News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Horoscope:మీ నక్షత్రం...మీ రాశి....ఏ నక్షత్రానికి ఏ అక్షరాలో ఇలా తెలుసుకోండి...

నక్షత్రం ఏంటో కొందరికి క్లారిటీ ఉండదు. నక్షత్రం తెలిసినా ఏ రాశి అని మరికొందరికి డౌట్. నక్షత్రం-రాశి తెలియని వారికి పేరులో మొదటి అక్షరం ఆధారంగా ఎలా తెలుసుకోవాలో తెలియదు. వాటన్నింటికీ సమాధానం ఈ స్టోరీ.

FOLLOW US: 
Share:

మీ నక్షత్రం...మీ రాశి....ఏ నక్షత్రానికి ఏ అక్షరాలో ఇలా తెలుసుకోండి...

జాతక ఫలితాల కోసం సాధారణంగా నక్షత్రాలను పరిశీలుస్తుంటారు. మంచి చెడులు చూడాలన్నా, ముహూర్తం నిర్ణయించాలన్నా మీ నక్షత్రం ఏంటి, రాశి ఏంటని అడుగుతుంటారు. ఇక్కడే కొంతమంది గందరగోళానికి గురవుతుంటారు. ఎందుకంటే పిల్లలు పుట్టిన సమయంలో ఉండే నక్షత్రానికి సంబంధించిన అక్షరంతో పేరు నిర్ణయిస్తారు. మరికొందరు నక్షత్రం గుర్తుంటుందనే ఉద్దేశంతో పిల్లలకు నచ్చిన పేర్లు పెట్టుకుంటారు.  అందుకే నామ నక్షత్రం, జన్మ నక్షత్రం అంటాం.

నక్షత్రం ఏంటో తెలిసిన వారికి రాశి విషయంలో, అసలు నక్షత్రమే తెలియని వారికి పేరు ఆధారంగా ఎలా తెలుసుకోవాలో అన్నది  కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి వారికోసం ఫుల్ క్లారిటీతో వివరాలు అందిస్తోంది మీ ఏబీపీ దేశం.....

మొత్తం 27 నక్షత్రాలు..12 రాశులు....
ఒక్కో నక్షత్రంలో నాలుగు పాదాలు...ఒక్కో రాశిలో 9 పాదాలు....

నక్షత్రం తెలిసిన వారు మీ రాశి ఏంటో ఇక్కడ చూసుకోవచ్చు...

రాశి  నక్షత్రం
మేషం అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం
వృషభం కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
మిధునం  మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
కర్కాటకం   పునర్వసు నాలుగో పాదం, పుష్యమి, ఆశ్లేష
సింహం మఘ, పుబ్బ(పూర్వ ఫల్గుణి), ఉత్తర(ఉత్తర ఫల్గుణి)1వ పాదం
కన్య  ఉత్తర(ఉత్తర ఫల్గుణి) 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు 
తుల చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు 
వృశ్చికం విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ 
ధనస్సు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
మకరం ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
కుంభం  ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు 
మీనం పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయని చెప్పుకున్నాం కదా. ఓ నక్షత్రం కాస్త అటు ఇటుగా 24 గంటలు ఉంటుంది. 24 ని నాలుగు భాగాలు చేస్తే 6 గంటలు. అంటే నక్షత్రంలో మొదటి 6 గంటలు మొదటి పాదం, తర్వాతి 6 గంటలు రెండో పాదం, మూడో ఆరోగంటలు మూడోపాదం..ఆఖరి 6 గంటలు నాలుగోపాదం. మీ పాదాన్ని బట్టి మీ రాశి మారుతుందని గమనించగలరు.

నక్షత్రం తెలియని వారు మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా తెలుసుకోవచ్చు....

అశ్వని: చూ/చే/చో/ లా
భరణి: లీ/లూ/లే/లో
కృత్తిక: ఆ/ఈ/ఊ/ ఏ
రోహిణి: ఈ/వా/వీ/వూ
మృగశిర: వే/వో/కా/కీ,
ఆరుద్ర:కూ/ ఖం/ జ/ ఛా
పునర్వసు: కే/కో/ హ/ హీ/
పుష్యమి: హు/హే/హో/డా
ఆశ్లేష: డీ/డూ/డే/డో
మఖ: మా/ మి/ మూ/మే
పూర్వ ఫల్గుణి: మో /టా/ టీ/ టూ
ఉత్తర ఫల్గుణి: / టే/టో/ పా /పీ
హస్త: వూ/షం /ణా/ ఢా
చిత్త: పే/పో/రా/రి
స్వాతి: రూ/ రే/ రో /లా
విశాఖ: తీ/తూ/తే /తో
అనూరాధ: /నా /నీ /నూ /నే
జ్యేష్ట:నో /యా /యీ/యూ
మూల: యే /యో /బా/ బీ
పూర్వాషాడ: బూ/ ధా /భా /ఢా
ఉత్తరాషాడ: బే/బో / జా / జీ
శ్రవణం: జూ/జే /జో/ ఖా
ధనిష్ట: గా/ గీ/ గూ/గే
శతభిషం:  గో /సా/ సీ /సూ
పూర్వాభద్ర:  సే /సో/ దా/దీ
ఉత్తరా బాధ్ర: ధు/శ్చం/చా/ధా
రేవతి: దే/దో/చా/చీ

Published at : 16 Jul 2021 12:29 PM (IST) Tags: Horoscope Rasi nakshatram janma nakshtra nama nakshtra

ఇవి కూడా చూడండి

Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు

Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు

Spirituality: సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Spirituality:  సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

What is happening in YSRCP : ఎమ్మెల్యే పదవికే కాదు వైసీపీకి కూడా ఆళ్ల రాజీనామా - వైఎస్ఆర్‌సీపీలో ఏం జరుగుతోంది ?

What is happening in YSRCP : ఎమ్మెల్యే పదవికే కాదు వైసీపీకి కూడా ఆళ్ల రాజీనామా  - వైఎస్ఆర్‌సీపీలో ఏం జరుగుతోంది ?

Bandlagooda Private School: ప్రైవేట్ స్కూల్ అత్యుత్సాహం - అయ్యప్ప మాల ధరించిన బాలికను అనుమతించని యాజమాన్యం

Bandlagooda Private School: ప్రైవేట్ స్కూల్ అత్యుత్సాహం - అయ్యప్ప మాల ధరించిన బాలికను అనుమతించని యాజమాన్యం

Chittoor District News: చిత్తూరు జిల్లా ప్రజలను వణికిస్తున్న ఏనుగుల గుంపు- కుప్పంలో హై అలర్ట్

Chittoor District News: చిత్తూరు జిల్లా ప్రజలను వణికిస్తున్న ఏనుగుల గుంపు- కుప్పంలో హై అలర్ట్

Nelson Dilipkumar: రజనీకాంత్‌ను అలా చూపించొద్దన్నారు, భయమేసినా వెనక్కి తగ్గలేదు: ‘జైలర్’ దర్శకుడు నెల్సన్‌

Nelson Dilipkumar: రజనీకాంత్‌ను అలా చూపించొద్దన్నారు, భయమేసినా వెనక్కి తగ్గలేదు: ‘జైలర్’ దర్శకుడు నెల్సన్‌