NAKSHATRA / STAR : పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1
పిల్లలు పుట్టినప్పుడు నక్షత్రం మంచిదేనా,శాంతి చేయించాలా అనే సందేహం కలుగుతుంది. కొన్ని నక్షత్రాల్లో పుట్టిన పిల్లల వల్ల తల్లిదండ్రులకు, మేనమామకు, పుట్టిన పిల్లలకు దోషం ఉంటుంది. ఆ నక్షత్రాలేంటో చూద్దాం
అప్పట్లో ఆపరేషన్ల హడావుడి పెద్దగా ఉండేది కాదు....నార్మల్ డెలివరీ కావడంతో పిల్లలు పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం, పాదం ఏంటో చూసి అవసరమైన శాంతి, పూజలు , జపాలు, హోమాలు చేయించేవారు. ఇప్పుడంతా ట్రెండ్ మారింది. శుభసమయం, శాంతి లేని నక్షత్రం చూసుకుని మరీ ఆపరేషన్లు చేయిస్తున్నారు. కొన్ని తప్పని పరిస్థితుల్లో మాత్రం శాంతి నక్షత్రాల్లో పుట్టిన పిల్లలు ఉన్నారు. మరి ఏ నక్షత్రం, ఏఏ పాదాల్లో పుడితే ఎలాంటి దోషమో తెలుసుకోండి...
Also Read: ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు...
అశ్విని నుంచి రేవతి వరకూ మొత్తం 27 నక్షత్రాలు, ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయి. కొన్ని నక్షత్రాల్లో నాలుగు పాదాలకి దోషం ఉంటే..మరికొన్ని నక్షత్రాల్లో ఒక్కో పాదానికి ఒక్కో ఫలితం ఉంటుంది.
1. అశ్విని 1 వ పాదములో పుట్టిన పిల్లల వల్ల తండ్రికి దోషం. అశ్విని 2 3 4 పాదాల్లో జన్మించిన వారికి దోషం లేదు.
2. భరణి 1 2 4 పాదాల్లో పుట్టిన పిల్లలకు ఎలాంటి దోషం లేదు. 3 వ పాదములో ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్ల పుడితే తండ్రికి దోషం ఉంటుంది.
3. కృత్తిక నక్షత్రంలో 3వ పాదంలో పుట్టిన ఆడపిల్ల వల్ల తల్లికి, మగపిల్లాడు వల్ల తండ్రికి దోషం ఉంటుంది. 1 2 4 పాదాల్లో పుట్టిన వారికి స్వల్ప దోషం ఉంటుంది.
4. రోహిణి నక్షత్రం 1 వ పాదంలో జన్మిస్తే మేనమామకు, రెండో పాదంలో తండ్రికి, మూడో పాదంలో తల్లిది దోషం ఉంటుంది. నాలుగో పాదంలో పుడితే ఎవ్వరికీ ఎలాంటి దోషం ఉండదు. సామాన్యంగా ఈ నక్షత్రంలో పుట్టిన బిడ్డ వలన మేనమామకు గండం తప్పదని..తప్పకుండా శాంతి చేయించాలని చెబుతారు. శ్రీ కృష్ణుడు ఈ నక్షత్రంలోనే జన్మించాడు అందుకే కంసుడు నాశనమయ్యాడని పురాణ వచనం.
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
5. మృగశిర 1 2 3 4 పాదాల్లో జన్మించిన వారికి ఎలాంటి దోషాలు ఉండవు.
6. ఆరుద్ర నక్షత్రం 1 2 3 పాదముల్లో జన్మంచిన వారికి దోషం లేదు 4 వ పాదంలో పుడితే సామాన్య శాంతి అవసరం.
7. పునర్వసు నక్షత్రము 1 2 3 4 పాదములు అన్నీ మంచివే. ఏ విధమైన శాంతి అవసరము లేదు.
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
నక్షత్రంతో సంబంధం లేకుండా పేగులు మెడలో వేసుకుని పుట్టినా, కాళ్లు మొదట బయటకు వస్తూ పుట్టినా, గ్రహణ సమయంలో జన్మించినా, తండ్రిదండ్రులు, తోబుట్టువల జన్మ నక్షత్రంలో పుట్టినా తప్పక శాంతి చేయించాలి. శాంతిరోజు ఏం చేయాలనేది నక్షత్రం, పాద దోషంపై ఆధారపడి ఉంటుంది. మీరు విశ్వసించే పండితుల దగ్గరకు వెళ్లి పూర్తివివరాలు తెలుసుకుని శాంతి చేయించాలి...
శిశువు జన్మించిన తర్వాత పురిటి శుద్ధి అయ్యాక జన్మపత్రిక రాయించుకుని, దోషాలేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకోవాలి.శిశువు పుట్టిన 27 రోజుల లోపు శాంతి జరిపించుకోవాలి. ఎంత ఆలస్యం చేస్తే అన్ని సమస్యలు ఎదురవుతాయి అంటారు పెద్దలు. అందుకే సాధ్యమైనంత తొందరగా శాంతి జరిపించాలంటారు.
మిగిలిన నక్షత్రాలకు సంబంధించిన వివరాలు రేపటి కథనంలో చూడగలరు...
నోట్- దోషం ఉన్న నక్షత్రంలో జన్మించినంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే అపోహవద్దు. ఈ కథనం ద్వారా భయభ్రాంతులకు గురిచేయలనే ఉద్దేశం ఎంత మాత్రమూ లేదు. కేవలం కొన్ని శాంతులు, హోమాలు, జపాలు చేయడం ద్వారా చెడు ఫలితాలు పూర్తిగా తొలిగిపోతాయంటారు. అయితే ఏం చేసినా నమ్మకం ప్రధానం..అది లేనప్పుడు నక్షత్ర దోషాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: కర్మ అంటే ఏంటి.. పదే పదే ఈ మాట అనొచ్చా.. పురాణాలు ఏం చెబుతున్నాయి...
Also Read: చేయి నాకి నాకి తింటున్నారా.. మీకు ఆ వ్యామోహం చాలా ఎక్కువట..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి