Chandrababu Case : చంద్రబాబు కేసులో చార్జిషీట్‌ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు - ఎందుకంటే ?
ACB court : చంద్రబాబుపై దాఖలు చేసిన ఐఆర్ఆర్ కేసులో చార్జిషీటును ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం గవర్నర్ అనుమతి కావాలని స్పష్టం చేసింది.
Chandrababu Case :చంద్రబాబుపై ఐఆర్ఆర్ కేసులో సీఐడీ ఛార్జిషీట్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం అనుమతి లేదని కోర్టు స్పష్టం చేసింది. గురువారం ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు ఏపీ సీఐడీ అధికారులు – ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్, రాజశేఖర్, నారా లోకేశ్ ను నిందితులుగా పేర్కొన్నారు. సీఐడీ ఛార్జిషీట్ ను తిరస్కరించడంతో సీఐడీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో A1 గా చంద్రబాబు (Chandrababu), A2గా మాజీ మంత్రి నారాయణ (Narayana) పేర్లను జోడించింది. లోకేష్ (Lokesh), లింగమనేని రాజశేఖర్, రమేష్ లను ముద్దాయిలుగా పేర్కొంది. సింగపూర్ తో గతంలో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందాలు చేసుకుందని సీఐడీ తెలిపింది. గవర్నమెంట్ టూ గవర్నమెంట్ ఒప్పందమే జరగలేదని సీఐడీ తెలిపింది. సింగపూర్ తో ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లేదన్నారు చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్ కు టీడీపీ ప్రభుత్వం డబ్బులు చెల్లించారని తెలిపింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ లను రూపొందించారని.. లింగమనేని, మాజీ మంత్రి నారాయణ భూములకు అనుగుణంగా ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ ను మార్చినట్లు సీఐడీ ఛార్జి షీట్ లో పేర్కొంది.
చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్‌కు డబ్బులు చెల్లింపులు జరిగాయని తెలిపిదంి. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్‌రోడ్డు, సీడ్ క్యాపిటల్, మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టు పేర్కొంది. ఇన్నర్ రింగ్‌రోడ్డును లింగమనేని భూములు, హెరిటేజ్ భూములు, నారాయణ భూములకు అనుగుణంగా మార్చినట్టు సిఐడి ఛార్జిషీట్‌లో వెల్లడించింది. ’58 ఎకరాల భూములను బంధువుల పేరుతో మాజీ మంత్రి నారాయణ కొన్నారు. లింగమనేని 340 ఎకరాల ల్యాండ్ బ్యాంకుకు మేలు చేసేలా అలైన్‌మెంట్ మార్పులు చేశారు. లింగమనేని నుండి చంద్రబాబుకు ఇంటిని ఇచ్చారు’ అని సిఐడి తెలిపింది. లింగమనేని ల్యాండ్ బ్యాంక్ పక్కనే హెరిటేజ్ 14 ఎకరాల భూములు కొన్నట్టు పేర్కొంది.
అయితే అసలు లేని.. ఒక్క ఎకరం కూడా సేకరించని.. రూపాయి ఖర్చు పెట్టని ఐఆర్ఆర్ లో అవినీతి ఏమిటని టీడీపీ ఇప్పటికే తమ వాదన వినిపించింది. తప్పుడు కేసులు పెట్టి.. తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప ఒక్క సాక్ష్యం కూడా లేదని అంటున్నారు. ఇప్పుడు అసలు చార్జిషీట్‌నే పరిగణనలోకి తీసుకునేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడంతో సీఐడీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.