అన్వేషించండి

VSP Liquor Shop : జగన్ టూర్‌లో పోలీసుల రూల్స్ ! మద్యం దుకాణం మాత్రమే ప్రత్యేకం.. మిగతావన్నీ మూత !

విశాఖలో జగన్ పర్యటనకు వస్తున్నారని దుకాణాలన్నీ మూసివేయించిన పోలీసులు మద్యం దుకాణం జోలికి మాత్రం వెళ్లలేదు.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఓ లిక్కర్ షాపు తెరిచి ఉండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే లిక్కర్ షాపు తెరవడంలో విశేషం ఏముందని అనుకోవచ్చు కానీ.. అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. చుట్టుపక్క ఏ ఒక్క దుకాణం తెరవలేదు. ఎవర్నీ ఆ రోడ్డు మీదకు అనుమతించలేదు. కానీ ఒక్క లిక్కర్ దుకాణానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అందుకే ఆ మద్యం దుకాణం వ్యవహారం హైలెట్ అవుతోంది. 

సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖలోని శారదాపీఠం లో జరుగుతున్న వార్షిక ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చారు. విశాఖ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన చినముషిడివాడలోని శారదాపీఠానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్లారు. ఈ రోడ్డును భద్రతా కారణాల రీత్యా పోలీసులు బ్లాక్ చేశారు. రోడ్డు రెండు వైపులా బారీకేడ్లు పెట్టారు. ఆ రోడ్ల పక్కన ఉన్న దుకాణాలను తెరవ వద్దని పోలీసులు ముందు రోజే యజమానాలకు సమాచారం ఇచ్చారు. 

సీఎం జగన్ పర్యటన అయిపోయిన తర్వాత దుకాణాలకు తెరిచేందుకు అనుమతిస్తమని చెప్పారు. దానికి తగ్గట్లుగానే యజమానులు ఎవరూ దుకాణాలు తెరవలేదు. దీంతో ఆ రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది. కానీ ఒక్క దుకాణం తెరిచారు. ఆ దుకాణం వద్ద రద్దీ కూడా ఉంది. అదే మద్యం దుకాణం. ప్రభుత్వమే మద్యం దుకాణం నిర్వహిస్తూండటంతో  తప్పనిసరిగా తెరిచినట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వ మద్యం దుకాణం కావడంతో పోలీసులు కూడా ఆ దుకాణాన్ని మూసివేయమని చెప్పలేదు. అదే సమయంలో  ఆ దుకాణానికి మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చేవారిని అనుమతించారు. ఇతరులను మాత్రం అనుమతించలేదు. 

ఈ మద్యం దుకాణం వీడియో వైరల్ కావడంతో  తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇదేనా రామరాజ్యంలో ఓ భాగం అంటూ టీడీపీ నేత నారా లోకేష్ ట్వీట్ చేశారు. 

ఇక టీడీపీ సోషల్ మీడియా ఈ వీడియోను విపరీతంగా వైరల్ చేస్తోంది. నిత్యావసర దుకాణాలు, మెడికల్ షాప్స్‌ను కూడా మూసివేయించిన పోలీసులు ఒక్క మద్యం దుకాణానికి అనుమతి ఇవ్వడమేమిటన్న ఆశ్చర్యం విశాఖ వాసుల్లోనూ కనిపిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
Green Talent: గ్రీన్ టాలెంట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి - సుజ్లాన్‌తో ప్రత్యేక ఒప్పందం - ఏడున్నర లక్షల ఉద్యోగాలు..
గ్రీన్ టాలెంట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి - సుజ్లాన్‌తో ప్రత్యేక ఒప్పందం - ఏడున్నర లక్షల ఉద్యోగాలు..
Thief Kisses Woman: ఏమీ దొరకలేదని ఇంటావిడకు ముద్దు పెట్టి వెల్లిన దొంగోడు - ఆమె కోవై సరళ అవతారమే ఎత్తిందంతే !
ఏమీ దొరకలేదని ఇంటావిడకు ముద్దు పెట్టి వెల్లిన దొంగోడు - ఆమె కోవై సరళ అవతారమే ఎత్తిందంతే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP DesamUnion Health Minister HMPV Virus | హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోగల సత్తా మనకు ఉంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
KTR: మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
మళ్లీ ఈడీ నోటీసులు - సత్యం కోసం పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్
Green Talent: గ్రీన్ టాలెంట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి - సుజ్లాన్‌తో ప్రత్యేక ఒప్పందం - ఏడున్నర లక్షల ఉద్యోగాలు..
గ్రీన్ టాలెంట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి - సుజ్లాన్‌తో ప్రత్యేక ఒప్పందం - ఏడున్నర లక్షల ఉద్యోగాలు..
Thief Kisses Woman: ఏమీ దొరకలేదని ఇంటావిడకు ముద్దు పెట్టి వెల్లిన దొంగోడు - ఆమె కోవై సరళ అవతారమే ఎత్తిందంతే !
ఏమీ దొరకలేదని ఇంటావిడకు ముద్దు పెట్టి వెల్లిన దొంగోడు - ఆమె కోవై సరళ అవతారమే ఎత్తిందంతే !
Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
PM Fasal Bima Yojana: రైతులకు గుడ్ న్యూస్ - వరికి బీమా ప్రీమియం గడువు పొడిగింపు
రైతులకు గుడ్ న్యూస్ - వరికి బీమా ప్రీమియం గడువు పొడిగింపు
Harish Rao on KTR Arrest: కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Viral News: ఒరే ఆజాము ఎంత గ్యాంగ్‌స్టర్‌వి అయితే మాత్రం గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే రోజు ఇలా చేయాలా ? - అదిత్యనాథ్ ఒక చూపు చూస్తే ...
ఒరే ఆజాము ఎంత గ్యాంగ్‌స్టర్‌వి అయితే మాత్రం గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే రోజు ఇలా చేయాలా ? - అదిత్యనాథ్ ఒక చూపు చూస్తే ...
Embed widget