అన్వేషించండి

Amazon Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్

Amazon gift cards: అమెజాన్ గిఫ్టు కార్డుల అంశంపై పవన్ మరోసారి ట్వీట్ చేశారు. గిఫ్ట్ కార్డుల్లో మనీ లోడ్ చేసుకున్నంత సింపుల్ గా వెనక్కి ఇవ్వాలని ఆయన స్పష్టం చేస్తున్నారు.

Pawan once again tweeted on  Amazon gift cards : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అమెజాన్ గిప్టు కార్డుల అంశంపై మరోసారి స్పందించారు. అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌లో డబ్బును లోడ్ చేసేటప్పుడు సింపుల్ గా లావాదేవీ పూర్తి అయిపోతుందన్నారు.  గడువు ముగిసిన గిఫ్ట్ కార్డ్ నుండి బ్యాలెన్స్‌ను తిరిగి పొందడానికి ఇలాంటి సలువైన ప్రక్రియ లేదన్నారు.  వినియోగదారులు కస్టమర్ సేవను సంప్రదించాలి, వారి పరిస్థితిని వివరించాల్సి ఉంటుందన్నారు. సుదీర్ఘమైన,కష్టమైన విధానాన్ని అనుసరించాల్సి ఉందన్నారు. అలా కాకుండా ఉపయోగించని బ్యాలెన్స్‌ను  సోర్స్ ఖాతాకు లేదా లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసే సులువైన మార్గాన్ని ఎందుకు అమలు చేయరని పవన్ ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల వినియోగదారులు వారి గిఫ్ట్ కార్డ్ వోచర్ డబ్బులను కోల్పోరన్నారు. దీనికి పరిష్కారం వెదకాలని అమెజాన్ ఇండియాను పవన్ కోరారు. అలాగే ఆర్బీఐ, నిర్మలా సీతారామన్ ను కూడా ట్యాగ్ చేశారు. 

 25వ తేదీన పవన్ ఇదే అంశంపై మొదటి సారి ట్వీట్ చేశారు. అమెజాన్ లో గిఫ్టు కార్డులు కొన్న వారు  నష్టపోతున్నామని ఫిర్యాదు చేయడంతో స్పందించారు. ఏడాది   గడువు ముగిసిన గిఫ్ట్ కార్డుల నుండి బ్యాలెన్స్‌లను కోల్పోయే సమస్యను జనసేన ఆఫీస్ కూడా ఎదుర్కొందన్నారు.  చాలా మంది వినియోగదారులు కష్టపడి సంపాదించిన డబ్బు  అమెజాన్ గిఫ్టు కార్డుల్లో నిలిచిపోతోందని.. చివరికి అది అందకుండా పోతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.  
 

అమెజాన్ ఇండియాలో  1 బిలియన్ కంటే ఎక్కువ గిఫ్ట్ కార్డులు కొనుగోలు  చేశారని.. గుర్తు చేశారు.  ప్రీపెయిడ్ చెల్లింపు పరికరాలపై RBI మార్గదర్శకాల ప్రకారం, అన్ని PPIలు కనీసం ఒక సంవత్సరం చెల్లుబాటును కలిగి ఉండాలని పవన్ స్పష్టం చేశారు.  ఒక సంవత్సరం పాటు ఉపయోగించుకోకపోతే  ముందస్తు నోటీసు తర్వాత మాత్రమే ఖాతాను ఇనాక్టివ్ చేయాలన్నారు.  

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన అమెజాన్ పే..
ఈ అంశంపై అమెజాన్ స్పందించింది. ‘Amazon.inలో షాపింగ్‌ను కస్టమర్లు ఆస్వాదిస్తుంటారు. మా కో-బ్రాండెడ్ గిఫ్ట్ కార్డ్‌లు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఆ గిఫ్ట్ కార్డులను లక్షల మంది ఇష్టపడతారు. Amazon.inలో గిఫ్ట్ కార్డ్‌లను ఈజీగా రీడీమ్ చేయవచ్చు. 10,000కు పైగా యాప్‌లలో నిత్యం ఏదో ఒక షాపింగ్ చేసి వాటిని రీడిమ్ చేసే ఛాన్స్ ఉంది. గడువు తేదీ ముగియకముందే కొనుగోలుదారుకు గిఫ్ట్ కార్డ్ పై 2 రిమైండర్‌లను పంపుతారు. గడువు ముగిసిన తర్వాత సైతం కస్టమర్‌ కేర్‌ను సంప్రదిస్తే గడువు ముగిసిన గిఫ్ట్ కార్డులను రీ యాక్టివేట్ చేస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు, మార్గదర్శకాలకు మేం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని’ అమెజాన్ పే ఓ ప్రకటన విడుదల చేసింది.

టాప్ హెడ్ లైన్స్

ITI vs IIT Respect: ఐఐటీ గ్రాడ్యుయేట్లతో సమానంగా ఐటీఐ విద్యార్థులకు గౌరవం.. ప్రధాని మోదీ విజన్‌ను స్వాగతించిన మంత్రి లోకేశ్
ఐఐటీ గ్రాడ్యుయేట్లతో సమానంగా ఐటీఐ విద్యార్థులకు గౌరవం.. ప్రధాని మోదీ విజన్‌ను స్వాగతించిన మంత్రి లోకేశ్
YS Sharmila: బెంగళూరులో షర్మిలకు చేదు అనుభవం.. యలహంక ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
బెంగళూరులో షర్మిలకు చేదు అనుభవం.. యలహంక ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
CM Chandrababu: పంచాయతీల ఏకగ్రీవాలకు భారీ నజరానా.. రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకం- సీఎం చంద్రబాబు
పంచాయతీల ఏకగ్రీవాలకు భారీ నజరానా.. రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకం- సీఎం చంద్రబాబు
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
Viral Video: భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
Safest Electric Cars: జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Congress Politics: గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
Embed widget