Zodiac Signs: ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు...

ఓ వ్యక్తి తెలివి తేటలు వారి రాశిని బట్టి కూడా అంచనా వేయొచ్చట. మిగిలిన రాశులతో పోలిస్తే ఆ ఐదు రాశులవారు చాలా తెలివైనోళ్లంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఆ రాశులేంటో చూద్దాం..

FOLLOW US: 

పుట్టుకతోనే వీళ్లు తెలివైనోళ్లని కొందర్ని చూసి అంటుంటారు. కానీ ఆ మాట నిజమే. తెలివితేటలు అంటే కేవలం చదువులో ముందుండడం మాత్రమే కాదు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటినుంచి బయటపడం ఎలా, సమస్యల్ని పరిష్కరించడం ఎలా అన్నది అప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సరైన సమయంలో సరైన వారికోసం తక్కువ సమయంలో ఎవరైతే బుర్రవాడుతో వాళ్లే జీనియస్.  ఇలాంటి లక్షణాలు ఈ రాశులవారి సొంతం. 

మేషం
ఈ రాశి వారికి అన్నింటికంటే ముఖ్యమైన ఆయుధం వారి  సిక్త్ సెన్స్. ఈ రాశివారి ఆలోచనలు చాలా వేగవంతంగా ఉంటాయట.  అంతే వేగంగా తీసుకున్న నిర్ణయాలను అమల్లో పెడతారు. ఆత్మవిశ్వాసంతో ఉండే వీరిని మోసం చేయడం అంత ఈజీ కాదట. వీరి మనసు నిరంతర ఆలోచనా స్రవంతి లాంటిదంటారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. 

Also Read:  2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..

కన్య
ఈ రాశి వారు చాలా సైలెంట్‌గా, రిజర్వ్‌డ్ గా ఉంటారని అనుకుంటారు కానీ వీరి సైలెన్స్ వెనుక అవతలి వారిని నిశింతగా పరిశీంచడానికి మాత్రమే అని వీరికి మాత్రమే తెలుసు. వీరి దగ్గర పరిష్కారం లేని సమస్య ఉండదట. వీలైనంత తక్కువ సమయంలోనే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. వీరితో స్నేహం చేయాలని చాలామంది ఆసక్తి చూపుతారు. 

సింహం
ఆత్మవిశ్వాసం నిండిన రాశి సింహం. వీరు ఏం చేసినా విజయం సాధిస్తారు..అంటే..వీరి ప్లానింగ్ ఆలోచనా విధానం అంత పర్ ఫెక్ట్ గా ఉంటుందట. వ్యక్తిగత జీవితంతో పాటూ వృత్తిలోనూ వీరి ఆలోచనలు అద్భుతంగా ఉంటాయట. అందుకే సింహ రాశి వారు ఇంటా-బయటా హీరోస్ గా నిలబడతారట.  పెద్దగా అవసరం లేని విషయాల్లో తెలివి తేటలు ఉపయోగించి సమయం వృధా చేసుకోకుండా కేవలం టార్గెట్ రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడే బ్రెయిన్ కి పదునుపెడతారట. తాము చేయాలనుకున్న పనికి ఎవరైనా అడ్డుపడితే అస్సలు ఊరుకోరట. 

Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
వృశ్చికం
జ్యోతిష్యం ప్రకారం వృశ్చిక రాశి వారు చాలా తెలివైనవాళ్లు. తెలివితేటలు మాత్రమే కాదు సీరియస్ గా ఉంటారు, అందంగా ఉంటారు, అట్రాక్ట్ చేస్తారు వీటన్నంటికిన్నా తెలివితేటల్లో అందరి కన్నా ముందుంటారట.  క్లిష్టమైన సందర్భాల్లో వీరి మెదడు చాలా వేగంగా పనిచేస్తుందంటారు. నేర్చుకునే తత్వం కూడా వీరికి చాలా ఎక్కువ. ఎవరైనా తమకు వ్యతిరేకంగా ఏదైనా ప్లాన్ చేస్తే.. వారి ప్రవర్తనతో పాటు ఇతర అంశాల ద్వారా చిన్న క్లూ దొరికినా దాన్ని గుర్తించేస్తారు. అందుకే వృశ్చికరాశి వారిని అపర చాణక్యుడు అంటారట. 

