూసేస్తారట. ఇప్పటికీ రాథాకృష్ణులు అక్కడ ఏకాంతంగా గడుతారని ఇందుకు నిదర్శనంగా రాత్రివేళ గజ్జెల శబ్దం, వేణనాదం వినిపిస్తాయని అక్కడి చుట్టుపక్కల వారు చెబుతారు.
Alos Read: తీర్థం తీసుకుని చేయి తలకు రాసుకుంటున్నారా…
ఇక్కడి మరో ప్రత్యేకత ఏంటంటే మొక్కల కాండాలన్నీ ఒకేలా ఉంటాయి. చుక్కనీరు పోయకపోయినా పచ్చగా కళకళలాడుతుంటాయంటే అదంతా కృష్ణమాయ అంటారు. వనం మధ్యలో ఉన్న రంగమహల్ లోనే రాధ, కృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతారు. అందువల్లే రాత్రి ఆలయ ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం, ఓ వెండి గ్లాను నిండా పాలు, స్వీట్స్, పళ్లు, తాంబూలం, అలంకార వస్తువులు అక్కడ ఉంచుతారట. ఆలయ ద్వారం తీసే సమయానికి తాంబూలం తిని ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్లతో పాటూ మంచంపై దుప్పటి చెదిరి ఉంటుందట. వేల సంవత్సరాలుగా ఇదే తంతు జరుగుతోందని చాలామంది భక్తులు చెబుతారు.
Also Read: తిరుప్పావై అంటే ఏంటి, ఆండాళ్ ఎవరు.. గోదాదేవి రాసిన 30 పాశురాల ప్రత్యేకత ఏంటి…
ఇక్కడ ఏం జరుగుతోందో వాస్తవం తెలుసుకుంటామంటూ ఎందరో నాస్తికులు, హేతువాదులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదని దేవుడున్నాడని చెప్పేందుకు ఇంతకన్నా నిదర్శం ఏంటంటారు కృష్ణ భక్తులు. ఇప్పుడు అలాంటి ప్రాంతాన్ని కించపరిచేలా సన్నీలియోన్ సాంగ్ ఉందంటున్నారు. సిగ్గుపడే సాహిత్యం, సాహిత్యం విలువలే దిగజార్చేలా ఉందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. 1960లో కోహినూర్ సినిమాలో మహమ్మద్ రఫీ ఆలపించిన పాటను రీమేక్ చేసి ఇలా మధుబన్ లో రాధికా నాట్యం చేసినట్లుగా రూపొందించారు...
Also Read: మంచి భర్త లభించాలన్నా.. సంసార జీవితం సంతోషంగా సాగాలన్నా ఈ నెలరోజులు చాలా ముఖ్యమట...
Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Astrology: మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా
Weekly Horoscope May 16 to 22: ఈ వారం మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Kurma Jayanti 2022: ఈ క్షేత్రంలో స్నానమాచరిస్తే కలిదోషాలు తొలగిపోతాయి
Vaishakh Purnima 2022: వైశాఖపూర్ణిమ, బుద్ధ పూర్ణిమ-ఇలా చేస్తే పితృదోషం, శనిదోషం తొలగిపోతుంది
Today Panchang 16th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఉమామహేశ్వర స్తోత్రం
Batsmen Out At 199: 199 మీద అవుటైన ఏంజెలో మాథ్యూస్ - ఆ 12 మంది సరసన - ఇద్దరు భారతీయలు కూడా!
Mysterious metal balls raining : గుజరాత్లో స్కైలాబ్ తరహా ఘటనలు - ఆకాశం నుంచి ఊడిపడుతున్న శకలాలు !
NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్డేట్ వస్తుందా?
Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !