Breaking News Telugu Live Updates: తెలంగాణలో తొలి రోజు ముగిసిన రాహుల్ భారత్ జోడో పాద యాత్ర
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE
Background
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ముప్పు ఏపీకి తప్పిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు రోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం ఉత్తర, పశ్చిమ దిశలలో ప్రయాణించి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. ఆపై బంగాళాఖాతంలో వాయుగుండం సిత్రాంగ్ తుపానుగా మారిందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. సిత్రాంగ్ తుపానుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పు లేదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తున్నాయి. అక్టోబర్ చివరి నాటికి ఏపీలో పూర్తి స్థాయిలో వ్యాపించే అవకాశం ఉంది.
సిత్రాంగ్ తుపాను అక్టోబర్ 24 ఒడిశా తీరాన్ని చేరుకుని, అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య సిత్రాంగ్ తుపాను తీరం దాటుతుందని అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు ఒడిశా, విదర్భా మీదుగా ఉపసంహరించుకుంటున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రానికి ఎలాంటి వర్ష హెచ్చరికలు జారీ కాలేదు. సిత్రాంగ్ తుఫానుతో ఏపీ, తెలంగాణలకు ఎలాంటి సమస్య లేదని అధికారులు తెలిపారు.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో నేడు పలుచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణపై సిత్రాంగ్ తుపాను ప్రభావం లేదు. కనుక భారీ వర్షాలు కురిసే అవకాశమే లేదు. తుపాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. నేడు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈశాన్య దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 29 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలుగా నమోదైంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఈశాన్య రుతుపవనాలు విస్తరణ పూర్తయితే నవంబర్ మొదటి వారం నుంచి కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో పరిస్ధితి చూస్తే జంట ఉపరితల ఆవర్తనాల ప్రాంతాలు, తెలంగాణ మీదుగా అధికపీడన ప్రాంతం ఏర్పడింది. సిత్రాంగ్ తుపాను ముప్పు తప్పినప్పటికీ, ఏపీపై కాస్త ప్రభావం చూపుతోంది. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పలుచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలున్నాయి. వర్ష సూచనతో మూడు రోజులవరకు ఎల్లో వార్నింగ్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్ష సూచన ఉంది. తీరంలో 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, వీటి వేగం 55 కిలోమీటర్లు దాటే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం సురక్షితం కాదని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
బంగాళాఖాతంలో వాయుగుండం సిత్రాంగ్ తుపానుగా మారింది. తుపాను ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై చాలా తక్కువగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలున్నాయి. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. రాయలసీమపై తుపాను ప్రభావం చాలా తక్కువగా ఉంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో తొలి రోజు ముగిసిన రాహుల్ భారత్ జోడో పాద యాత్ర
తెలంగాణలో తొలి రోజు ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో పాద యాత్ర.. గూడబల్లేరు నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్ శంషాబాద్ కు బయలుదేరిన రాహుల్ గాంధీ..
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్ల నున్న రాహుల్ గాంధీ..
ఇప్పటి నుంచి పాదయాత్ర కు విరామం.. 27వ తేదీ ఉదయం తిరిగి ప్రారంభం కానున్న రాహుల్ భారత్ జోడో యాత్ర..
గూడబల్లేరు నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్ శంషాబాద్ కు బయలుదేరిన రాహుల్ గాంధీ..
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్ల నున్న రాహుల్ గాంధీ..
ఇప్పటి నుంచి పాదయాత్ర కు విరామం.. 27వ తేదీ ఉదయం తిరిగి ప్రారంభం కానున్న రాహుల్ భారత్ జోడో యాత్ర..
తెలంగాణలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ఎంట్రీ
మహబుబ్ నగర్.. తెలంగాణ లోకి ఎంట్రీ అయిన రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర...
కృష్ణా మండలం కృష్ణా బ్రిడ్జి పై తెలంగాణ లోకి ఎంట్రీ....
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడికి కాంగ్రెస్ జెండా ను అప్పగించిన కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్
కామారెడ్డిలో నకిలీ నోట్ల చలామణి ముఠా గుట్టురట్టు
కామారెడ్డిలో నకిలీ కరెన్సీ కలకలం....
నకిలీ నోట్ల చలామణి ముఠా గుట్టురట్టు
కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో నకిలీ కరెన్సీ తయారీ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్ర, నాందేడ్, భైంసా, నిజామాబాద్ లకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1.65 లక్షల నఖిలి కరెన్సీ, నోట్ల తయారీకి ఉపయోగించే రసాయనాలను, పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.
టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం, ఇద్దరి దుర్మరణం
విజయవాడ: దీపావళి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో విషాదం చోటుచేసుకున్నది. టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. నగరంలోని గాంధీనగర్ జింఖానా గ్రౌండ్‌లో పటాకుల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఓ దుకాణంలో పటాకీ పేలింది. దీంతో షాపులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఒక్కొక్కటిగా అన్ని పటాకులు పేలడంతో మంటలు పక్కనేఉన్న రెండు దుకాణాలు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో మూడు షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతులను పటాకుల దుకాణంలో పనిచేసే సిబ్బందిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.