మకరం
ఈ రాశి వారి ఐక్యూ లెవెల్స్ ఓ రేంజ్ లో ఉంటాయట. మార్కెట్లు, ట్రెండ్స్ అర్థం చేసుకోవడంలో వీరు ముందుంటారు. చాలా కష్టపడి ఫేమస్ అవుతారు. తమ తెలివిని ఉపయోగించి ఎవరి సహాయం లేకుండానే జీవితంలో ముందుకెళ్తారు. మిగిలిన రాశుల వారితో పోల్చితే.. చదువులో కూడా వీరు చాలా ముందుంటారట. ఎంత క్లిష్టమైన సమస్యకైనా వీరి దగ్గర పరిష్కారం ఉంటుంది. వేరేవారి ఆలోచనలు ఎక్కడ ఆగిపోయాయో వీరి ఆలోచనలు అక్కడి నుంచి మొదలవుతాయట. 

Note:  మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి.

Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
Also Read: చెడు మాట్లాడకు.. తథాస్తు దేవతలున్నారు అంటారు కదా.. నిజంగా ఉన్నారా, దీని వెనుక అసలు విషయం ఏంటి..
Also Read:  జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
Also Read: ప్రతిష్ఠాత్మక యునెస్కో జాబితాలో చేరిన కోల్ కతా దుర్గామాత వేడుకలు

 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 17 Dec 2021 08:52 PM (IST) Tags: Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Constellations Zodiac Very Intelligent Astrologists Specialists Strategies

సంబంధిత కథనాలు

Horoscope 2nd July  2022: ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉండదు, జులై 2 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 2nd July 2022: ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉండదు, జులై 2 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Panchang 2nd July 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఏలినాటి, అష్టమ, అర్దాష్టమ శనిదోష నివారణ స్తోత్రం

Panchang  2nd July 2022:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం,  ఏలినాటి, అష్టమ, అర్దాష్టమ శనిదోష నివారణ స్తోత్రం

Jagannath Rath Yatra 2022: పూరి జగన్నాథుడి విగ్రహాల్లో ఓ బ్రహ్మపదార్థం ఉంటుంది, అదేంటో తెలుసా!

Jagannath Rath Yatra 2022: పూరి జగన్నాథుడి విగ్రహాల్లో ఓ బ్రహ్మపదార్థం ఉంటుంది, అదేంటో తెలుసా!

Transfers In AP: దేవాదాయ శాఖ‌లో సామూహిక‌ బ‌దిలీలు- అర్థరాత్రి జీవో విడుదల

Transfers In AP: దేవాదాయ శాఖ‌లో సామూహిక‌ బ‌దిలీలు- అర్థరాత్రి జీవో విడుదల

Jagannath Rath Yatra 2022: పూరీ జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు!

Jagannath Rath Yatra 2022: పూరీ జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు!

టాప్ స్టోరీస్

BJP PLenary Plan On TRS : తెలంగాణలో కాషాయజెండా పాతడమే లక్ష్యం ! బీజేపీ అత్యున్నత భేటీ వెనుక అసలు వ్యూహం ఇదే

BJP PLenary Plan On TRS :  తెలంగాణలో కాషాయజెండా పాతడమే లక్ష్యం ! బీజేపీ అత్యున్నత భేటీ వెనుక అసలు వ్యూహం ఇదే

Chandrababu : జగన్‌ను చూసి చాలా నేర్చుకున్నాను - చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు !

Chandrababu :  జగన్‌ను చూసి చాలా నేర్చుకున్నాను -   చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు !

Anushka: ప్రభాస్ సినిమాలో అనుష్క - నిజమేనా?

Anushka: ప్రభాస్ సినిమాలో అనుష్క - నిజమేనా?

Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్

Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్