Naga Vamsi: అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీపై అధికారిక అప్ డేట్ - స్టోరీపై నిర్మాత నాగవంశీ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
Allu Arjun Trivikram: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ఓ మూవీ రాబోతున్న క్రమంలో దీనిపై నిర్మాత నాగవంశీ అదిరే అప్ డేట్ ఇచ్చారు. అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని స్పష్టం చేశారు.

Producer Naga Vamsi About Allu Arjun Trivikram Mythological Movie: 'పుష్ప 2' (Pushpa 2) వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో ఓ మూవీ రాబోతోంది అనే విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై క్రేజీ రూమర్స్ చక్కర్లు కొడుతున్న తరుణంలో నిర్మాత నాగవంశీ దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
అక్టోబరు నుంచి షూటింగ్
ఈ మూవీ సోషియా ఫాంటసీ కాదని పూర్తిగా మైథలాజికల్ జానర్ అని నాగవంశీ (Naga Vamsi) అన్నారు. 'పురాణాల్లో ఎవరూ ఊహించని ఓ దేవుని కథ ఆధారంగానే మూవీ ఉంటుంది. అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.' అని స్పష్టం చేశారు. అయితే, ఈ సినిమా గురించి అటు బన్నీ ఫ్యాన్స్, ఇటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో బన్నీ కుమారస్వామిగా కనిపించనున్నారనే వార్తలు ఇటీవల హల్చల్ చేశాయి.
తాజాగా.. పూర్తి మైథలాజికల్ అని నాగవంశీ క్లారిటీ ఇవ్వడంతో త్రివిక్రమ్ కాంబోలో అల్లు అర్జున్ కుమారస్వామిగా ఈ మూవీ ఎలా ఉంటుందో అనే హైప్ నెలకొంది. మరోవైపు, బన్నీ కుమారస్వామిగా ఉన్న జీబ్లీ ఇమేజ్‌లు తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
#AlluArjun & #Trivikram’s upcoming project is a complete mythology-based film.
— Filmyscoops (@Filmyscoopss) April 1, 2025
This will be something never seen before! We are planning to start the shoot from October.
- #NagaVamsi pic.twitter.com/7YGyomtTl6
Also Read: 'నా సినిమా రివ్యూలు రాయడం మానేయండి' - వారిపై నిర్మాత నాగవంశీ ఆగ్రహం
భారతదేశమే ఆశ్చర్యపోయేలా..
ఈ మూవీని చూసి భారతదేశమే ఆశ్చర్యపోతుందని గత ఇంటర్వ్యూల్లో నాగవంశీ చెప్పారు. రామాయణం, మహాభారతం వంటి ప్రసిద్ధ ఇతిహాసాలపై కాకుండా.. ఎవరికీ తెలియని మైథలాజికల్ కథలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నట్లు చెప్పారు. పురాణాల్లో ఎవరికీ తెలియని ఓ దేవుని కథ అని పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుందని అన్నారు. ఒకవేళ ఆ గాడ్ పేరు విన్నా ఆయన వెనుక ఉన్న కథ ఎవరికీ తెలియదని.. ఎవరూ ఊహించరని.. దాని ఆధారంగానే తాము సినిమా రూపొందిస్తున్నామని నాగవంశీ స్పష్టం చేశారు.
ఆ రూమర్లకు చెక్ పెట్టినట్లేనా..
మరోవైపు, ఈ మూవీ స్టోరీ ఇంకా పూర్తి కాలేదని.. త్రివిక్రమ్ ఇంకా టైం తీసుకునేలా ఉండడంతో ప్రాజెక్ట్ కాస్త ఆలస్యం అవుతుందనే రూమర్లకు నాగవంశీ ప్రకటనతో చెక్ పడినట్లయిందనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కన్నా ముందు అట్లీతో బన్నీ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందనే ఇటీవల వార్తలు వచ్చాయి.
బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో వీరి కాంబోలో వస్తోన్న 'AA22' ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైథలాజికల్ జానర్‌లో వస్తుండడంతో ఈ మూవీపై మరింత క్రేజ్ నెలకొంది.





















