By: ABP Desam | Updated at : 31 Dec 2021 12:39 PM (IST)
Edited By: RamaLakshmibai
Horoscope 2022
New Year 2022 Rasi Phalalu in Telugu: మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారంతా. 2020 ఇయర్ ఎండ్ తో పోలిస్తే..2021 ఇయర్ ఎండ్ కాస్త ఉపశమనం కల్పించిందనే చెప్పాలి. గతేడాది ఇదే టైమ్ లో కరోనా సెకెండ్ వేవ్ కల్లోలం మామూలుగా లేదు. కుటుంబాలకు కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయాయ్. ఈ ఏడాది కూడా ఒమిక్రాన్ భయం ఉన్నప్పటికీ గడిచిన సంవత్సరం కన్నా కాస్త ఉపశమనంగానే ఫీలవుతున్నారంతా. దీంతో రెండేళ్లుగా వెంటాడుతున్న మహమ్మారి నుంచి కొత్త ఏడాదైనా ఉపశమనం కల్పించాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం రెండూ మరింత మెరుగుపడాలని కోరుకుకుంటున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త ఏడాదిలో ఏ రాశి వారు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం.
మేషం
పాత విషయాలు, ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఆలోచనలకు పాత ఏడాదితోనే స్వస్తి చెప్పేసి...2022 సంవత్సరంలో కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నించాలి మేషరాశి వారు. మీలో నైపుణ్యాన్ని ముందు మీరు గుర్తించి ఆ రంగంలోనే ధైర్యంగా అడుగేస్తే సక్సెస్ మీ వెంటే ఉంటుంది.
వృషభం
2021లో అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొన్న వృషభరాశి వారు 2022లో సక్సెస్ అవ్వాలంటే ముందుగా కంగారు పడటం మానేయాలి. అలాగని అత్యంత ధీమాగానూ ఉండకూడదు. సరికొత్త ఉత్సాహంతో, తలపెట్టిన పనుల పట్ల శ్రద్ధతో ముందుకెళ్లాలి. కేవలం ఇంత వరకూ చేస్తే చాలు అనే ఆలోచన వదిలిపెట్టి కొత్త బాధ్యతలు స్వీకరించి నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి.
మిథునం
మిధున రాశివారికి ఈ ఏడాది కూడా అంత అనుకూలంగా లేదు. చేపట్టిన పనుల్లో ఎక్కువగా ప్రతికూల ఫలితాలే ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రెగ్యులర్ వర్స్క్ లో చిన్నపాటి మార్పులు చేసుకుని వ్యాయామంపై దృష్టి సారించండి.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
కర్కాటకం
కర్కాటక రాశి వారికి గడిచిన ఏడాదితో పోల్చుకుంటే అంతా కొత్త కొత్తగా ఉంటుంది. ఈ ఏడాది మీ జీవితంలో, కెరీర్లో ఊహించని మార్పులొస్తాయి. వీటిలో ఏది మంచి-ఏది చెడు అనేది నిర్ణయించుకోవాల్సింది మీరే. మీరు తీరుకునే నిర్ణయంపైనే మీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అయితే ముఖ్య సూచన ఏంటంటే ఏ చిన్న అవకాశాలన్నీ వదిలుకోకుండా ఉండటం మంచిది.
సింహం
ఈ రాశి వారు 2022లో చాలా సహనంగా ఉండాలి. పనిచేయగానే ఫలితాన్ని ఆశించవద్దు. పట్టుదలతో పని పూర్తిచేస్తే కాస్త ఆలస్యం అయినా మంచి ఫలితం వస్తుంది. కోపం తగ్గించుకోండి, సహనంగా వ్యవహరించండి. ఆవేశంతో కాకుండా ఆలోచనతో అడుగేయండి. ఎంత ఓపికగా ఉంటే అంత మంచి జరుగుతుంది.
