Raviteja: థియేటర్లలో రవితేజ 'మాస్ జాతర' - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Naga Vamsi: మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర' రిలీజ్‌పై నిర్మాత నాగవంశీ తాజాగా అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీ జులైలో రిలీజ్ కానున్నట్లు తెలిపారు. విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది.

Raviteja's Mass Jathara Movie Release Update: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర' (Mass Jathara) షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ మూవీ విడుదలపై తాజా ప్రెస్ మీట్‌లో నిర్మాత నాగవంశీ (Naga Vamsi) తాజా అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీ జులైలో రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ఈ మూవీకి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.
ధమాకా తర్వాత క్రేజీ కాంబో
'ధమాకా' వంటి హిట్ తర్వాత మరోసారి రవితేజ (Raviteja) సరసన శ్రీలీల (Sreeleela) నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ కాంబోపై క్రేజ్ నెలకొంది. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.
#NagaVamsi pic.twitter.com/Oau3TGlXYx
— Absolute KCPD (@AbsoluteKCPD) April 1, 2025
ఈ మూవీ తర్వాత కిశోర్ తిరుమలతో పాటు 'మ్యాడ్' ఫేమ్ కల్యాణ్ శంకర్ చెప్పిన స్టోరీలకు రవితేజ ఓకే చెప్పినట్లు సమాచారం. తాజాగా.. రవితేజ - కల్యాణ్‌ల ప్రాజెక్టుపై అధికారికంగా స్పష్టత వచ్చింది. దీన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో నిర్మించనున్నట్లు నాగవంశీ వెల్లడించారు.
కేజీఎఫ్ స్థాయిలో కింగ్ డమ్
మరోవైపు, ఇదే ప్రెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'కింగ్ డమ్' మూవీ గురించి కూడా నాగవంశీ మాట్లాడారు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కేజీఎఫ్ స్థాయిలో ఉంటాయని అన్నారు. ఈ మూవీలో అన్ని లాజిక్‌లు ఉంటాయని.. సందేహాలన్నింటికీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన వర్క్‌తో ఫుల్ క్లారిటీ ఇస్తారని చెప్పారు. ఇది కచ్చితంగా హిట్ అవుతుందన్నారు.
#Kingdom KGF Range Story……🔥#NagaVamsi #VijayDeverakonda @vamsi84 pic.twitter.com/2dgobOytLa
— Telugu Funda (@TeluguFunda) April 1, 2025
బన్నీ, త్రివిక్రమ్ మూవీపై అప్‌డేట్
అటు, బన్నీ త్రివిక్రమ్ మూవీపైనా నాగవంశీ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు నాగవంశీ. ఈ మూవీ పూర్తిగా మైథలాజికల్ జానర్ అని.. సోషియా ఫాంటసీ అని స్పష్టం చేశారు. పురాణాల్లో ఎవరూ ఊహించని ఓ దేవుని కథ ఆధారంగా ఈ మూవీ ఉంటుందని.. అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని అన్నారు. ఈ మూవీపై అటు ఫ్యాన్స్, ఇటు సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.
మరోవైపు, 'మ్యాడ్ స్క్వేర్' రివ్యూలపై సోషల్ మీడియా పోస్టులపై నిర్మాత నాగవంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటెంట్ ఉన్న సినిమాలు బాగా అడతాయని.. ఓ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు ఎందుకు ప్రోత్సహించరని అన్నారు. కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందనే చాలామంది పోస్టులు చేశారని.. అలా ఆడడానికి ఇదేమీ పుష్ప 2, బాహుబలి 2, కేజీఎఫ్ 2 కాదని అన్నారు. ఉన్నది ఉన్నట్లు చెప్పడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.






















