By: ABP Desam | Updated at : 18 Jan 2022 07:21 AM (IST)
Edited By: RamaLakshmibai
పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది..
అప్పట్లో ఆపరేషన్ల హడావుడి పెద్దగా ఉండేది కాదు....నార్మల్ డెలివరీ కావడంతో పిల్లలు పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం, పాదం ఏంటో చూసి అవసరమైన శాంతి, పూజలు , జపాలు, హోమాలు చేయించేవారు. ఇప్పుడంతా ట్రెండ్ మారింది. శుభసమయం, శాంతి లేని నక్షత్రం చూసుకుని మరీ ఆపరేషన్లు చేయిస్తున్నారు. కొన్ని తప్పని పరిస్థితుల్లో మాత్రం శాంతి నక్షత్రాల్లో పుట్టిన పిల్లలు ఉన్నారు. మరి ఏ నక్షత్రం, ఏఏ పాదాల్లో పుడితే ఎలాంటి దోషమో తెలుసుకోండి...
Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1
అశ్విని నుంచి రేవతి వరకూ మొత్తం 27 నక్షత్రాలు, ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయి. కొన్ని నక్షత్రాల్లో నాలుగు పాదాలకి దోషం ఉంటే..మరికొన్ని నక్షత్రాల్లో ఒక్కో పాదానికి ఒక్కో ఫలితం ఉంటుంది.
8. పుష్యమి నక్షత్రం కర్కాటక లగ్నం పగటి సమయమున మగపిల్లాడు పుడితే తండ్రికి, రాత్రి వేళ ఆడపిల్ల పుడితే తల్లికి గండం ఉంటుందని చెబుతారు. పుష్యమి నక్షత్రం రెండు, మూడు పాదాల్లో జన్మిస్తే తల్లిదండ్రులకు దోషం ఉంటుందని..ఒకటి, నాలుగు పాదాల్లో పుడితే ఎలాంటి దోషం లేదంటారు.
9. ఆశ్లేష నక్షత్రం 1 వ పాదంలో పుట్టినవారికి ఎలాంటి దోషం లేదు. 2 వ పాదం శిశువుకు 3 వ పాదం తల్లికి 4 వ పాదం తండ్రికి దోషం . నాలుగవ పాదము న జన్మించిన వారికి శాంతి తప్పనిసరి.
10. మఖ నక్షత్ర 1 వ పాదంలో పుడితే శిశువుకి దోషం, రెండో పాదంలో పుడితే మంచిదే. మూడో పాదం తల్లిదండ్రులకు దోషం ఉంటుంది. 4 పాదములలో జన్మించిన దోషము లేదు.
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
11. పుబ్బ నక్షత్రముం1 2 3 4..ఏ పాదంలో జన్మించినా ఎలాంటి దోషమూ ఉండదు. అంటే శాంతి అవసరం లేదన్నమాట.
12. ఉత్తర నక్షత్రం 1, 4 పాదాల్లో పుడితే తల్లి, తండ్రులకు దోషం కలుగుతుంది. మిగతా 2 3 పాదములలో పుట్టిన వారికి దోషం లేదు. నాలుగో పాదంలో పుట్టిన వారికి స్వల్ప దోషం ఉంటుంది.
13. హస్తా నక్షత్రం 3 వ పాదంలో పుట్టిన మగపిల్లాడి వల్ల తండ్రికి, ఆడపిల్ల వల్ల తల్లికి దోషం. మిగతా 1 2 4 పాదాల్లో జన్మించిన వారికి దోషం లేదు.
14. చిత్త నక్షత్రం 1 వ పాదం, 2 వ పాదం తల్లిదండ్రులకు దోషం ఉంటుంది. మూడు, నాలుగు పాదాలు స్వల్పదోషం ఉంటుంది.
15. స్వాతి నక్షత్రం 1 2 3 4 పాదాల్లో ఏ పాదంలో జన్మించినా ఎలాంటి దోషమూ లేదు..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
నక్షత్రంతో సంబంధం లేకుండా పేగులు మెడలో వేసుకుని పుట్టినా, కాళ్లు మొదట బయటకు వస్తూ పుట్టినా, గ్రహణ సమయంలో జన్మించినా, తండ్రిదండ్రులు, తోబుట్టువల జన్మ నక్షత్రంలో పుట్టినా తప్పక శాంతి చేయించాలి. శాంతిరోజు ఏం చేయాలనేది నక్షత్రం, పాద దోషంపై ఆధారపడి ఉంటుంది. మీరు విశ్వసించే పండితుల దగ్గరకు వెళ్లి పూర్తివివరాలు తెలుసుకుని శాంతి చేయించాలి...
శిశువు జన్మించిన తర్వాత పురిటి శుద్ధి అయ్యాక జన్మపత్రిక రాయించుకుని, దోషాలేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకోవాలి.శిశువు పుట్టిన 27 రోజుల లోపు శాంతి జరిపించుకోవాలి. ఎంత ఆలస్యం చేస్తే అన్ని సమస్యలు ఎదురవుతాయి అంటారు పెద్దలు. అందుకే సాధ్యమైనంత తొందరగా శాంతి జరిపించాలంటారు.
మిగిలిన నక్షత్రాలకు సంబంధించిన వివరాలు రేపటి కథనంలో చూడగలరు...
నోట్- దోషం ఉన్న నక్షత్రంలో జన్మించినంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే అపోహవద్దు. ఈ కథనం భయభ్రాంతులకు గురిచేయలనే ఉద్దేశం ఎంత మాత్రమూ కాదు. కేవలం కొన్ని శాంతులు, హోమాలు, జపాలు చేయడం ద్వారా చెడు ఫలితాలు పూర్తిగా తొలిగిపోతాయంటారు. అయితే ఏం చేసినా నమ్మకం ప్రధానం..అది లేనప్పుడు నక్షత్ర దోషాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: కర్మ అంటే ఏంటి.. పదే పదే ఈ మాట అనొచ్చా.. పురాణాలు ఏం చెబుతున్నాయి...
Also Read: చేయి నాకి నాకి తింటున్నారా.. మీకు ఆ వ్యామోహం చాలా ఎక్కువట..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Horoscope Today September 22, 2023 :ఈ రాశివారు టైమ్ వేస్ట్ చేయడంలో ముందుంటారు, సెప్టెంబరు 22 రాశిఫలాలు
Astrology : ఈ రాశివారు బాగా సంపాదిస్తారు తక్కువ ఖర్చు చేస్తారు!
Astrology : ఈ రాశివారు ఎప్పుడూ ఒకరి అధీనంలోనే ఉంటారు, ఈ రాశివారి లక్షణమే ఇది!
Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయణం చేయాల్సిన సందర్భాలివే!
Chanakya Niti In Telugu : భర్త అనుమతి లేకుండా భార్య వెళ్లకూడని 4 ప్రదేశాలు ఇవే!
Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
/body>