కన్య
ఎప్పుడూ ఎవరో ఒకరి గురించి ఆలోచించే మీరు.. ఈ ఏడాదిలో మీకోసం మీరు ఎక్కువ సమయం కేటాయించుకునేందుకు ట్రై చేయండి. అందరితో మంచి బంధం, స్నేహం కొనసాగిస్తూనే మీ పనులేవీ నిర్లక్ష్యం చేయకుండా చూసుకోండి. ముఖ్యంగా సాయం చేయాలనుకునే మీ మంచి తనాన్ని ఉపయోగించుకోవాలి అనేవారిని గుర్తించి వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. మిమ్మల్ని అభిమానిచే వారికోసం కొంత టైమ్ కేటాయించండి.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
తుల
2022 సంవత్సరం తుల రాశివారికి బాగానే కలిసొస్తుంది. ఈ రాశి వారు ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళితే అనుకున్నవన్నీ సాధిస్తారు. అంటే ముందుగానే ఓ ప్రణాళిక వేసుకోవాలి. ఏ పని చేయాలి, ఏది వద్దు, ఏది ముందు, ఏది వెనుక అని ఆలోచించి ముందుకెళ్లాలి. అనవసరమైన విషయాల గురించి ఎక్కువ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు.
వృశ్చికం
అన్నీ తెలుసు అనుకుంటారు, అందరూ తమ కనుసన్నల్లోనే ఉన్నారనుకుంటారు కానీ వీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్లే వెన్నుపోటు పొడుస్తారని గుర్తించలేకపోతారు. అందుకే తమకు అన్నీ తెలుసునే భ్రమలో అందర్నీ గుడ్డిగా నమ్మడం మానేయాలి. ముఖ్యంగా మీరంటే గిట్టని వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందులో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉండొచ్చు. ఎంత సంపాదించాం అన్నది కాదు ఎంత దాచాం అన్న విషయం చాలా ముఖ్యమని గుర్తించాలి.
ధనస్సు
ఈ రాశి వారు 2022 సంవత్సరంలో ఆర్థిక పరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరి కోసమో అనవసరమైన ఖర్చులు చేయకండి. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
మకరం
ఈ రాశి వారు 2022 లో చాలా జాగ్రత్తగా వ్యవహించాలి. ఇంటా-బయటా ఎదురయ్యే ప్రతికూలతలను సమర్థంగా ఎదుర్కొనేలా తమని తాము సిద్ధం చేసుకోవాలి. చేపట్టే పని ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురైనా పూర్తిచేసే దిశగా ముందుకు సాగాలి. ముఖ్యంగా అనవసరం అయిన విషయాలను ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ఎవరి విధులను వారు శ్రద్ధగా నిర్వర్తిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.
కుంభం
కుటుంబ బంధాల్లో మునిగిపోయిన వారు కాస్త బయటకు వచ్చి ప్రశాంతంగా గడిపేందుకు ప్రయత్నించండి. నిత్యం సంపాదన, పని అనడమే కాదు అప్పుడప్పుడు విశ్రాంతి కూడా అవసరం అని గుర్తించండి. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. కొత్తగా ఆలోచనలు అమలు చేస్తే మీరున్న రంగంలో విజయాలు సాధిస్తారు.
మీనం
గతేడాది వెంటాడిన కష్టాల నుంచి 2022 ఉపశమనాన్ని ఇస్తుంది. సంతోషంగా ఉండేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ప్రియమైన వారితో, స్నేహితులతో , సన్నిహితులతో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి.
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Astrology:ఈ రాశులవారు మాటలపోగులు, మనసులో ఏ విషయాన్నీ దాచుకోలేరు!
Significance of Aarti in Hinduism : ఆలయాల్లో హారతి ఎందుకిస్తారు - ఆ సమయంలో ఘంటానాదం ఎందుకు!
Horoscope Today November 30th: ఈ రాశివారి మాట, మనసు రెండూ చంచలమే - నవంబరు 30 రాశిఫలాలు
December 2023 Monthly Horoscope : ఈ 6 రాశులవారికి ఆదాయం, ఆనందం, విజయాన్నిచ్చి వెళ్లిపోతోంది 2023
December 2023 Monthly Horoscope : 2023 డిసెంబరు నెల ఈ రాశులవారికి కొన్ని హెచ్చరికలు చేస్తోంది
Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!
Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?
Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం
Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!
/body>