Festivals In January 2022: సంక్రాంతి ఒక్కటే కాదు జనవరి నెలంతా పండుగలే...

పాత ఏడాదికి బైబై చెప్పేసి కొత్త ఏడాదికి ఘనంగా ఆహ్వానం పలికే ఉత్సాహం ముగియకముందే సంక్రాంతి సందడి మొదలైపోతుంది. సాధారణంగా జనవరి అనగానే సంక్రాంతి ఒక్కటే హైలెట్ అవుతుంది కానీ..నెలంతా పండుగలే తెలుసా…

FOLLOW US: 

జనవరి 2022 లో ముఖ్యమైన పండుగలు, ప్రత్యేక రోజులు ఇవే...

1 జనవరి 2022- మాస శివరాత్రి
2022 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతాయి. క్రాకర్స్ వెలుగులు, కుర్రకారు జోష్, ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులు అబ్బో ఆ కిక్కే వేరు. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం ఇదే రోజు మాస శివరాత్రి వేడుకలు కూడా జరుపుకుంటారు. న్యూ ఇయర్-మాస శివరాత్రి రెండూ కలసి రావడంతో ఆలయాలు కిక్కిరిసిపోతాయి. 

2 జనవరి 2022- పౌష్య అమావాస్య
2022 జనవరి 2 న తమిళనాడు ప్రాంతంలో హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. ఇదే రోజు వచ్చిన అమావాస్యని పౌష్య అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజు కూడా నవగ్రహాల ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. 

06,07 జనవరి 2022-వినాయక చతుర్థి, స్కంద షష్టి
జనవరి ఆరో తేదీన వినాయక చతుర్థి, ఏడో తేదీన స్కంద షష్టి జరుపుకుంటారు. స్కంద షష్టి రోజు సుబ్రమణ్యస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. 

Also Read: 2022 లో ఈ రాశుల వారు ఈ పనులు చేయకండి..
09 జనవరి 2022- భాను సప్తమి
జనవరి నెలలో తొమ్మిదో తేదీన భాను సప్తమి వచ్చింది. ఈ రోజు సూర్యుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆయుష్షు, ఆరోగ్యం ప్రసాదించమని  ప్రత్యక్ష దైవాన్ని ప్రార్థిస్తారు. ఇదే రోజున గురు గోవింద్ సింగ్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. 

10 జనవరి 2022- బనద అష్టమి
జనవరి నెలలో పదో తేదీన బనద అష్టమి రోజు  దుర్గామాతకి పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన వారికి అన్నీ శుభఫలితాలే అని చెబుతారు పండితులు. 

12 జనవరి 2022- వివేకానంద జయంతి
జనవరి 12 స్వామి వివేకానంద జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. 

Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
13 జనవరి 2022- వైకుంఠ ఏకాదశి-భోగి
ఈ రోజు వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈ రోజున విష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు ఏర్పాటు చేస్తారు.  ఇదే రోజున భోగి పండుగ. ఉత్తర భారతదేశంలో 'లోహ్రి' అనే పేరుతో సంబరాలు జరుపుకుంటారు. 

14 జనవరి 2022- సంక్రాంతి
జనవరి 14 మకర సంక్రాంతి వేడుకలు ఎలా జరుపుకుంటారో తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇతర రాష్ట్రాల్లో పొంగల్ పేరుతో నిర్వహిస్తారు. ఇదే రోజున ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తాడు. 

15 జనవరి 2022- కనుమ
జనవరి 15వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో కనుమ పండుగ నిర్వహిస్తారు. ఇదే రోజున ప్రదోష వ్రతం కూడా వస్తుంది. తమిళనాడులో మట్టు పొంగల్ గా జరుపుకుంటారు. ఈ సమయంలోనే నిర్వహించే పోటీలే జల్లికట్టు. 

Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
17 జనవరి 2022-శాకాంబరి పౌర్ణమి
జనవరి 17న వచ్చే పౌర్ణమిని శాకాంబరి పౌర్ణమి అని పిలుస్తారు. ఈరోజున పౌష పూర్ణిమ వ్రతం చేస్తారు. 

31 జనవరి 2022
జనవరి 30 న మాస శివరాత్రి, 31న అమావాస్య వస్తుంది. ఈ అమావాస్యనే దర్శ అమావాస్య అంటారు.  ఇదే రోజు ఉత్తరాదిన ప్రదోశ్ వ్రతం నిర్వహిస్తారు. 

Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: january 2022 calendar january 2022 january 2022 festivals january calendar 2022 calendar january 2022 january 2022 ka calender hindu calendar 2022 january january festival list 2022 2022 january calendar 2022 calendar january calendar 2022 january 2022 calendar in telugu 2022 calendar important days of january 2022 calendar list 2022 festivals of january 2022 january 2022 good days 2022 ka calendar good days in january 2022 january good days 2022 జనవరిలో పండుగలు

సంబంధిత కథనాలు

Hanuman Special: 'లూసిఫర్' కి పంచముఖ ఆంజనేయుడికి లింకేంటి

Hanuman Special: 'లూసిఫర్' కి పంచముఖ ఆంజనేయుడికి లింకేంటి

Astrology: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!

Astrology: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!

Today Panchang 17th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఆంజనేయ అష్టోత్తరం

Today Panchang 17th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఆంజనేయ అష్టోత్తరం

Horoscope Today 17th May 2022: ఈ రాశివారికి గ్రహాల అనుగ్రహం పుష్కలంగా ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 17th May 2022:  ఈ రాశివారికి గ్రహాల అనుగ్రహం పుష్కలంగా ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Tirumala Garuda Seva: శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ, వర్షాన్ని లెక్కచేయని భక్తులు

Tirumala Garuda Seva: శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ, వర్షాన్ని లెక్కచేయని భక్తులు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!

Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!

Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై 

Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై 

AP PCC New Chief Kiran : వైఎస్ఆర్‌సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?

AP PCC New Chief Kiran :   వైఎస్ఆర్‌సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?

Cabs Bundh: అలర్ట్! ఈ నెల 19న క్యాబ్స్ బంద్, ఆటోలు కూడా - పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు

Cabs Bundh: అలర్ట్! ఈ నెల 19న క్యాబ్స్ బంద్, ఆటోలు కూడా - పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు