Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోలో అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్ - నేటి నుంచే ఫ్రీగా ఎంజాయ్ చేయండి!

Metro Rail: మెట్రో రైలులో ప్రయాణించే వారు ఉచితంగానే ఓ సినిమా చూసేలా హైస్పీడ్ ఇంటర్‌నెట్ ను మరింత వేగవంతం చేశారు.

FOLLOW US: 

Hyderabad Metro Rail: హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ప్రయాణికులను విపరీతంగా ఆకర్షించే మరో అద్భుత ఆఫర్‌తో ముందుకు వచ్చింది. అయితే, ఇది టికెట్ ధరల్లో ఆఫర్ కాదుగానీ, మెట్రో ఎక్కిన ప్రయాణికులకు మాత్రం కావాల్సినంత వినోదాన్ని అందించనుంది. మెట్రో రైలులో ప్రయాణిస్తూ ఉచితంగానే ఓ సినిమా చూసేలా మెట్రో సంస్థ ఏర్పాట్లు చేసింది. మెట్రో రైలులో ప్రయాణించే వారు ఉచితంగానే ఓ సినిమా చూసేలా హైస్పీడ్ ఇంటర్‌నెట్ ను మరింత వేగవంతం చేశారు. కావాలంటే ఆ సినిమాను డౌన్‌లోడ్‌ కూడా చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. సినిమాలే కాకుండా వారు ఇస్తున్న హై స్పీడ్ ఇంటర్నెట్ సాయంతో వేగవంతమైన బ్రౌజింగ్, ఎంటర్టైన్ మెంట్, షాపింగ్‌ ఇలా నచ్చినవి చేసుకోవచ్చు. 

ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రోలో షుగర్‌ బాక్స్‌ (Sugar Box) అనే సంస్థ ఇంటర్నె్ట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. 2019 నుంచి ఈ సంస్థ హైదరాబాద్ మెట్రోలో ప్రస్తుతం అంతరాయం లేని హై స్పీడ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా అమీర్‌ పేటలోని మెట్రో స్టేషన్‌లో మంగళవారం షుగర్‌ బాక్స్‌ సంస్థ తన డిజిటల్‌ హైస్పీడ్‌ ఇంటర్నెట్ కనెక్టివిటీ సర్వీసెస్‌ను ప్రవేశ పెట్టింది. ఇందుకుగాను పేటెంటెడ్‌ క్లౌడ్‌ ఫ్రాగ్‌మెంట్‌ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నట్లు షుగర్ బాక్స్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఫ్రీ ఇంటర్నెట్ సేవలు వాడుకోవాలంటే ఇలా
మెట్రో రైలులో ప్రయాణించేటప్పుడు ఉచితంగా సినిమాలు చూడడం, డౌన్ లోడ్ చేసుకోవడం లేదా ఫ్రీగా ఇంటర్నెట్ వాడుకోవాలనుకునేవారు తప్పనిసరిగా షుగర్ బాక్స్ అనే యాప్‌ను ప్లే స్టోర్‌లో నుంచి డౌన్ చేసుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. షుగర్ బాక్స్ యాప్ ద్వారా అపరిమిత ఇంటర్నెట్‌ను యాక్సె్స్ చేయొచ్చని వెల్లడించారు. 

ఇటీవలే ఈ-ఆటోలు అందుబాటులోకి..
హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణించే వారికి రైలు దిగాక లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా ఈ-ఆటోలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.మెట్రో రైడ్ అనే సంస్థ మెట్రో స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు ఈ-ఆటోలను నడపనుంది. దీంతో ఇక మెట్రో రైలు దిగగానే గమ్యస్థానానికి చేరుకునేందుకు ప్రయాణికులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండబోదు. మెట్రో దిగగానే ఎలక్ట్రిక్‌ ఆటోలు ఈ - ఆటోలు సిద్ధంగా ఉంటాయి. ప్రత్యేకించి మెట్రో రైలు స్టేషన్ల నుంచే వివిధ ప్రాంతాలకు ఈ ఆటోలు తిరుగుతాయి.

మొదటి కిలోమీటరుకు రూ.10, తర్వాత ప్రతి కి.మీకి రూ.6 వసూలు చేస్తారు. 5 కిలోమీటర్ల పరిధిలోనే ఈ-ఆటోలు తిరగనున్నాయి. దశల వారీగా ప్రతి నెలా రెండు మూడు స్టేషన్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

Published at : 27 Apr 2022 11:14 AM (IST) Tags: Hyderabad Metro Hyderabad metro latest news free movies in metro sugar box in metro Hyderabad metro offers Internet in metro

సంబంధిత కథనాలు

Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు

Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

Kishan Reddy On TRS: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పెట్టుబడులు కేంద్రం ఘనతే- ప్రజలు గమనిస్తున్నారన్న కిషన రెడ్డి

Kishan Reddy On TRS: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పెట్టుబడులు కేంద్రం ఘనతే- ప్రజలు గమనిస్తున్నారన్న కిషన రెడ్డి

Hyderabad Crime : ఇళ్లు రెంట్ కు చూపిస్తానని చెప్పి యువతిపై అత్యాచారయత్నం, వాట్సాప్ గ్రూప్ ద్వారా ట్రాప్!

Hyderabad Crime : ఇళ్లు రెంట్ కు చూపిస్తానని చెప్పి యువతిపై అత్యాచారయత్నం, వాట్సాప్ గ్రూప్ ద్వారా ట్రాప్!

టాప్ స్టోరీస్

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్ 

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్ 

Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?

Texas School Shooting :  మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?